కార్తీక దీపం Serial Today Episode(04/11/2024)

కార్తీక్ దీపాలకు నేనే రిసెసిప్షన్ చేయించి అందరికి వాళ్ళు భార్య భర్తలని తెలిసేలా చేస్తాను అని శపధం చేసిన స్వప్న ,కాసి లు…?

కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో  ఏం జరిగిందో చూద్దాం,  కాసి స్వప్న దాసు లను పారిజాతం ఇష్టం వాచినట్టు తిడుతుంది, అంతే కాకుండా కార్తీక్ దీప లను కూడా చాల అవమానించేలా మాట్లాడుతుంది, చెప్పుకోడానికి తప్ప మీ అన్నయ్య వదినలు బయటకు వెళ్తే చుసిన వాళ్లంతా చి కొడతారు అంటుంది, అప్పుడు స్వప్న నేను మా అన్నయ్య వదినాలకు అందర్నీ పిలిచి రిసెప్షన్ చేస్తాను అంటుంది,వాళ్లిద్దరూ భార్య  భర్తలని అందరికి తెలిసేలా చేస్తాను, మీరు గట్టిగ మాట్లడితే పేపర్ లో కూడా వేయిస్తాను అంటుంది, కాసి కూడా మనం అక్క కి బావ కి రిసెప్షన్ చేద్దాం ఎవరు ఆపుతారో చూద్దాం అనుకుంటూ ఉంటారు, అప్పుడు పారిజాతం చేస్కోండి అప్పుడు కానీ అంటారు చి కొట్టరు అంటూ కోపం గా వెళ్ళిపోతుంది, అప్పుడు స్వప్న ఆవిడ వచ్చి బాగానే చేసింది మనం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని ఒప్పిద్దాం అంటూ కార్తీక్ ఇంటికి బయల్దేరతారు ఆ ముగ్గురు.

దాసు వెతుకుతున్న వాళ్ళ అడ్రెస్స్ ముత్యాలమ్మ గూడెం అని తెలుసుకున్నాడు, అనసూయ ఆది మా ఉరే అంటుంది దాసుతో…

కార్తీక్ దీప లు సీరియస్ గా ఉండటం చూసి సౌర్య అనసూయ తో నానమ్మ అమ్మ నాన్న ఎందుకు ఆలా కోపం గా ఉన్నారు వాళ్ళిద్దరికీ గొడవ అయిందా అంటుంది, అప్పుడే అక్కడికి కాసి స్వప్న దాసులు వస్తారు, కాసి దీప ని అక్క రా అంటూ తీస్కలెత్తాడు, స్వప్న కూడా కార్తీక్ రూమ్ లో నుంచి బయటకు తీస్కుని రా అన్నయ్య అంటూ చెయ్యి పట్టుకుని లాక్కొస్తాడు, కార్తీక్ దీప లను పక్క పక్కన సోఫాలో కూర్చోండి అంటూ అంటారు, అప్పుడు కార్తీక్ మీరిలా చేస్తున్నారు అంటే ఎదో ప్లానింగ్ వేస్కుని వచ్చారు అంటాడు, ఈ లోగ దాసు కి ఫోన్ వస్తుంది అనసూయ వంట గదిలో వంట చేస్తూ ఉండగా ఆమెని గమనించకుండా దాసు ఫోన్ లో మాట్లాడతాడు, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఊరు పేరు చెప్తాడు, అప్పుడు దాసు ముత్యాలమ్మ గూడెం అంటుండగా అనసూయ విని ముత్యాలమ్మ గూడెం మా ఉరే అని అంటుండగా దాసు ఈ విష్యం ఎవ్వరికి తెలీకూడదని ఏమి లేదు అంటూ అనసూయ ని అక్కడినుంచి పంపించేస్తాడు.

దీపని రిసెప్షన్ కి ఒప్పించమని సౌర్య తో ప్లాన్ చేస్తారు…….

కాసి దీప తో అక్క నిన్నొమాట అడుగుతాను చెప్పు అంటాడు, ఏంటి చెప్పమంటాడు కార్తీక్, అప్పుడు కాసి మీ  రిసెప్షన్ పెట్టి అందర్నీ పిలిచి జరిగిన పెళ్లి గురుంచి అందరికి తెలిసేలా చేద్దాం అనుకుంటున్నాము అంటాడు, నువ్వేం అంటావ్ అక్క అని దీప ని అడుగుతాడు, అప్పుడు దీప నీ ఆలోచన చాల మంచిది కాసి, గుడిలో జరిగిన మీ పెళ్లి గురుంచి అందరికి తెలియాలి అంటుంది, అప్పుడు స్వప్న వదిన రిసెప్షన్ పెట్టేది మాకు కాదు మీ ఇద్దరికీ, మా పెళ్లి ఫోటోలు అందరికి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి మేము అనేది మీ పెళ్లి గురుంచి అంటుంది, అప్పుడు దీప ఏమి అవసరం లేదు నేను మీ ఇద్దరి గురుంచి చెప్తున్నావేమో అనుకున్నాను అంటుంది, అప్పుడు స్వప్న అందరు ఎవరి ఇష్టం వాచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ నోర్లు ముయ్యాలంటే మీ ఇద్దరికీ పెళ్లి అయినట్టు అందరికి తెలియాలి, ఏం అంటావ్ అన్నయ్య అంటుంది, అప్పుడు కార్తీక్ ముందు షాక్ హ్యాండ్ ఇచ్చుకో అంటూ నా మనసులో క్లారిటీ లేని ఆలోచనలకూ నువ్వే మంచి సలహా ఇచ్చావ్ మంచి ఆలోచన నేనే మా పెళ్లి గురుంచి అందరికి ఎలా తెలియాలి అనుకుంటున్నా నా చెల్లెలిగా నా మనసులో మాట బాగా చెప్పావ్ అంటాడు.

అప్పుడు దీప నిన్న నాలుగు గోడల మధ్య ఆలా జరిగింది సరిపోదా మల్లి అందరి ముందు ఈయన పరువు పోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నా కారణం గా వీళ్ళ పరువు పోవడం నాకు ఇష్టం లేదు అంటుంది, అప్పుడు దీప కార్తీక్ బాబు మీరేం మాట్లాడారేంటి అంటుంది, అప్పుడు కార్తీక్ నిన్ను ఒప్పుకొమ్మని నేనేం అనడం లేదు అది నీ ఇష్టం, కానీ నాకు జరిపించుకోవాలని ఉంది అది నా ఇష్టం, అమ్మ వాళ్లందరికీ ఇది జరిపించాలని ఉంది అది వాళ్ళ ఇష్టం నేను అందరి ఇష్టాలని నేను గౌరవిస్తాను అది నువ్వు అర్ధం చేసుకుంటే మంచిది అంటాడు, అప్పుడు దీప లేదు బాబు నేను ఒప్పుకోను అంటుంది, అప్పుడు దాసు అనసూయ లు ఎంతగానో నచ్చజెప్పడానికి చూస్తారు, కానీ దీప నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు ఇష్టం లేదు అంటూ లోపలి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటారు అదేంటి ఇప్పుడు ఎలా ఒప్పించాలి అనుకుంటూ ఉండగా సౌర్య రిసెప్షన్ అంటే ఏంటి అంటుంది, అప్పుడు స్వప్న కాసి లు మీ అమ్మ నాన్న లకు పెళ్లి అయింది అని అందరికి చెప్పడానికి ఈ ఫంక్షన్ అంటారు, అప్పుడు ఎవరు దీప ని ఒప్పిస్తారు అంటూ ఒకరిని ఒకరు అడుగుతూ ఉంటారు, ఎవరికీ వాళ్ళు ఆమ్మో నా వాళ్ళ కాదు ఒప్పుకోదు అనుకుంటూ ఉంటారు, అప్పుడు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తుండగా అందరు సౌర్య ని చూస్తారు, అప్పుడు సౌర్య అంటారు నన్ను చూస్తారేంటి అంటుంది,అప్పుడు మీ అమ్మ నాన్న అందరికి తెలియాలంటే నువ్వే మీ అమ్మ ని ఒప్పించాలి అంటారు.

దీప కార్తీక్ రిసెప్షన్ గురుంచి తెల్సుకున్న జ్యోత్స్న కుటుంబ సభ్యులు, కోపం గా దీప దగ్గరకి బయల్దేరిన జ్యోత్స్న……

జ్యోత్స్న ఇంట్లో అణ్డరు భోజనం చేస్తూ ఉండగా శివన్నారాయణ దశరథ నువ్వు ఒకసారి పనుతులు గారితో మాట్లాడి పెళ్లి చూపులకి మంచి రోజు ఎప్పుడు ఉందొ కనుక్కో అంటాడు, ఈ లోగా పారిజాతం కి దీప కార్తీక్ లా రిసెప్షన్ గురుంచి మెసేజ్ వస్తుంది, అప్పుడు పారిజాతం కంగారు పడుతుండగా శివన్నారాయణ చూసి ఏమిటీ కంగారు పడుతున్నావ్ అంటూ తన ఫోన్ ఇమ్మని దశరథ కి ఇచ్చి చదవు అప్పుడు దశరథ కార్తీక్ దీప ల రిసెప్షన్ ఇన్విటేషన్   నాన్న అంటాడు, అప్పుడు వాళ్ళ ఇన్విటేషన్  దీనికి ఎందుకు వచ్చింది అంటాడు, అప్పుడు దశరథ వెల్కమ్ బై కాసి స్వప్న అని ఉంది నాన్న అంటాడు, శివనారాయన అద్భుతం మాహా అద్భుతం, నా అల్లుడు వేరే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆ దీప రెండో పెళ్ళాం కుర్ధురికి కాసి తో పెళ్ళిచేసింది, కార్తీక్ నేను ఒక మెట్టు దిగి వచ్చాక కూడా నన్ను కాదని దీప మేడలో తాళి కట్టాడు, వీళ్లకు అసలు సిగ్గు లేదు అంటుంటాడు, వేళ్ళకి రిసెప్షన్ పెట్టి వీళ్ళ పెళ్లిని అందరికి తెలియాలని చూస్తున్నారు దీని తర్వాత మనం  చాలా మందికి సమాధానం చెప్పాలి సిద్ధం గా ఉండు అంటూ శివన్నారాయణ వెళ్ళిపోతాడు, అప్పుడు జ్యోత్స్న దీప దగ్గరికి వెళ్తుండగా అప్పుడు పారిజాతం ఇప్పుడు వద్దు రేపు చూద్దాం అంటూ ఆపుతుంది.

Scroll to Top