అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా మంచి ఆరోగ్యం కోసం ఫ్రూట్స్ కి మించిన ఆహారం ఏమి ఉండదనే చెప్తారు, చిన్న వ్యాధినుంచి పెద్ద పెద్ద వ్యాధుల వరకు కూడా ఒక్కో అనారోగ్యానికి ఒక్కోరకం పండును ఆయుర్వేదం లో చెప్తారు, పళ్ళు ఆకులూ వేర్లు కొమ్మలతో సహా ప్రకృతి నుంచి సహజ సిద్ధం గా లభించే ప్రతి ఆహారం ఎంతో ఆరోగ్యాన్ని అందాన్ని ఇస్తుంది, ఆరోగ్యం తో చేరుమా అందాన్ని కూడా ఈ పండ్లే ఇస్తాయని చెప్పవచ్చు. అలానే ఏ సీజన్లో కి తగ్గట్టు ఆ సీసొనాల్ పండ్లు తింటే సరిపోతుందని మనం తెల్సు కోవాలి, అయితే ఈ శీతాకాలం లో తక్కువ ధరకే లభించే మంచి సీసొనాల్ ఫ్రూట్ కమల పండ్లు, ఇవి సంకరజాతి పండ్లు, నారింజ పండ్లు లాగానే ఉంటాయి, ఇవి చైనా దేశం లో బాగా ఎక్కువగా పండిస్తుంటారు, ఎక్కువగా దక్షిణతూర్పు ఆసియా దేశాలైన భారత్ , చైనా, వియత్నాంలలో పెరుగుతుంది. కమలా ఫండులో తీపి కమలా, చేదు కమలా అనే రెండు రకాలుంటాయి. దీంట్లో అధిక మొత్తం లో నీరు ఉంటుంది, షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్ కమలా పండు రోజూ ఒకటి తినడం వలన షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. కమలా పండులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు.
అంతేకాదు మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కమలాపండులో ఉన్న క్యాల్షియం ఎముకల దృఢత్వానికి , కండరాలు గట్టిపడేలా కమలా పండు చేస్తుంది. కమలాపండులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఈ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. కమలాపండును తినడం రోజూ తినడం వలన చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చర్మంపై ఏర్పడే ముడతలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా.. యవ్వనంగా కనబడుతుంది. కమలాపండులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. శరీర బరువు తగ్గాలనుకొనే వారు రోజూ కమలాపండు డైట్ లో చేర్చుకోవడం మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్లో కమలా పండ్లు తీసుకోవడం మంచిది. ఈ సీజన్లో ఎక్కువగా కనిపించే పండ్లు.. కమలాఫలాలు. కాలానికి తగినట్లే.. ఈ పండ్లు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే జలుబు, జ్వరాలకు కమలా పండ్లు మంచి ఔషదం. ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్లో కమలా పండ్లు తీసుకోవడం మంచిది. ఇంకా ఆలా చెప్పుకుంటే పోతే వీటి వాళ్ళ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.