ఓటమినే గెలుపుకి తొలి మెట్టుగా తీసుకోవాలని, కళలను కనడమే కాదు వాటిని నిరవేర్చుకోవాలని ఎంతో మంది కి ఆదర్శం గా నిలిచినా మన డా.ఏ.పీ.జె. అబ్దుల్ కలం గారి గురుంచి మనం ఇప్పుడు తెల్సుకుందాం. అసలు పరిచయం అక్కర్లేని వ్యక్తి అబ్దుల్ కలాం గారు, అయితే ఆయన రాష్ట్రపతి అవ్వడానికి ఆయన మార్గం ఏమి పూలబాట కాదు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సిన వచ్చింది, ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి మన దేశంలో ఎన్నో అవస్థలు పడ్డారు. భారత 11 రాష్ట్రపతి మరియు క్షిపణి శాస్త్రవేత్త అయిన ఏ పీ జె అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931న తమిళనాడులోని రామేశ్వరంలో ముస్లిం దంపతులకు జన్మించారు, అయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనాలుద్దీన్ అబ్దుల్ కలాం, ఆయన తండ్రి జైనుల్ ఆబ్దీన్ రామేశ్వరంలో నావికుడిగా హిందూ భక్తుల్ని రామేశ్వరం గుడి చూపించడానికి తన నావలో తీసుకువెళ్లేవారు, తల్లి అసిమ్మ ఇంట్లో ఉండే ఇల్లాలు, ఇల్లు చిన్నది కుటుంబం పెద్దది నలుగురు సంతానంలో అబ్దుల్ కలాం ఆఖరి వాడు, కుటుంబం పెద్దది కావడంతో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉండేవి అందుకే ఒక 10 సంవత్సరాల వయసున్న పిల్లవాడు కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని కుటుంబాన్ని నిలబెట్టడం తన కర్తవ్యంగా భావించి అంత చిన్నవయస్సులోనే ఒక పేపర్ బాయ్ గా పనిచేస్తూ తనవంతుగా కుటుంబానికి సహాయం చేస్తూఉండేవాడు. ఆ చిన్నారి కుటుంబానికి తనవంతు సహాయం చేయటానికి ఇంటింటికి వార్తా పత్రిక వేయటానికి ఉద్యోగంలో చేరాడు, అయితే డబ్బు కోసమే ఆ ఉద్యోగంలో చేరిన అసలు దీని వెనక అబ్దుల్ కలాం ఆలోచన వేరే విధంగా ఉండేది, వార్తా పత్రిక ఎవరికీ అమ్మినా కూడా ముందు తాను ఆ పేపర్ అంతా చదివేవాడు జ్ఞానాన్ని పెంచుకునేవాడు, ఒక ముస్లిం అయిన కారణంగా మన దేశంలో ఎన్నో అవస్థలు పడ్డారు, అబ్దుల్ కలాం చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది.
ఒక నిష్ఠా గరిష్టుడైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రామనాథ శాస్త్రి ఉండేవారు, అబ్దుల్ కలాం మొదటి బెంచ్ లో రామానంద శాస్త్రితో కూర్చుని చదువుకునేవాడు, ఒకరోజు ఒక కొత్త ఉపాధ్యాయుడు బ్రాహ్మణ విద్యార్థితో ముస్లిం విద్యార్థి పక్కనే కూర్చోవడం చూసి వెనక బెంచ్ కి పంపించేశాడు, వెనక బెంచ్‌లో కూర్చున్నంత మాత్రాన జీవితంలో వెనక్కి వెళ్ళాడా అస్సలు కాదు అని నిరూపించడానికి కంకణం కట్టుకున్నాడు అబ్దుల్ కలాం, అందుకనేమో సమాజానికి కావలసిన అద్భుతమైన మేధస్సు లాస్ట్ బెంచ్ లో కూర్చునే విద్యార్థులకే ఉంటాయి అని ఎప్పుడూ అనేవారు, స్కూల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చున్న అబ్దుల్ కలాం అప్పుడే తన జీవితాశయాన్ని ఏర్పరచుకున్నారు, పైలట్ ఫైటర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు, అందుకు కారణం ఒక ఉపాధ్యాయుడు ఒకసారి శ్రీనివాస్ అయ్యర్ అనే ఉపాధ్యాయుడు క్లాసులో పక్షి ఎలా ఎగురుతుందో చెప్తూ ఉన్నారు 25 నిమిషాలు అయినా కూడా తాను చెప్పిన విషయం ఒక్కరికి కూడా అర్థం కాలేదు అని అర్థమైంది, స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఆ పిల్లలందరిని తీసుకొని సముద్రపు ఒడ్డుకు వెళ్లారు సముద్రం పై పక్షులు ఎగరటం మళ్ళీ అవి కిందికి వచ్చి మళ్ళీ ఎగరటం అందుకు అనుగుణంగా వాటి తోకని మలుచుకోవడం రెక్కల్ని మార్చుకోవటం అంతా వివరంగా చెప్పారు చూపించారు, అది అర్థం చేసుకున్న అబ్దుల్ కలాం ఖచ్చితంగా తాను పెద్దయిన తర్వాత పైలట్ ఫైటర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన కోరిక ఫలించలేదు, ఆశలు పూర్తి చేసుకోవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ప్రవేశం తీసుకున్నారు, అందుకోసం స్కాలర్షిప్ కూడా వచ్చింది ఆ డబ్బుతోనే చదువుకుంటున్నారు.
రెండవ సంవత్సరంలో ఆయనకి మైనర్ ప్రాజెక్ట్ కింద చిన్న ప్లేన్ ని తయారు చేసే ప్రాజెక్ట్ ఇచ్చారు, కలాం ఒక కొత్త ప్లేన్ ని డిజైన్ చేసి తన ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్లారు కానీ ఆ ప్రొఫెసర్ కి ఆ డిజైన్ అస్సలు నచ్చలేదు, మరొక డిజైన్ చేసి తీసుకురమ్మని కలాం కి చెప్పారు కొత్త డిజైన్ రూపొందించాలంటే కనీసం ఒక నెల సమయం పడుతుంది, నెల రోజుల తర్వాత ప్రాజెక్టు సబ్మిట్ చేస్తానని చెప్పారు, కానీ ఆ ప్రొఫెసర్ అందుకు నిరాకరించారు మూడు రోజుల సమయం ఇస్తున్నాను ఈ లోపు ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి లేదంటే స్కాలర్షిప్ ఆగిపోతుంది అని కరాఖండిగా చెప్పేసారు, స్కాలర్షిప్ ఆగిపోతుందన్న భయంతో ఏం చేయాలో అర్థం కాని అబ్దుల్ కలాం ఎలాగైనా ఆ ప్రాజెక్టు ని పూర్తి చేయాలి అన్న సంకల్పంతో మూడు రోజులు నిద్రపోకుండా తిండి తినకుండా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ప్రొఫెసర్ కి సబ్మిట్ చేశాడు. ప్రొఫెసర్ ఆశ్చర్యానికి అంతే లేదు కేవలం మూడు రోజుల్లో ఒక కొత్త ప్లేన్ ని డిజైన్ చేయడం అనేది సాధ్యం కాని పని, కానీ అసాధ్యాని సుసాధ్యం చేయడం అబ్దుల్ కలాం కి వెన్నతో పెట్టిన విద్య, అబ్దుల్ కలాం కి ఒక విషయం అర్థమైంది ఒక పని మీద శ్రద్ధ పెట్టి చేస్తే ఎటువంటి అసాధ్యమైన సాధ్యం చేయొచ్చు, అని తన ఆశయాలని సఫలం చేసుకోవడానికి మరొక అవకాశం ఇంటర్వ్యూ రూపంలో దొరికింది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఆఫ్ డెహరాడూ లో ఇంటర్వ్యూ కి వెళ్లారు కలాం, అయితే అబ్దుల్ కలాం గారికి ఏది అంత తేలిగ్గా రాదని ముందే చెప్పాం కదా, ఆ ఇంటర్వ్యూలో పాతిక మందిలో కేవలం ఎనిమిది మందిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు, అబ్దుల్ కలాం గారి స్థానం ఎంతో తెలుసా తొమ్మిది కావాల్సిన వారి కంటే ఒక్కరే ఎక్కువ ఈ విషయం ఆయన్ని కృంగదీసింది, “మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్” అని స్వయంగా రాసుకున్న పుస్తకంలో కలాం ఈ విషయాలన్నీ తెలియజేశారు. అందులో ఈ విషయం గురించి ఆయన ఇలా రాశారు, మన వైఫల్యాల నుంచి ఎంతో నేర్చుకుంటాం, మన పక్కనే ఉండే వనరులు అప్పుడే మనకు కనిపిస్తాయి, అప్పటివరకు అవి ఉన్న వాటిని ఉపయోగించడం మనకు తెలియదు, ఎప్పుడైతే వైఫల్యాలు చుట్టుముడతాయో అప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం మూలంగా ఆయన ఆకాశంలోకి ఎగరలేదు, కానీ భారతదేశ చరిత్రని ఆకాశం దాకా తీసుకెళ్లగలిగారు అక్కడ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత 1958 లో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో చేరారు, అక్కడ చేరిన కొద్ది రోజుల్లోనే విక్రం సారాభాయ్ తో కలిసి “ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ స్పా “ ని ప్రమోట్ చేశారు.
భారతదేశం నుంచి మొట్టమొదటి సాటిలైట్ ని పంపడానికి ఉద్యుక్తమయ్యారు, భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది సక్సెస్ అని నిరూపించారు, ఆ రాకెట్ ని తమిళనాడులోని తుంబాగావు అనే ఊరు నుంచి లాంచ్ చేయాలనుకున్నారు కానీ సమస్యలు రావడం మొదలైంది, ఎటువంటి సమస్య తన ఈ చిన్న చిన్న సమస్యల్ని గమ్యం వైపు చేరడానికి ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో అక్కడే ఉన్న ఒక చర్చ్ దగ్గర నుంచి రాకెట్ ని లాంచ్ చేయడానికి పూనుకున్నారు, బిషప్ గదిని ఆఫీస్ గా ఉపయోగించారు అయితే లాంచ్ ప్యాడ్ దాకా ఆ రాకెట్ ని తీసుకెళ్లడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి వాహనం లేదు, రాకెట్ లో లోని అన్ని భాగాల్ని సైకిల్ మీద ఎడ్ల బండి మీద మోసుకెళ్లి లాంచ్ ప్యాడ్ దాకా చేర్చారు. ఎన్నో కష్టాల మధ్య ఆ రాకెట్ ని 1963 నవంబర్ 21న అంతరిక్షంలోకి పంపించారు. అదే భారతదేశం నుంచి వెళ్ళిన మొదటి రాకెట్, అయితే ఏ మిషన్ అయితే కలాం ని మిసైల్ మ్యాన్ అని అభివర్ణించిందో నిజానికి ఆ మిషన్ ఒక ఫెయిల్యూర్ మిషన్ 1969 లో ఇస్రో చేపట్టిన సాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎస్ ఎల్వి కి డైరెక్టర్ గా ఉండేవారు, 10 సంవత్సరాలు కష్టపడి కలం ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు, ఆ సమయంలో ఆయన తన తండ్రిని కూడా కోల్పోయారు, అయినా సరే దీక్షగా పట్టుదలగా ఆ పనిని పూర్తి చేయాలి అన్న సంకల్పంతో 1976 లో రాకెట్ ని పంపించారు, కానీ సాంకేతిక సమస్యల వల్ల రెండవ దశలోనే బంగాళా ఖాతంలో కూలిపోయింది. ప్రతి ఒక్కరు కలాం ని తలోమాట అన్నారు, అయితే అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధవన్ ఆ ఫెయిల్యూర్ కి బాధ్యత అంతా స్వయంగా తన మీద వేసుకున్నారు, అందుకే అబ్దుల్ కలాం లీడర్ కి ఒక ప్యాషన్ ఉండాలి అంతేకాదు ఎప్పుడూ సమగ్రతతో పని చేయాలి అని సతీష్ ధవన్ గురించి రాసుకున్నారు తన పుస్తకంలో. ఎలా అయితేనే చివరికి 1969-70 మధ్యలో మూడు SLV లు లాంచ్ చేశారు. 18 జూలై 1981న రోహిణి ఒకటి లాంచ్ చేశారు, “ సూపర్ ఎక్స్క్లూసివ్ క్లబ్ ఆఫ్ స్పేస్ ఫియరింగ్ నేషన్స్” లో ఆరవ స్థానానికి మన దేశం చేరింది. ఆ తర్వాత అగ్ని, పృథ్వి వంటి మిసైల్స్ ని కూడా సక్సెస్ చేశారు. ఫలితంగా 1981 లో పద్మభూషణ్, 1990 లో పద్మ విభూషణ్ అవార్డులు కలాం గారి సొంతమయ్యాయి. అయితే 1997 లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు రావడానికి కారణం మాత్రం పోక్రాన్ 2 అణుబాంబ్ టెస్ట్ చేసిన ఈ ప్రయోగం ప్రపంచంలోని అన్ని దేశాలు మన దేశం వైపు చూసేలా చేసింది. ఈ ప్రాజెక్టు కి చీఫ్ కోఆర్డినేటర్ గా ఉన్నారు అబ్దుల్ కలాం. జపాన్, అమెరికా బెదిరించిన బెదరకుండా ఈ ప్రాజెక్టు ని పూర్తి చేశారు, అది కూడా పూర్తి సమర్ధతతో 40 సంవత్సరాలు డిఆర్డిఓ లో ఉద్యోగం చేసిన తర్వాత 1999 లో రిటైర్ అయ్యారు అబ్దుల్ కలాం పదవి విరమణ చేసిన, మూడు సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవ్వడానికి ప్రతిపాదన వచ్చింది. అది ఎలా జరిగింది పదవి విరమణ తర్వాత అబ్దుల్ కలాం అన్నా యూనివర్సిటీలో అధ్యాపకునిగా చేరారు, ఒకరోజు వాళ్ళ ఆఫీస్ కి కాల్ వచ్చింది కలాం గారితో ప్రధానమంత్రి గారు మాట్లాడాలి అనుకుంటున్నారు అని ముందు ఏదో ఆగతాయి కాల్ అనుకున్నారు. కానీ అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ నేరుగా కలాం గారితో మాట్లాడారు, మీలాంటి వ్యక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతిగా ఉండటానికి అర్హులు అన్న విషయం చెప్పారు, ఆ విషయం విన్న కలాం గారు ఆశ్చర్యానికి లోనయ్యారు. తనకు ఒక రెండు గంటల సమయం కావాలి అని అడిగారు. ఈ రెండు గంటల్లో చిన్ననాటి నుంచి కలలు కన్నా విజన్ 20 2020 గురించి ఆలోచించారు, అంతరిక్ష యానలో మనం దేశాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఏం కావాలో స్పష్టంగా అర్థం చేసుకున్నారు, 25 జూలై 2002న 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు, రాష్ట్రపతిగా ఉన్నా కూడా తనకి ఇష్టమైన బోధనని అస్సలు వదులుకోలేదు, సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులతో గడిపేవారు బోధన చేసేవారు తన ఆఖరి నిమిషం వరకు బోధిస్తూనే ఉన్నారు. చివరికి 27 జూలై 2015న షిలాంగ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో పిల్లలకి బోధించడానికి వెళ్ళినప్పుడు అయన మరణిచినప్పుడు కూడా 350000 మంది ఆయన చివరి చూపుకు రావడం జరిగింది. ఇది చూస్తే అర్థమవుతుంది ఆయన మిస్సైల్ మ్యాన్ మాత్రమే కాదు ప్రజల మనిషి అని, అబ్దుల్ కలాం జీవితం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని అలా చివరికి భారతదేశాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన స్థానంలో నిలబెట్టారు అబ్దుల్ కలాం గారు.