కార్తీక దీపం Serial Today Episode (04/05/24)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. కార్తీక్ అమ్మ, నాన్న లు కార్తీక్ తో ఏంటి ఈ మధ్య వెళ్ళిపోయినా వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నావ్ అంట, బాధ్యతలు అన్ని తీస్కుంటున్నావంటా అని అంటారు కార్తిక్ తండ్రి, అప్పుడు కార్తీక్ తల్లి కూడా, నీకు ఉన్న పనులు సరిపోవు అన్నట్టు ఇవన్నీ నీకు ఎందుకు నాన్న అంటుంది కార్తీక్ తో, అప్పుడు కార్తీక్ దానినే మానవత్వం అంటారు అంటూ చెప్పి వెళ్ళిపోతాడు లోపలికి. దెప్ప అత్తగారితో దీప నర్సింహా గురుంచి చెప్తుండుగా విన్న సుమిత్ర, దీప తో అసలు నిన్ను ఎం అనాలో తెలియడం లేదు , నిన్ను నేను సొంత కూతురులా చూసుకున్నాను కదా అయినా నువ్వు ఈ నిజాలేమి నాతో చెప్పలేదు, పైగా చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయావ్, నీబాడాలు పంచుకోకుండా నీలోనే పెట్టేసుకుంటున్నావ్ , నీ అమాయకత్వాన్ని చూసి జాలిపడాలా తెలియడం లేదు అంటుంది సుమిత్ర. అప్పుడు దీప ఏముంది అమ్మ, మీరు నన్ను తీసుకురాకుండా ఉంటె ఈ పతికి నేను మా ఊరు వెళ్ళిపోయి ఎప్పటి లగే న జీవితాన్ని మొదలు పెట్టేదాన్ని, నాకు న కూతురు గురుంచే గాని నా జీవితం మీద ఎలాంటి ఆశలు లేవు, ఇదంతా నా తల రాత అమ్మ అంటుంది దీప. అప్పుడు సుమిత్ర, నువ్వు ఇలా ఇదంతా నా తల రాత అని సర్దుకు పోతున్నావ్ కాబట్టే వాడు అంత దైర్యం గ ఉండగలుగుతున్నాడు, వాడి కంటికి నువ్వో చేతకాని దానిలా కనబడుతున్నవే, అందుకే నిన్ను వాడికి నచ్చినట్టుగా అందించాలని చూస్తున్నాడు అంటుంది సుమిత్ర, అప్పుడు దీప అత్తగారు సుమిత్ర తో నా కొడుకు మీకు తెల్సా అమ్మ అని అడుగుతుంది, అప్పుడు సుమిత్ర తెల్సు, ఉరికి వెళ్లకపోతే చంపుతానని బెదిరించాడు నీ కోడల్ని, నేను ఆ రోజే అడిగాను నీకు నీ భర్త కి గొడవ ఏంటి అని కానీ చెప్పలేదు, ఆ రోజే చెప్పుంటే వాడిని జైలు లో పెట్టించి వాడికి శిక్ష పడేలా చేసేదాన్ని. ఇప్పుడైనా వదులుతా అనుకున్నావా, రేపే వాడి మీద చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను చూడు అంటుంది సుమిత్ర. అప్పుడు దీప అత్తగారు అమ్మ అమ్మ మీకు దండం పెడతాను అంత పని మాత్రం చెయ్యకండి అమ్మ అంటుంది. సుమిత్ర చూడండి మీ కోడల్ని చూస్తుంటే మీకు జాలి వెయ్యడం లేదా అంటుంది. అప్పుడు దీప అత్తగారు నా కోడలి మీద జాలి కలుగుతుంది, నా కొడుకు మీద కోపము వస్తుంది, కానీ ఇప్పుడు కేసు పెడితే వీళ్ళ జీవితం రోడ్డుకు ఎక్కడం తప్ప ఏమి ఉప్పయోగం ఉండదు, నేను తీసుకొస్తాను, రేపే దీప ని వాడి దగ్గరకి తీసుకెళ్లి వాడి రెండు చెంపలు వాయించి వాడిని తీస్కుని వస్తాను అంటుంది దీప అత్తగారు సుమిత్ర తో, అప్పుడు సుమిత్ర రేపు మీరు ఆ పని చెయ్యకపోతే తర్వాత నేను చేస్తాను అంటుంది. అప్పుడు దీప అత్తగారు, లేదు అమ్మ వాళ్ళని నేను కలుపుతాను ఎవర్నో అమ్మయి ని తగులుకున్నాడు కదా దాన్ని వదల గొట్టి వాడిని నా కొడుకుని నా మనవరాలిని తీస్కుని ఊరు వెళ్ళిపోతాను అంటుంది.

దీప ని తీస్కుని దీప అత్తగారు నర్సింహా దగ్గరికి వెళ్తుంది, అప్పుడు నరసింహ వాళ్ళ అమ్మ ని చూసి లోపలి పారిపోతుండగా వాళ్ళ అమ్మ కర్ర పట్టుకుని నరసింహ ని కొట్టడానికి వెళ్తుంది, అప్పుడు నరసింహ వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పది కొట్టొద్దమ్మ అంటాడు, అప్పుడు శోభా వస్తుంది, శోభా ని చూసి నరసింహ తల్లి, ఇదేనా ఆ అమ్మాయి అంటుంది అప్పుడు శోభా యేవాతివే నువ్వు అంటుంది నరసింహ తల్లి ని, నరసింహ ని చూసి ఏంటి నువ్వు దాని కళ్ళు పట్టుకున్నావ్ అంటుంది శోభా, అప్పుడు నరసింహ తల్లి నువ్వు ముందు బయటకు వేళ్ళు అంటుంది, అప్పుడు శోభా, బయటకు వెళ్ళడానికి నేను నీ కొడుకు తాళి కట్టిన పెళ్ళాన్ని అంటుంది. అప్పుడు నరసింహ తల్లి శోభా ని పెళ్లి అయ్యి కూతురు ఉన్న వాడిని పెళ్లి చేసుకోడానికి నీకు సిగ్గు లేదా అంటుంది. అప్పుడు శోభా ఆ మాట నీ కూడుకుని అడుగు, అన్ని అబద్దాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్ పెళ్లి చేసుకోకపోతే చస్తాను అని బెదిరించాడు అంటుంది శోభా, న వెనుక పెళ్లి పెళ్లి అంటూ తిరిగినప్పుడు, మీ అమ్మ నాన్న లు మన పెళ్లి కి ఒప్పుకుంటారా అని అడిగితే నాకు ఎవరూ లేరు అమ్మ నాన్న లు చాచి పోయారు అని చెప్పాడు అంటుంది శోభా, అప్పుడు నర్సింహా ని ఏంటి ర ఇది అని అడిగితే అప్పుడు నరసింహ నేను చేసింది తప్పే కానీ, నేను ఒక రెండు నెలలు ఉండిడబ్బు సంపాదించి వచ్చి అప్పులు తీరుస్తాను అని అనుకున్నాను, ఈ లోపు దీప కూతుర్ని తీస్కుని ఇక్కడకు వచ్చింది, అప్పుడు తన చేతులు పట్టుకుని భ్రతిమిలాడాను ఇక్కడ నుంచి వెళ్ళిపో నేనే వచ్చేస్తాను అని, కానీ దీప న మాట వినలేదు అంటాడు, అప్పుడు దీప అత్తయ్య అంత అబద్దం అత్తయ్య అంటుంది, అప్పుడు దీప అత్తయ్య నువ్వేం మాట్లాడకు దీప, వాడు చేతున్నాడు గా ఎవరు ఎలాంర్తి వాళ్ళు నాకు తెల్సు కదా, వాడు ఏం చెప్తాడో చూద్దాం అంటుంది, అప్పుడు నరసింహ చెప్పడం మొదలు పెడతాడు, ఇక్కడకు వచ్చిదీప ఎవర్నో డబ్బున్న అబ్బాయి ని చూసుకుని వాడితో తిరుగుతుంది, అడిగినందుకు వాడితో నన్ను కొట్టించింది అంటాడు, అప్పుడు దీప నిన్ను చంపేస్తాను అబద్దాలు అడ్వాంటే అంటుంది, అప్పుడు దీప అత్తగారు దీప నిన్ను మాట్లాడొద్దు అన్న కదా అంటుంది, ఎం చెప్పను అత్తయ్య న కాళ్ళ ముందే నా గురుంచి ఇంత అసహ్యం గా మాట్లాడుతుంటే ఎలా ఊరుకోను అంటుంది దీప, అప్పుడు దీప అత్తయ్య న కొడుకు ని నిజం గా కొట్టారా అంటుంది, అప్పుడు దీప మీ కొడుకునే అడగండి అత్తయ్య ఎన్దుయ్కు కొట్టారో అంటుంది, అప్పుడు నరసింహ దీప ని ఇంటికి వెళ్ళిపోమందుకు నన్ను కొట్టించింది వాడు న కూతుర్ని కూడా వేసుకుని కార్ లో తిరుగుతున్నాడు, ఇంటికి వెళ్లకుండా వాడి ఇంటికి వెళ్లి ఉంటుంది అంటూ దీప గురుంచి అసహ్యం గా మాట్లాడతాడు నరసింహ, అప్పుడు శోభ అదేంటి నాతో నువ్వు దీప కి ఇంటికి వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇచ్చాను అని చెప్పావ్ కదారా అంటుంది, అప్పుడు నరసింహ అత్తగారు న కొడుకుని రా అంటావేంటీ అంటుంది, ఇప్పుడు న మొగుడు కూడా అంటుంది శోభా, అప్పుడు నరసింహ అత్తగారు మొగుడు ఐయితే మాత్రం రా అంటారా వాడు తెచ్చింది తిని వాడితో ఉంటూ రా అంటావా అంటుంది నర్సింహా అమ్మ, అప్పుడు శోభా అంత లేదు, మేమేం గతిలేని వాళ్ళం అనుకున్నావా, మా అమ్మ ఈ ఇల్లు న పేరు మీద కోటి రూపాయల ఇల్లు రాసింది, పది లక్షలు పెట్టి టాక్సీ కొని ఇచ్చింది నీ కొడుకుకి, నాకు పది లక్షలు పెట్టి మొన్ననే బంగారం చేయించింది అంటుంది శోభా, ఆ మాటలు విన్న నరసింహ తల్లి శోభా వంటి మీద ఉన్న నగలు చూసి నిజం గా ఇవి బంగారమేనా, ఈ ఇల్లు మీ సొంత దేనా అంటూ ఆశ్చర్య పోతుంది నరసింహ తల్లి.

Scroll to Top