ఏపీ ఐటి ముఖచిత్రం మార్చేలా google తో చేసుకున్న ఒప్పందం గేమ్ చేంజర్ గా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు….

ఏపీ ని డెవలప్ చేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తుందని, రాష్ట్రం లో ఐటి సంవత్సలను పెంపొందించాలని, ఏపీ ఐటి ముఖచిత్రం మార్చేలా google తో చేసుకున్న ఒప్పందం గేమ్ చేంజర్ గా మారుతుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎల్లుండి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్టు తెలియజేసారు, సచివాలయంలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన చంద్రబాబు, అయితే గడిచిన ఆరు నెలల పాలన పైన భవిష్యత్ ప్రణాళికలపై వివరించారు, ఏపీ ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చి ప్రజలు స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ లకు నిర్దేశించారు సీఎం.  అయితే మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమయానికి రాష్ట్రం మరీ చీకట్లో ఉందన్న చంద్రబాబు ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని తెలిపారు, గత ప్రభుత్వం పాలనలో ఉండగా, పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడమే కాకుండా రెండేళ్ల పాటు రాష్ట్రానికి వచ్చే నిధులను వాడేసిందని వ్యాఖ్యానించారు, అయినా సరే రాష్ట్రాన్ని గట్టెక్కించామని సంక్షేమం అభివృద్ధి వైపు వడిగా అడుగులు వేయిస్తున్నామని తెలియ జేశారు. ఏపీ బ్రాండ్ ను దెబ్బతీసిన వారిని క్షమించొద్దని, ఏపీ మీద విశ్వసనీయతను నమ్మకాన్ని తిరిగి నిలబెట్టి రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని దిశా నిర్దేశం చేశారు, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ  మన బ్రాండ్ దెబ్బ తిరిగిందని, ఐదేళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చామని, ఆరు నెలల్లో ప్రపంచం మొత్తం వన్ బై వన్ మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చామని, దీనికి కారణం విశ్వసనీయత ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి అన్నారు, 

అలాగే డెవలప్మెంట్ జరుగుతుంది అన్నారు, ఆటోమేటిక్ గా మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తామని పేర్కొన్నారు, గవర్నమెంట్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదని తెలియజేసారు.

 మీరు కూడా వేగాన్ని పెంచాలని, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉందని, ఇట్ ఇస్ అపర్చునిటీ ఫర్ యు, ఇట్ ఇస్ ఏ ఛాలెంజ్ ఫర్ యు టు ప్రూవ్ అని తెలియ జేశారు. అయితే రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్వహించాలని ఆదేశించారు, అలాగే వైసపి హయాంలో అలవాటుగా మారిన అక్రమాలకు అడ్డుకట్టపడాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పడం జరిగింది, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ అకౌంట్స్ వార్ చేయడం 22 ఏం మార్క్ చేయడం 60% అయ్యే ఉన్నాయని, ఫ్రీగా ఇసుక ఇస్తానన్న అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చిందని, దీన్ని కూడా సెటిల్ చేసి చేస్తున్నాం అని, గంజాయి గాని, డ్రగ్స్ గాని చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వచ్చిందని, రాష్ర్టం లో  ఏ నేరం జరిగిన దాని వెనకాల కచ్చితంగా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చిందని,  పోర్ట్లని ఇది చేసుకొని రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయడం ఇదొక పెద్ద మ్యాపియా అని,  మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటివి ఉంటే మాత్రం రూట్స్ తో కూడా పెకలించాలి అని ఇంకా తదితర సమస్యల గురుంచి వ్యాఖ్యానించడం జరిగింది.

Scroll to Top