అక్టోబర్ 28 న ఓ భారీ గ్రహ శకలం భూమి సమీపానికి రానున్నట్లు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) చెప్పింది తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు. 70 అంతస్తులు భావన పరిణామం ఉండే ఈ గ్రహశకలం భూమి కి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్టు తేల్చారు. ఇది గంటకు 33,947 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది, 33 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అంటే భూమికి పెద్దగా ప్రమాదం లేనట్లే. కానీ ఇలాంటి గ్రహశకలం వస్తున్నప్పుడు. దీనికి దారిలో మరేదైనా గ్రహశకలం ఢీకొటితే.. అప్పుడు ఈ గ్రహశకలం దిశ మారి, భూమివైపు వచ్చినా రావచ్చు. చాలా గ్రహశకలాలను పరిశీలిస్తున్నట్లుగానే.. నాసా ఈ గ్రహశకలాన్ని కూడా గమనిస్తోంది. ఇది వచ్చి, భూమి నుంచి దూరంగా వెళ్లి.. సూర్యుడి వైపు వెళ్లేవరకూ నాసా గమనిస్తూనే ఉంటుంది. నాసాకి చెందిన చాలా టెలిస్కోపులు దీనిపై ఒక కన్నేసి ఉంచాయి. అందువల్ల మనకు ఎలాంటి టెన్షనూ లేదనుకోవచ్చు.