భారత దేశ వ్యాపారవేత్త రతన్ నవల్ టాటా గురుంచి మనం కొన్ని విషయాలు తెల్సుకుందాం
రతన్ టాటా 1937 డిసెంబర్ 28 న మహారాష్ట్ర ముంబై లో జన్మించారు.దేశం లోనే అతిపెద్ద కంపెనీ అయినట్టు వంటి రిలయన్స్ , ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలపిన కూడా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా అత్యంత ధనవంతుల జాబితాలో ఎందుకు లేరో చూద్దాం,
150 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా గ్రూప్స్ గురుంచి తెల్సుకుందాం.అతను 1937 లో టాటా కుటుంబం లో గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా కు మునిమనవాడుగా జన్మించాడు. టాటా కర్నెల్ విశ్వవిద్యాలయం లో చదువుకున్నారు, అంతకు ముందు ఈయన పేరు జె ఆర్ డి టాటా. ఈయన 1961 లో టాటా స్టీల్ షాప్ ప్లోర్ లో పనిచేసేటప్పుడు తన కంపెనీ లో చేరాడు. 1991 లో జె ఆర్ డి టాటా పదవి విరమణ చేసిన తర్వాత వరసగా భాద్యతలు చేపట్టారు, అతను టాటా ను ఎక్కువగా భారత కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారం గా మార్చే ప్రయత్నంలో అమెరికా టీ, జాగ్వల్ ల్యాండ్ రోవర్ ను సొంతం చేసుకోడానికి టాటా మోటర్స్ , టాటా స్టీల్ ఐరోపా ను సంపాదించడానికి టాటా స్టీల్ ను పొందాడు.
ఈయన భారత దేశ పారీశ్రామికవేత్త, దాత, టాటా సన్స్ కు పూర్వపు చైర్మన్ గా చేసారు మరియు టాటా 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్స్ చైర్మన్ గా ఉన్నారు, 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు టాటా గ్రూప్ ఇంటెరిమ్ చైర్మన్ గా చేసారు మరియు టాటా చారిటబుల్ ట్రస్ట్ కు అధిపతి గా కొనసాగుతున్నారు టాటా. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది, రెండవ ప్రపంచ యొద్దం తర్వాత అది ప్రభుత్వం చేతికి వెళ్ళిపోయింది, తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. దేశ నిర్మాణం మరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంతగానో ఉంది, ఆసియ లోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ మరియు భారత దేశం లో మొట్టమొదటి హోటల్ అయినటువంటి తజ్ హోటల్ ని కూడా స్థాపించింది టాటా నే. ముఖ్యం గా టాటా ల అందరిలో మనం చెప్పుకోవాల్సింది రతన్ టాటా గారి గురుంచి.
1991 లో JRD టాటా , రతన్ టాటా ని టాటా గ్రోపు చైర్మన్ గా చేసినప్పుడు చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు, ఎటువంటి అనుభవం లేనటువంటి రతన్ టాటా కి కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేతుల్లో పెట్టడం అందరు వ్యతిరేకించారు, కానీ వారందరి అభిప్రాయాలను టాటా తప్పని నిరూపించుకున్నారు, అయన హయం లో టాటా గ్రూప్ చాల బాగా నడిచింది, 10,000 కోట్ల రూపాయలుగా ఉండాల్సిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్ల గా మార్చారు రతన్ టాటా,కానీ ఇంత పెద్ద కంపెనీ ని నడుపుతున్నప్పటికీ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎందుకు రాలేదో తెలుసా ఎందుకంటే టాటా కంపెనీ లాభాల్లో 66 % టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహించిన చారిటబుల్ ట్రస్ట్ కె వేల్లోపోతుంది. ఒకవేళ అయన తన ఆస్తుల్లో 66 % ని ట్రస్ట్ ఇవ్వకుండా ఉంటె, ప్రపంచ ధనికులలో మొదటి ముగ్గురు స్థానాల్లో రతన్ టాటా నే ఉండే వారు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు చాల వ్యాపారాలలో రతన్ టాటా పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో , సుమారు 8 లక్షల మంది ఉద్యోగులతో మన భారత దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమ్ గా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది.
రతన్ టాటా ఆయన ప్రయాణం లో ఎన్నో అవరోధాలను ఎదురుక్కున్నారు, చాల ఫెయిల్యూర్స్ ని కూడా చూసారు, వ్యాపారాలలో లాభాలతో పటు నష్టాలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి, వాటన్నిటి అవరోధాలను ఎదుర్కొంటు ఇప్పుడు ఈ స్థాయికి రతన్ టాటా చేసురుకున్నారు. అయన ఎదుర్కున్న సమస్యలలో కొన్నింటిని చూద్దాం, 1998 లో రతన్ టాటా …. టాటా ఇండికా కార్ వ్యాపారాన్ని అమ్మడం కోసం టాటా మరియు అయన టీం ని తీస్కుని వెళ్లారు, అయితే ఆ మీటింగ్ లో పోస్ట్ కంపెనీ చైర్మన్ రతన్ టాటా తో మీకు కార్లను తాయారు చెయ్యడం రానప్పుడు ఎందుకు కార్ల కంపెనీ ని మొదలు పెట్టారు అని టాటా ని అయన టీం ని అవమానించారు, దానితో రతన్ టాటా ఆ డీల్ ని మాట్లాడకుండానే తిరిగి ముంబై కి వచ్చేసారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయం లో పోర్ట్ కంపెనీ కి చెందిన లగ్జరి కార్లు Jaguar – Land Rover కంపెనీ లు భారీగా నష్టాల్లో కూరుకుపోయాయి, ఆ సమయం లో రతన్ టాటా పోర్ట్ కంపెనీ ని ఆ Jaguar – Land Rover కంపెనీ మేము నేను కొంటాను అని ఆఫర్ చేసారు, ఈ సరి పోర్ట్ కంపెనీ వాళ్ళు అమెరికా నుంచి ముంబై చేరుకొని రతన్ టాటా ని చేరుకున్నారు. ఆలా అవమానించిన వాళ్ళ కంపెనీ అయినా Jaguar – Land Rover కంపెనీ ని రతన్ టాటా 9,300 కోట్ల రూపాయలకు టేకోవర్ చేసి ఆ ఎండితిని మళ్ళీ లాభాల బాట పట్టించారు రతన్ టాటా. ఇలా రతన్ టాటా వాళ్ళ తాతగారు ఇచ్చిన టాటా గ్రూప్ ని ఎన్నో విధాలుగా లాభాల బాట పట్టించారు,ఇలా టాటా ఎన్నో విధాలుగా వ్యాపార వేత్తగా పేరు గాంచారు.