సోషల్ మీడియా ఫై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక శ్రద్ద చూపనుంది, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పనులయిన చేయొచ్చు అనుకుంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది, సోషల్ మీడియా ఎవరైతే అసభ్య అనుషిత అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారో వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది, అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతూ ఏమైనా చేయవచ్చు అనుకునే వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడాన్నివైకాప ప్రభుత్వం ప్రశ్నిస్తూ, వైకాప ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పాత్రికేయుడు పోలా విజయ్ బాబు దాఖలు చేసిన పిన్ ను విచారించడానికి ఆంధ్రప్రదే హైకోర్టు నిరాకరించింది.
పిటిషనర్ తరపున వైకాప ప్రభుత్వంలో ఏజీ గా పనిచేసిన ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన పౌరుల వాక్ స్వాతంత్రం హక్కును హరించేలా పోలీసు యంత్రాంగం విచ్చలవిడిగా కేసును నమోదు చేసి అరెస్టు చేస్తోందన్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు లేకుండా చేస్తున్నారని వాదించారు, వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తుంటే కేసులు నమోదు చేస్తే తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. చట్ట ప్రకారం ముందుకు వెళుతున్నప్పుడు ప్రభుత్వాన్ని తాము ఏ విధంగా నిరోధించగలమని అడిగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే పద్ధతిలో వందల మందిపై కేసులు పెడుతున్నారని శ్రీరామ్ వాదించారు సామాజిక మాధ్యమం వేదికగా 2000 మంది దూషణలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పెలా అవుతుందని ధర్మాసనం తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఒకే పద్ధతిలో కేసులు పెడుతోంది, పోలీసులు కాదని సోషల్ మీడియాలో ఒకే విధానంలో దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని పేర్కొంది.