అమెరికాకు ఎలోన్ మస్క్ కొత్త ఐడియా, ఇది నిజం గా సాధ్యమేనా, కండలు దాటి చేసే ప్రయాణం ఇక పైన నిమిషాల వ్యవధిలోనేనా, ఎలోన్ మస్క్ కొత్త ప్రాజెక్ట్ నిజమేనా, ఇది ఎలా సాధ్యం అన్న అంశాలపై ప్రపంచం మొత్తం ఆశ్చర్యం తో నోరు వెల్లబెడుతుంది, ఎలోన్ మస్క్ చెప్పేదాన్ని ప్రకారం అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి 40 నిమిషాల్లో జనాలను డ్రాప్ చేస్తానంటున్నారు ఎలోన్ మస్క్ , అమెరికా టు ఢిల్లీ 40 నిమిషాలు అమెరికా టు సిడ్నీ గంట ప్రయాణం, యుఎస్ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన ట్రంప్ గెలిచారు ఆయన అలా విజయం సాధించారో లేదో ఇలా మస్తు సంపద పెరిగింది, ఇక మస్క్ కు ఫెడరల్ సర్కారులో కీలక బాధ్యతలు అప్పగించారు, ట్రంప్ ఇండియాలో ఎంటర్ కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్న మస్క్ కు సాటిలైట్ స్పెక్ట్రం రూపంలో స్టార్ లింక్ రూట్ చూపించింది, జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు, ఆ తర్వాత తన కూతురు స్పేస్ ఎక్స్ ను ఎక్స్పాండ్ చేసేందుకు మస్క్ ప్రణాళికలు రచిస్తున్న స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభం చేయడం తక్కువ టైం లో ఎక్కువ దూరం ట్రావెల్ చేసేలా ఓ ప్రాజెక్టును తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఆయన చేసే రాకెట్స్ స్పేస్ మీద తిరిగేది.
లేటెస్ట్ గా టెస్లా బ్యాటరీలతో కారు నడపడం ఇవన్నీ తీసి ఒక విశేషమైన విమానం తయారు చేసి స్పీడ్ గా చేయటం, అంతర్జాతీయ ప్రయాణం రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మస్క్ ప్రకటించారు, ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతోంది, అదే స్టార్ షిప్ రాకెట్ దీని సాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల లోపు చేరుకోవచ్చు, మస్క్ చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది నిజానికి ఈ టెక్నాలజీ గురించి స్పేస్ ఎక్స్ కంపెనీ పదేళ్ల కిందే సూచనలు చేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఇది చర్చకు వచ్చింది, ఈ టెక్నాలజీకి సంబంధించి twitter లో ఓ యూసర్ వీడియో పోస్ట్ చేయగా, ఇప్పుడు ఇది సాధ్యమే అంటూ మస్క్ రిప్లై ఇచ్చారు, మామూలుగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది అయితే ఇప్పుడు మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీ తో ఈ ప్రయాణ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోతుంది, ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై పనులు జరుగుతున్నాయ, మరికొన్నేళ్లలో ఇది జనాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది, అయితే ఈ ప్రాజెక్టులో ప్రయాణం చేయాల్సింది విమానంలో కాదు రాకెట్ ద్వారా, రాకెట్ ఆకాశంలో జట్ స్పీడ్ తో ఒక్కసారిగా దాదాపు భూకక్ష సరిహద్దుల వరకు వెళ్లి ఆ తర్వాత గమ్య స్థానం వైపునకు దూసుకొస్తుంది, దీంతో ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది, అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టుకు అక్కడి ప్రభుత్వం ఈజీగా అనుమతులు ఇస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు, దీంతో మస్క్ కొత్త ప్రాజెక్టు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది, స్పేస్ ఎక్స్ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలు చేస్తోంది, ఎలాగైనా అంగారకుడిపై అడుగుపెట్టి అక్కడ నివాస కాలనీలు నిర్మించాలి అన్నది మస్క్ ప్లాన్, దీనికి సహకరిస్తారని ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది, అయితే మస్క్ వేరే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పుడు ఈ స్టార్ షిప్ ప్రాజెక్టు తో అర్థమవుతోంది. ఈ మధ్య మస్క్ ఓ అద్భుతం చేసి చూపించారు, ఎలా పైకి వెళ్ళిన రాకెట్ అలాగే వచ్చి లాంచ్ అయింది, అంటే ల్యాండింగ్ విషయంలో మస్క్ కంపెనీ సక్సెస్ అయినట్టే దీన్నే స్టార్ షిప్ కు అప్లై చేసే అవకాశం ఉంది, ఇప్పుడు ఈ స్టార్ షిప్ విషయంలోనూ సేమ్ సీన్ కాయం అనే చర్చ జరుగుతోంది,
నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏడాది ముందు నుంచే పనులు స్టార్ట్ అయ్యాయి, 395 అడుగుల అంతరిక్ష నౌకను కూడా మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ సిద్ధం చేసింది, సహజంగానే ఉక్కుతో తయారు చేయడంతో ఇది చాలా తేలికగా ఉంటుంది, మస్క్ఎర్త్ టు ఎర్త్ అంతరిక్ష యాత్ర సాధ్యమైతే ప్రపంచ రవాణా రంగంలోనే ఇది అద్భుతంగా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, భూమిపై అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా 1000 మందిని ఒకేసారి కక్షలోకి తీసుకెళ్లి వెళ్లే ప్రణాళిక ఉంది, అయితే అంతరిక్షంలోని చీకటిలోకి వెళ్ళకుండా భూమికి సమాంతరంగా ఎగిరి మరొక మూలలో అంటే ఇతర నగరంలో స్టార్ షిప్ ల్యాండ్ అవుతుంది, ప్రాజెక్టును ఇలా డిజైన్ చేశారు. ఇవాళ అమెరికాలో ఉన్న నాసా కూడా ఆయన చేసే పని మేము చేయలేము అని ఒప్పుకుంటున్నారు, ఎలోన్ మస్క్ ఏమన్నాడంటే ఇవాళ మన విమానాలు 600 మైళ్ళు 700 మైళ్ళు మాక్సిమం వెళ్తున్నాయి, అది 7000 మైలు కూడా వెళ్లొచ్చు, ఎందుకంటే స్పేస్ లో రాకెట్స్ ప్యాసెంజర్స్ ని తీసుకుని వేల వేల మైల్ స్పీడ్ లో వెళ్తాది గ్రావిటీ అనేది లేదు కాబట్టి ఈ స్టార్ షిప్ లాస్ ఏంజెల్స్ నుంచి టొరంటో కి 4000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాల్లో కవర్ చేస్తుంది, ఇదే దూరం విమానంలో ట్రావెల్ చేయాలంటే నాలుగు గంటలకు పైగా టైం పడుతుంది. లండన్ నుండి న్యూయార్క్ కు 5500 కిలోమీటర్ల దూరం కేవలం 29 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, దీనికి ప్రస్తుతం ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది, ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు 12300 కిలోమీటర్ల దూరం విమానంలో అయితే దాదాపు 16 గంటల సమయం పడుతుంది.
రాకెట్ లో కేవలం 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, అమెరికా నుంచి ప్రపంచంలోని ఏ మూలకైనా సరే మహా అయితే గంటలో ప్రయాణికులను చేర్చాలి అన్నది మస్క్ స్టార్ షిప్ రాకెట్ ప్లాన్, ఈ వ్యోమ నౌకలో కూర్చున్న ప్రయాణికులు గురుత్వాకర్షణను ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలో ఈ అనుభూతి అద్భుతంగా ఉండే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది, ఇక ఈ స్టార్ షిప్ లో ప్రయాణించాలంటే ఖర్చు కూడా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి, వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మస్క్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కుదిరితే మరో రెండు మూడేళ్లలో ఈ ప్రాజెక్టు మొదలయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది.