శీతాకాలమ్ లో దొరికే రాసి ఉసిరి కాయల గురుంచి కొన్ని విషయాలు తెల్సుకుందాం……
కార్తీక మాసం లో ప్రత్యేకం గా పూజించే రాసి ఉసిరి కాయల గురుంచి మనకు తెలీని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు తెల్సుకుందాం. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. దీనిలో విటమిన్ సీ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణుల చెబుతున్నారు.
ఉసిరి జ్యూస్ తాగినా , ఎండబెట్టి వరుగులు చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా, నిల్వ ఉండే ఊరగాయ చేసినా దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం షుగర్‌ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలానే ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో ఫైబర్, మినరల్స్, ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఉసిరి రోజు మన డైట్‌లో చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో దీనికేదీ సాటిరాదు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి చాలా సహాయపడుతుంది. శరీరంలో ఉన్న మలినాలను తరిమికొట్టి జీర్ణాశయ వ్యవస్థ చక్కగా పనిచేసేలా తోడ్పడుతుంది. రోజూ పరిగడుపను ఉసిరి రసం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను పూర్తిగా దూరం చేసుకోవచ్చు. మలబద్దకం సమస్యే ఉండదు. ఉసిరి బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజును నియంత్రణలో పెడుతుంది.