బ్రహ్మముడి Serial Today Episode(23/10/2024)

                     

బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం, సీఈఓ చైర్ లో కూర్చున్న కావ్య ని చూసి షాక్ అయినా రాజ్, సెక్యూరిటీ ని అడగ్గా కొత్త సీఈఓ గా ఒప్పింమెంట్ ఆర్డర్ తో వచ్చారు అంటాడు రాజ్ తో, అప్పుడు కావ్య నన్ను తాతయ్య గరే సీఈఓ గా ఓపూయింట్ చేసారు అంటుంది రాజ్ తో, చెక్ చేస్కోండి అంటూ ఆ ఒప్పింమెంట్ లెటర్ రాజ్ చేతికి ఇస్తుంది. ఇంట్లో అప్పుడే బోజమా చేస్తున్న రాజ్ నానమ్మ తాతయ్య లో భోజనం చేస్తుంటారు, అప్పుడు రాజ్ తాతయ్య కి పొలమారుతుంది, అప్పుడు అతను ఇవన్నీ రాజ్ టైటిల్ అయుంటాయి అని అసలు అక్కడ ఏం జరిగిఉంటుందని కావ్య కి ఫోన్ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు.

ఇక నుంచి నేనే సీఈఓ నాతో మాట్లాడాలి అంటే ముందుగా న ఒపోయింట్మెంట్ తీకోవాలి….

                                                                        కావ్య రాజ్ ని ఇక నుంచి నేనే సీఈఓ మీరు నన్ను కలవాలి అనుకుంటే ముందే ఒప్పింట్మెంట్ తీసుకోవాలి అంటుంది, అప్పుడు రాజ్ ఇది ఇంతటితో అయిపోదు అంటూ ఉండగా, రాజ్ తాతయ్య ఫోన్ చేస్తాడు, అప్పుడు ఏం జరుగుతుంది అమ్మ అక్కడ అంటాడు, ఏం అంటున్నాడు ఆ మేనేజర్ గాడు అంటాడు, అప్పుడు కావ్య మీరు నేను ఊహించేదే తాతయ్య నన్ను సీఈఓ గ గుర్తుంచడానికి నిరాకరిస్తున్నారు అంటుంది, అప్పుడు రాజ్ తాతయ్య ఆహా… పేర్మిలాటిన్ ఇస్తాను రెలిఈవింగ్ ఆర్డర్ ఇచ్చేసి బయటకు పంపించే అంటాడు రాజ్ ని కావ్య తో, అప్పుడు కావ్య నవ్వుతు మాట్లాడతారా మేనేజర్ గారు అంటుంది, అప్పుడు రాజ్ ఏం అవసరం లేదు నేను ఇంటికి వెళ్లే తేల్చుకుంటాను అంటాడు రాజ్.

                                                                 ఈ ఐడియా ఇచ్చింది ఎవరు కాన్సర్ నాటకం ఆడిన మీ అమ్మ నా అంటాడు రాజ్, అప్పుడు కావ్య పర్సనల్ విష్యాలు ఇక్కడ మాట్లాడాను అంటుంది, అప్పుడు రాజ్ ఇల్లు అలాగ్గానే పండగ కడియం అంటాడు, అప్పుడు కావ్య ముందుండి ముసళ్ల పండగ అంటుంది, ఇద్దరు సవాలు చేసుకుంటారు, అప్పుడు కావ్య కి బుకీ ఇవ్వాలని తీసుకొస్తారు మీరే ఇవ్వాలని రాజ్ కి ఇస్తారు, సరే అని ఆ బాకీ తీస్కుని కావ్య కి ఇస్తూ కింద పడేసి తొక్కేస్తూ నీ కళలు అన్ని ఇలానే నేలపాలు చేస్తనే చుస్కో అంటూ వెళ్ళిపోతాడు రాజ్.

                                             విన్నారా తాతయ్య పెద్ద యుద్ధమే చేసి వెళ్లారు ఆ యుద్ధం ఇప్పుడు మీ మీద చెయ్యడానికి వస్తున్నారు అంటుంది కావ్య రాజ్ తాతయ్య తో, అప్పుడు అయన అలాంటివాళ్ళు చూసి చూసి అలసిపోయాను అమ్మ, వాడి ఆవేశానికి ఇంకా ఎవ్వరు బాలి అవ్వకూడదు నువేమి కంగారు పడకు నువ్వు నీ భాద్యత సరిగ్గా నిర్వర్తించే గలవని నాకు నమ్మకం ఉందమ్మా అందుకే ఈ పని చేశాను అంటాడు, అప్పుడు కావ్య కానీ అయన ఈ కంపెనీ కి ఎంతగానో కృషి చేసారు కదా తాతయ్య ఇప్పుడు ఆయనకు ఏం సమాధానం చెప్తారు తాతయ్య అంటుంది, అప్పుడు అయన నువ్వేం ఆలోచించకు కొత్త లైఫ్ ని స్టార్ట్ చెయ్ అల్ ది బెస్ట్ అంటాడు.

రాజ్ తాతయ్య తీస్కున్న నిర్ణయానికి అభ్యన్తరం వ్యక్తం చేసిన రాజ్……

                                                   ఈ లోగ రాజ్ ఇంటికి వచ్చి తాతయ్య అంటూ గట్టిగ అరుస్తూ ఉంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఏం అయిందిరా ఆలా అరుస్తున్నావ్ అంటుంది, అప్పుడు రాజ్ ఏది అరుపుల ఉండ ఆక్రోశించినట్టు గ ఉండ అంటాడు, అప్పుడు రాజ్ బాబాయ్ ఆక్రోశం అంటే ఏంట్రా అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ రోషం నుండి పుట్టుకొచ్చేదే ఉక్రోషం, భాద ల నుండి పుట్టుకొచ్చేదే ఆక్రోశం అంటుంది, అప్పుడు రాజ్ ఇప్పుడు నానార్థలు అవసరమా బాబాయ్ నేను తాతయ్య తో మాట్లాడాలి అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య వచ్చి చెప్పరా అంటాడు, అప్పుడు రాజ్ మీరు నాకు చాల అవమానం చేసారు అంటాడు, అప్పుడు తాతయ్య అది కావ్య లోని కాలనీ గుర్తించడం నీకెలా అవమానం అవుతుంది రా అంటాడు, అప్పుడు రాజ్ అసలు మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందొ తెల్సు కదా అంటాడు, అప్పుడు తాతయ్య మీ ఇద్దరి మధ్య ఎన్ని అయినా ఉండనే,కానీ మా ఇద్దరి మధ్య బంధం ఉంది భాద్యత ఉంది మానవరాలనే ప్రేమ ఉంది అంటాడు, అప్పుడు రాజ్ మీ ఇద్దరి మధ్య ఎన్ని అయినా ఉండనే నన్ను అవమానించడానికే కదా ఇదంతా చేసారు అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఏరా ఇందాకా వెళ్ళేటప్పుడు తలకు దెబ్బ తగిలింది కదా అందుకే ఇలా తల తోక లేకుండిన మాట్లాడుతున్నావ్ అంటుంది, అప్పుడు రాజ్ నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు, నేను ఒంటి చేత్తో కంపెనీ ని నడపలేను అనుకున్నారా కనీసం ఈ నిర్ణయం తీసుకునే తప్పుడు నాకు ఒక్కమాట అయినా చెప్పారా అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య కావ్య ని ఇంటి నుండి పంపించే తప్పుడు మాకు ఎవరికన్నా చెప్పవా, అయినా నేను నీ అనుమతి తీసుకోవడం ఏంటి బుర్ర ఉండే మాట్లాడుతున్నావా అంటాడు, నువ్వు మా పెద్దరికాన్ని గౌరవం ఇస్తున్నావా, మీ అమ్మ మాట వింటున్నావా, నీ భార్య ని పట్టించుకుంటున్నావా, నీలో ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా సన్నాసి అని తిడతాడు రాజ్ ని, అప్పుడు రాజ్ ఇదేంటి నేను ఈవంటి విష్యం మాట్లాడుతుంటే మీరు ఎప్పటి విషయమో మాట్లాడుతున్నారు అంటాడు, నా ఆఫీస్ లో నా అధికారాన్ని కళావతికి ఎలా ఇస్తారు అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య కళావతికి అవార్డు వచ్చింది కాబట్టి అంటాడు, అప్పుడు రాజ్ వస్తే అంటాడు, అప్పుడు తాతయ్య కళావతి అవార్డు తీసుకుంటే నువ్వు అహంకారానికి పోయి అవార్డు పోగొట్టుకున్నావ్ అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య తాను పక్క కంపెనీ కి వెళ్ళలేదు అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య నాకెందుకు ర అవన్నీ వాళ్ళు కళావతిని మోసం చేసారని స్పష్టం గా ఆ అనామిక నే మీ అమ్మ నానమ్మ లతో చెప్పింది, కళావతి మోసపోయింది అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఏంటి బావ నువ్వు కూడా కళావతి అంటున్నవ్ మం మనవరాలి పేరు కావ్య అంటుంది, అప్పుడు రాజ్ తాతయ్య అవును కదా వీడి భాష నాకు వచ్చింది అనుకుంటూ అందరు నవ్వుకుంటూ ఉంటారు, అప్పడు రాజ్ మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు తాతయ్య అంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి కూడా నాకు నచ్చలేదు అంటుంది, అప్పుడు స్వప్న మీ బోడి ఇష్టం ఎవరు అడిగారు అంటుంది ధాన్యలక్ష్మి ని , అప్పుడు రాజ్ నానమ్మ ధాన్యలక్ష్మి మీ మావయ్య గారి నిర్ణయాన్నే తప్పుపడతావా అంటుంది, అప్పుడు రాజ్ తాతయ్య రాజ్ ఇంతక ముందు లా పనిచెయ్యడం లేదు వ్యక్తి గత కోపానికి బిజినెస్ ని బలిచేస్తున్నాడు, ఒక వ్యాపారవేత్తల ఆలోచించడం లేదురోజు రోజుకి ముర్కత్వం పెరిగిపోతుంది అంటాడు రాజ్ ని, అప్పుడు రాజ్ నేనా, నేనే కదా, ఎంత బాగా అర్ధం చేసుకున్నారు తాతయ్య నేను నా ప్రాణాలు దారపోస్తున్నాను తాతయ్య అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య అందుకే నీ పదవిని కావ్య కి దారపోశాను అంటాడు, అప్పుడు రాజ్ ఈ అంయ్యాన్ని ప్రశ్నించే వాళ్ళ లేరా అంటాడు, అప్పుడు రుద్రాణి ఏంటి ఇది సంవత్సరం నుంచి రాజ్ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాడు అంటుంది, అప్పుడు రాజ్ తాతయ్య ఫలితం ఏది అంటాడు, అప్పుడు రుద్రాణి అవర్స్ కూడా  రావాలని కృషి చేసాడు అంటుంది, అప్పుడు ధాన్యలక్ష్మి అయినా మన ఇంటితో సంబంధం లేదు  ఆని  వెళ్ళిపోయినా దానికి ఇలా పెత్తనం ఇవ్వడం ఏంటి మావయ్యగారు అంటుంది, అప్పుడు రాజ్ తాతయ్య అనామిక బంధం తెంచుకుని వెళ్ళిపోయింది, అప్పు వెళ్ళిపోయింది, కావ్య వెళ్ళిపోయింది, రేపు రాహులా ఈదిన తప్పు చేస్తే స్వప్న కూడా వెళ్ళిపోతుంది, అనామిక కి అర్ధం చేస్కునే గుణం లేదు కాబట్టి వెళ్ళిపోయింది, అప్పు నీగుణం అర్ధం చేసుకుంది కబట్టు వెళ్ళిపోయింది, కావ్య వీడి గుణం నచ్చక వెళ్ళిపోయింది అందుకే మేల్కున్ననుఁ ఇది ఈ ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయం ఎవరు మార్చలేరు చిట్టి నువ్వు రా మనం పకోడీ వండించుకుని తిందాం అంటూ వెళ్ళిపోతారు లోపలికి.

కళ్యాణ్  రాసిన లిరిక్స్ ఫామ్స్ అయ్యాయి…..

                                            కళ్యాణ్ ఆటో నడుపుతూ వెళ్తుండగా అప్పుడు ఆటో లో ఉన్నవాళ్లు ఫోన్ లో  సాంగ్స్ పెడతారు, ఆ సాంగ్ విని కళ్యాణ్ తనదే అని నవ్వుకుంటూ ఉంటాడు, అప్పుడు ఒకామె ఎవరు ఈ లిరిక్స్ రాసింది అంటుంది, ఇన్క్ ఆమె ఫేమస్ లక్ష్మి కాంత్ గారు అంటుంది, అప్పుడు ఆమె అయన ఓల్డ్ కదా ఇంత యంగ్ గ ఎలా రాసారో అనుకుంటూ ఉంటారు, వాళ్ళ స్టాప్ దగ్గర దిగుతారు. అప్పుడు కళ్యాణ్ మనం రాసిన పాట జనాలు మెచ్చుకుంటుంటే ఇంత ఆనందం గ ఉంటుందా అప్పుడు చెప్పినట్టు మల్లి ఇంకోసారి  డైరెక్టర్ ని కలవాలని అనుకుంటూ ఉంటాడు.

రాజ్ కంపెనీ లో అనామిక రహస్య గూఢచారి……..

                                                                   రాజ్ కంపెనీ లో అనామిక ఒక గూఢచారి ని పెడుతుంది, అతనికి ఫోన్ చేసి రాజ్ తో పటు కొత్త సీఈఓ ని కూడా గెంటేయాలి అంటుంది అనామిక, అప్పుడు అతను రాజ్ సర్ మెం అంత పాత వాళ్ళం కాబట్టి నమ్మారు, ఆఫీస్ విషయాలన్నీ మీకు పంపించగలిగాను కానీ ఈ కావ్య మేడం మీకంటే ముదురు ఉంది ప్రతి దాంట్లోనూ ఇన్వొల్వె అవుతుంది అని అనామిక చెప్తుండగా కావ్య వచ్చి ఆ మాటలు వినేస్తుంది, అప్పుడు కావ్య ఆ ఫోన్ లాక్కుని హాయ్ అనామిక నువ్వు నన్ను చాల తెలివిగా మోసం చేసి మా అత్తగారి కంపెనీ మీద దెబ్బ కొట్టాలనుకున్నావ్ నేను అమాయకం గా మోసపోయి ఒక అవార్డు ని  మా కంపెనీ కి ర్యాంకుండా చేశాను, అది నీ గెలుపు అనుకుంటున్నావేమో, నీ పతనానికి దారి, ఇప్పుడు నేను నిన్ను కోలుకోలేని డబ్బా కొడతాను అంటూ ఫోన్ పెట్టేసి, ఆఫీస్ స్టాఫ్ అందరితో ఆ గూఢచారి గురుంచి చెప్తుంది కావ్య, ఇతను మన కంపెనీ సీక్రెట్స్ అన్ని పక్క ఆఫీస్ కి చీరవేస్తున్నాడు, అంతే కాదు మా అత్త గారికి ఫేక్ కాల్ చేస్యింది ఆవిడకు సీరియస్ అయ్యేలా చేసాడు, నాకు నా భర్తకి మధ్య విభేదాలు సృష్టించాడు, అన్నం పెట్టిన చేతినే నరకాలి అని చుసిన ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష వెయ్యాలో మీరే చెప్పండి అంటుంది, ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తారు, అప్పుడు కావ్య అవన్నీ కామన్ నేను ఈయన్ని ఒక కొత్త పోస్ట్ ఇస్తాను ఈ అర్జు నుంచి అతన్ని సెక్యూరిటే పోస్ట్ ఇస్తాను అంటూ చెప్తుంది.

Scroll to Top