కార్తీకదీపం Serial Today Episode(23/10/2024)

దీప జీవితంలో నవ వసంతం…

కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం, దీప కోసం సౌర్య ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ దీప లు ఇంటికి వచ్చేస్తారు, అప్పుడు సౌర్య దీపని పట్టుకుని అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావ్ అమ్మ, నా మీద కోపం వచ్చిందా అయితే నన్ను కొత్తమ్మా అంటూ దీప చేతులతో కొట్టుకుంటుంది సౌర్య, అప్పుడు దీప సౌర్య అంటూ దగ్గరకి లాక్కుని ఏడుస్తుంది, అప్పుడు సౌర్య దీపని నీకు చెప్పకుండా పారిపోయి భాద పెట్టాను, కార్తీక్ నాన్న గా కావాలి అంటూ మల్లి భాద పెట్టాను, అందుకే నా మీద కోపం వచ్చిందా అంటుంది, అప్పుడు దీప నీ మీద నాకు ఏ కోపం లేదు అమ్మ, నిన్ను వదిలేసి ఎక్కడికి వేత్తను చెప్పు అంటుంది, అప్పుడు సౌర్య నువ్వు నాకు కావాలమ్మా , కార్తీక్ కూడా కావాలి, మీలో ఎవరు దూరంగా వెళ్ళిపోయినా నేను భాద పడతాను, ఏడుస్తాను, తాతయ్య తో చెప్తాను అంటుంది, అప్పుడు అనసూయ దీప ని నువ్వు భ్రతికేదే దాని కోసం అంటావు కదా, మరి దాన్ని సంతోషంగా ఉంచవా, అది ఏం చేస్తే సంతోషం గా ఉంటుందో చెప్పింది కదా అయినా నీకు అర్ధం కావడం లేదా అంటుంది, అప్పుడు కాంచన మాకు ఎవ్వరికి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ దీప అంటుంది, కార్తీక్ దీప ఎక్కడికి వెళ్ళింది అని కార్తీక్ ని అడుగుతుంది కాంచన, అప్పుడు కార్తీక్ సౌర్య ని లోపలి వెళ్ళమని, దీప తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మ, జరిగింది ఈవిడ దృష్టిలో మహా పాపం కదా, ఎక్కడ నిందలు పడతాయో ఎక్కడ వేలు ఎత్తి చూపిస్తారో అని, కన్న కూతుర్నే క్షమించని మీ నాన్న ని క్షమించమని అడగటానికి వెళ్ళింది, మనల్ని అయితే పద్దతిగా పొమ్మన్నారు, అదే దీపని అయితే మర్యాదగా గెంటేశారు అంటాడు, సమయానికి వెళ్లి నేను పెట్టుకోకపోతే వాకిట్లో పడేది అంటాడు, అప్పుడు దీప ని కార్తీక్ అయినా ఆ మనుషులతో  నీకు పనేంటి దీప వాళ్ళని ఎందుకు క్షమాపణ అడగాలి అంటాడు, అప్పుడు దీప నేను మీకు జ్యోత్స్న కు పెళ్లి జరిపిస్తాను అని సుమిత్రమ్మ కి, జ్యోత్స్న కి, పారిజాతం గారికి మాట ఇచ్చాను, మాట ఇచ్చి తప్పితే ఎలా ఉంటుందో మీకు ఆ భాద అర్ధం కాదు అంటుంది,  ఇచ్చిన మాట ని నిలబెట్టుకోలేక పోయాను, మోసం చేసిన దానిలా మిగిలిపోయాను, అవకాశం వదిలా మిగిలిపోయాను, వాళ్ళ మొహం సుటుగా చూడలేకపోతున్నాను బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ నువ్వు సూటిగా చూడలేనంత తప్పేం చెయ్యలేదు దీప, ఎందుకంటే నీ ప్రమేయం లేకుండా నీకు ఇష్టం లేకుండా నీ మేడలో తాళి కట్టాను, నా ఫ్రెండ్ బాగుండాలనే స్వార్థం నాది దాని మొహం లో కన్నీళ్లు తప్ప సంతోషం చూడాలనుకునే స్వార్థం నాది, అది తప్పయితే నేను చేసిందే తప్పే నేనే తప్పు చేసినట్టు, నువ్వు ఈ ఇంటి మనిషి దీప నీ మర్యాదే నా మర్యాద నువ్వు ఎవరి ముందు తలవంచద్దు అంటాడు, అప్పుడు దీప వద్దు బాబు నన్ను మీతో కలిపి మీ పరువుపోగొట్టుకోవద్దు, ఈ రోజు తో నేను కాపాడుకుంటూ వచ్చిన అభిమానం అంత గంగలో కలిసిపోయింది, మీ ఆవేశాలకు స్వార్దాలకు వివరణలు ఉన్నాయ్, కానీ అవేమి మీరు హత్య చేసిన నా వ్యక్తిత్వాన్ని బ్రతుకించలేవు, మీకు మీ ఆశీర్వాదాలు నమస్కారాలు, నేను ఇంకా బయల్దేరతాను అంటుంది, అప్పుడు కాంచన దీప నువ్వు నా కోడలివి, నువ్వు ఈ ఇంటి గడప దాటి వెళ్లొద్దు, నీ అత్తగారిగా నేను చెప్తున్నాను ఈ గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు అంటుంది, అప్పుడు దీప వడమ్మ నాకు అలంటి అర్హత లేదు నన్ను వెళ్లనివ్వండి అంటుంది, అప్పుడు అనసూయ ఇదే వచ్చిన అదృష్టాన్ని వద్దు అనుకోకూడదు ఇదంతా ఆ ముత్యాలమ్మ తల్లి నీకు ఇచ్చిన వరం, నీ జీవితం కూడా పారె నది లాంటిది ఎన్నో రాళ్ల దెబ్బలు మలుపులు చూసావ్ అయినా ఆగకుండా నిలబడ్డావ్ ఇప్పుడు సముద్రం నిన్ను కలుపుకుంది దానితో కలిసి కలకలం నడవడమే, నీ మేనత్త ఒక ఆడదానిలా చెప్తున్నాను, నీ జీవితానికి ఇది నవ వసంతం, కాళీ పోయిన థాలితో పటు ఆ బంధం కూడా కాలిపోయింది, నీ ఈ నవవసంతానికి శివుడి ముందు పెట్టె కార్తీక దీపం చేస్కో అంటుంది దీప ని. అప్పుడు సౌర్య వచ్చి కార్తీక్ చేతిని దీప చేతిని పట్టుకుని నానమ్మ మా అమ్మ నాన్న ఎప్పుడు నాతోనే ఉంటారు అంటుంది, అప్పుడు అనసూయ దీప ఈ చంటిది నీ నోములపంటే ఎందుకంటే ఎక్కడయినా తల్లి ఇతడే మీ నాన్న అని పరిచయం చేస్తుంది కానీ నీ కూతురు తనకు తండ్రిని చేస్కుని నీకు భర్తని తీసుకొచ్చింది అంటుంది దీప ని, అప్పుడు కాంచన అవును అనసూయ, కోడల్ని కూతురుగా చేస్కుని నాకు కోడల్ని చేసావ్ ఎవరు ఎక్కడికి వెళ్లారు మనమంతా ఒక కుటుంబం మనమంతా ఒక కుటుంబం అంటుంది. ఏ జన్మ  లోనో మనకు ఋణం ఉంది దీప అందుకే మనం నీ కూతురు ద్వారా కలిసాం అంటాడు కార్తీక్.

                                       కిర్తీక్ తండ్రి రెండో భార్య, తన కూతురికి ఫోన్ చేసి కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడని తెల్సా అంటుంది అప్పుడు ఆమె తెల్సు అమ్మ ఎప్పడు ఏం చెయ్యాలో దేవుడికి తెల్సు అమ్మ అంటుంది, అప్పుడు ఆమె దీప మీ ఇంటికి వస్తుందేమో రానివ్వద్దు ఎంత దూరం గా ఉంటె అంత మంచిది అంటుంది, అప్పుడు స్వప్న సారీ అమ్మ నిన్ను తిడుతున్నందుకు, మీ పెళ్లి విష్యం బయట పడుతుందని కూతురికి ఇష్టం లేని పెళ్లి చెయ్యడానికి కూడా మీరు రాయ్ అయిపోయారు, కానీ దీప ఇష్టానికి ఉన్న విలువ అర్ధం చేస్కుని మాకు పెళ్లి జరిపించింది, దీప ఇప్పుడు నా వదిన, మా అన్నయ్య కార్తీక్ భార్య నేనే వాళ్ళ ఇంటికి వెళ్లి విష్ చేసి భోజనం చేసి వస్తాను అంటూ ఉంటుంది స్వప్న,  ఈలోపు కాసి తన తండ్రి వస్తారు, ఏం అయింది అంటారు, మా అమ్మ ఫోన్ చేసి ఏవేవో మాట్లాడుతుంది మనం బీమా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటుంది అలాగే అని ముగ్గురు బయల్దేరతారు.

దీప ని కాంచన అత్తగారు లా అదేశిస్తుంది……

                                            దీప వంటరిగా కూర్చుని జరిగిన దాని గురుంచి ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటుంది, అనసూయ కాంచన వంట చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు, నేను మా దీప అంత రుచిగా నేను చెయ్యలేను అమ్మ మా తమ్ముడు చేతి వంట రుచి దీప కి వహ్చింది అంటుంది, అప్పుడు కాంచన అయితే దీప నే చెయ్యమను, వాళ్ళిద్దర్నీ మనమే కలపాలి దేనికి లొంగనిది ప్రేమ కి లొంగుతుంది, పనిలో పడితే థానే అన్ని మర్చిపోతుంది మనమే అన్ని మర్చిపోయేలా చెయ్యాలి అంటుంది కాంచన, అప్పుడు అనసూయ అవును అమ్మ కానీ అది చాల మొండిది చూద్దాం లీ అమ్మ అంటుంది కాంచన తో, ఈలోగా అనసూయ చేయి కాలుతూ అరుస్తుంది దీప విని పరిగెత్తుకుని వచ్చి ఏం అయింది అత్తయ్య అంటుంది కాలింది చూసుకోలేదు అంటుంది, అప్పుడు దీప ఇవన్నీ మీకు ఎందుకు అత్తయ్య అంటుంది, అప్పుడు అనసూయ నువ్వు వెళ్లి అక్కడ ఉంటె నేనేం చెయ్యను మనసు బాగోక పోతే కడుపు నిద్రపోడు కదా ఆకలి వేస్తూనే ఉంటుంది ఇంట్లో చిన్న పిల్ల కోసం అయినా వంట చెయ్యాలని వచ్చాము, నువ్వు వంట చేస్తా  అంటే చెయ్యి అంటుంది దీప ని, అప్పుడు దీప నేను చేస్తాను మీరు వెళ్ళండి అంటుంది, అప్పుడు అనసూయ నాకు కాఫీ తాగాలని ఉంది కొంచెం పలు పొంగించి కాఫీ ఇవ్వు అంటుంది, అప్పుడు దీప మీరు వెళ్ళండి అంటుంది. సౌర్య కార్తీక్ రూమ్ బయట నుంచుని కార్తీక్ ఇప్పుడు నాన్న కదా, నాన్న అని పిలిస్తే పలుకుతాడా అనుకుని నాన్న అని పిలుస్తుంది కార్తీక్ ని….

Scroll to Top