మొదటి కార్తీక సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొల్పుకుంది, తెల్లవారు జామునే లేచి ఇల్లంతా దీపాలతో అందమయిన ముగ్గులతో కళకళలాడుతుంది, అందులోను ఈ అర్జు కారఃతీక మాసం మొదటి సోమవారం కావడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండగ వాతావరణం చోటు చేసుకుంది. పట్నం నుంచి పల్లెటూరు వరకు అన్ని శివాలయాలు భక్తులతో నిండి పోయాయి, ప్రత్యేక పూజలు అభిషేకాలతో శివారాధారణలు జరుపుకున్నారు.
ఈ మాసం లో ఏ పుణ్య కార్యం చేసిన ఎన్నోలాభాలను పండుతామని, మనం చేసేటువంటి ప్రతి చిన్న మంచి పని మనకి ఎంతో పుణ్యం తెప్పించు పెడుతుందని పెద్దలు అంటుంటారు. అందుకనే ఈ మాసం లో పూజలతో పాటు ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. కార్తీక మాసం లో అన్నసమారాధనలు కూడా చేస్తుంటారు, వనభోజనాకు కూడా వెళ్తుంటారు, ముఖ్యం గా ఈ మాసం లో ఉసిరి చెట్టు కింద పూజ చేసి భోజనం చేస్తే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పెద్దలు అంటుంటారు, ఈ మాసంలో శివుడిని ఎలా ఆరాధించిన ప్రసన్నం అవుతారని అంటారు.
ఈ కార్తీక మాసం మొత్తం పండగ వాతావరణం అలవరచుకుంటుంది, ముఖ్యం గా ఈ మాసం లో తులసి పూజ ముఖ్యం గా చేస్తారు, నియమ నిష్ఠలతో ఎవరికీ తోచిన విధం గా వాళ్ళు పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా తెల్లవారు జామున చేసే ఈ చన్నీళ్ళ స్నానం వల్ల ఎన్నో ఆరోగ్య ఫలితాలు కూడా ఉంటాయి అంటారు, అయితే అనారోగ్యం తో ఉన్నవాళ్లు, పెద్దలు, చెయ్యలేని వాళ్ళు ఈ విధం గా చెయ్యకపోయినా ఆ పరమ శివుడికి నమస్కారం చేసినంత మాత్రానే ఈ మాసం లో ప్రసన్నం అవుతారు, ముఖ్యం గా మనం చేసే దాన ధర్మాల వల్ల పూజలు కంటే ఎక్కువ ఫలితాలు వస్తాయని అంటారు ఈ కార్తీక మాసం లో, ఈ కార్తీక మాసం లో ఉపవాసాలు కూడా చేస్తుంటారు.