కార్తీక దీపం Serial Today Episode(10-05-24)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. దీప తాను పని చేసే హోటల్ బాబాయ్ దగ్గరకు ఉప్మా వండుకుని తీసుకెళ్తుంది, మన హోటల్ లో ఉప్మా కూడా పెడదాం అని చెప్పి మాట్లాడుకుంటారు, ఈ లోగ బాబాయ్ నాకు ఒక అనుమానం అమ్మ చెప్తే తప్పుగా అనుకొవ్వు కదా అంటదు దీప తో, అర్ధం కాకా అడుగుతున్నాను అంతే అమ్మ నువ్వేం అనుకోక కూడదు అంటూ దీప ని నువ్ అంత పెద్ద ఇంట్లో ఉన్నావ్ కదా ఆ ఇంట్లో పనిమనిషివి అనుకున్న అమ్మ కానీ ఆ ఇంటి మనిషి నిన్ను ఏవండీ అని పిలుస్తున్నారు, పైగా నిన్ను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఆ బాబు గారికి ఏంటి ఆ బాబు తల్చుకుంటే నీ జీవితానికి ఇంతకంటే మంచి సహాయమే చెయ్యగలరు అయినా నువ్వు న దగ్గర పని చెయ్యడం ఏంటమ్మా అంటదు బాబాయ్ దీప తో, ఎదో తెలుసుకోవాలని అడిగా అంతే చెప్పాలనుకుంటేనే చెప్పు అంతే అంటాడు. అప్పుడు దీప ఎం పర్లేదు లే బాబాయ్, ఒకరికి ప్రమాదం జరుగుతుంటే నేను కాపాడాను, కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి, నేను కాపాడిన సుమిత్రమ్మ గారి మేనల్లుడి అతను, అందుకే ఆలా మాట్లాడాను, అక్కడ నేను మాత్రం ఎన్ని రోజులు ఉంటాను బాబాయ్, అక్కడ మన అవసరం తీరిపోయిన తర్వాత నా కూతుర్ని తీస్కుని వచ్చేస్తాను అంటుంది దీప. అప్పుడు హోటల్ బాబాయ్ నువ్ నీ కూతుర్ని తీస్కుని ఊరు వెళ్ళిపోతావా అమ్మ నిన్ను నమ్ముకుని ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను అంటాదు దీప తో, అప్పుడు దీప ఎక్కడికి వెళ్ళాను లే బాబాయ్, నాకు అంటూ ఎవరు లేరు నేను ఇక్కడే ఉంటాను న కూతుర్ని చదివించాలి చాల చాల భాద్యతలు ఉన్నాయ్ అని చెప్పి హోటల్ పనులు అన్ని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప.

నరసింహ తన తల్లి ఇద్దరు కూర్చుని దీప గురుంచి మాట్లాడు కుంటుంటారు, శోభా ని మంచినీళ్లు తీసుకురమ్మ అంటుంది వాళ్ళ అత్తగారు,  శోభా ని చూసి నువ్వే నా మొదటి కోడలు అయితే బాగుండు అంటుంది వాళ్ళ అత్తగారు, అప్పుడు శోభా మొదటి కోడలు ఏంటి అత్తయ్య ఉన్నది ఒకతే కోడలు, మీ మేనకోడలు ఏమైనా గుర్తొచ్చిందా లేక మీ మనవరాలు గుర్తొచ్చిందా అంటుంది శోభా, అప్పుడు నరసింహ మా అమ్మ ఎదో మాములుగా అంది లేవే అంటాడు, అప్పుడు అప్పుడు శోభా ఇప్పటికే నువ్ చేసిన పనికి బస్తీలో తల ఎత్తుకుని ఉండలేక పోతున్నాం, ఆ దీప ఇక్కడే ఉందంటే ఈసారి కూతుర్ని వేస్కోచి నాకు న్యాయం చెయ్యండి అంటూ ఇంటిముందు కూర్చుంటుంది అంటుంది, అత్త అన్న మాట అందరు అనేక ముందేఇదొకటికి జరగాలి, విడాకులు తీస్కుంటావో, దూరం గా తరిమేస్తావో నీ ఇష్టం అంటుంది శోభా, అది మాత్రం దగ్గర్లో ఉండటానికి వీల్లేదు అవసరం అయితే కొట్టు, దానికి ఆత్మభిమానం ఎక్కువ కదా దాని మీదే కొట్టు అంటుంది, అప్పుడు వాళ్ళ అత్తగారు కోడలుపిల్ల అది పొమ్మంటే పోయింది కదా దాని భ్రాతుకు ఎదో అది భ్రాతుకుతుంది అంటుంది, అప్పుడు శోభా ఆ ఎలా భ్రాతుకుతుందో మీరే రోడ్డు మీద చూసారు కదా, న భయాలేవో నాకు ఉన్నాయ్ అంటుంది శోభా.నువ్వేదిన చేస్తావా లేదా నన్ను చేయమంటావా, మా అమ్మ ని రారమ్మంటాను అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఒరేయ్ దాని జోలికి వెళ్ళకండి రా వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాని జోలికి వెళ్తే పోలీస్ కేసు పెట్టిన పెడతారు అంటుంది, అప్పుడు శోభా విన్నవీ గా పోలీస్ కేసు వరకు వచ్చింది, నువ్ వాళ్ళ ఇంటికి వెళ్లి దాన్ని తరిమి కొట్టు అని చెప్పి లోపలి వెళ్ళిపోతుంది శోభా.నరసింహ తల్లి ఇదేంటి రా ఇలా రెచ్చగొడుతుంది, అది రెచ్చగొట్టింది నువ్వు  రేచిపోక ఆ దీప చాల తెలివైనది దాని గురుంచి మనకు తెల్సు కదా వీలైనంత వరకు దాని దగ్గరకి వేళ్ళకు అదే మంచిది అంటుంది. 

                                                                   సౌర్య దీప ని నానమ్మ నువ్వు కలిసి వెళ్లారు కదా నానమ్మ ఏది అమ్మ అని అడుగుతుంది, ఈ లోగ సుమిత్ర వస్తుంది, చెప్పు ఎం అయిందో అంటుంది సుమిత్ర దీప ని, అప్పుడు సౌర్య తో దీప నానమ్మ ఊరు వెళ్లిపోయిందమ్మా నువ్ వెళ్లి పడుకో అంటుంది సౌర్య ని, అప్పుడు సుమిత్ర దీప ని పక్కకి తీసుకెళ్లి ఇప్పుడు చెప్పు మీ అత్తయ్య ఎక్కడ, కొడుక్కి బుడ్డి చెప్తాను కోడలి కాపురాన్ని చక్కదిద్దు తాను, వాడి సంగతి చెప్తాను అని చెప్పింది కదా ఎం చేసారు, నరసింహ దగ్గరకి వెళ్ళారా, మాట్లాడారా అంటుంది, మీ అత్తయ్య మీ ఆయనతో మాట్లాడిందా అని అడుగుతుంది, మీ ఆయన్ని రెండో పెళ్లి గురుంచి అడిగింది అంటుంది ఆలా అంటున్నప్పుడు కార్తీక్ వాళ్ళ మాటలు వింటాడు, సుమిత్ర దీప ని ఆ అమ్మాయి తో మాట్లాడిందా అంటుంది, మాములుగా అయితే మాట్లాడటం కాదు భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే కేసు పెట్టాలి అంటుంది,అడుగుతుంటే మాట్లాడవేం దీప అంటుంది, అప్పుడు దీప సుమిత్ర తో చెప్పడానికి ఏమి మిగల్లేదు అమ్మ, మీ దగ్గర సంపదలు చేసిన మనిషి అక్కడికి వెళ్లిన తర్వాత నాకు చివాట్లు పెట్టింది, తాళి కట్టిన భార్య ని అప్పులోళ్లకు వదిలేసి ఊరొదిలి పారిపోయిన తన కొడుకుడెం తప్పులేదు అంట, తప్పంతా నాదే అంట చివరికి తన కొడుకు రెండో పెళ్లిని కూడా సమర్ధించింది అంటుంది, అప్పుడు సుమిత్ర ఆలా ఎలా సమర్దిస్తుంది దీప ఆమె మీ సొంత మేనత్త కదా అంటుంది, అప్పుడు దీప మేనత్త కాబట్టే మొహం మీద తిట్టింది అమ్మ, నీకు నీ కూతురుకి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పింది, నేను భర్త వదిలేసినా ఆడదాన్ని కాదు అత్త వదిలేసినా ఆడదాన్ని కూడా అంటూ భాద పడుతుంది దీప, వాళ్ళెవ్వరికి నేను నా కూతురు అవసరం లేదు అమ్మ, ఎలా బ్రతుకుతారో పోయి భ్రాతకండి అంది, ఇప్పుడు మా అత్తయ్య కి ఆ రెండో ఆవిడే కొడాలంట, నాన్న పోయినప్పుడు కూడా నేను అందని అనుకోలేదు అమ్మ, ఎందుకంటే మేనత్త, మేనత్త కొడుకు ఉన్నారు కదా అనుకున్నాను అయన చనిపోయి దూరం అయ్యారు వీళ్ళు భ్రతికి ఉండగానే దూరమయ్యారు ఇప్పుడు నిజం గానే నేను న బిడ్డ అనాథలం అయ్యాము అమ్మ ఆలా అని నేనేం ఏడుస్తూ కూర్చొను, మారుతున్న కలం తో పాటు ప్రయాణం చేస్తున్నవాళ్లు మారకుండా ఉన్నారు అనుకోవడం న వెర్రితనం, నాకు ఎవరు లేకపోవచ్చు అమ్మ కానీ నా కూతురుకి నేను ఉన్నాను, ఈ ఆకలి కష్టాలు కన్నీళ్లు దానికి తెలీకూడదు అమ్మ అందుకే నేను ఒక హోటల్ లో చేరాను, కలం నన్ను చావు దెబ్బ కొట్టిన లేచి నిలబడతాను కానీ బయపడి పారిపోను అమ్మ, అందుకే అంత పెద్ద అవమానం జరిగిన కూడా గుండె ఆగి మధ్యలో పడిపోకుండా దైర్యం గా ఇంటికి వచ్చాను ఎందుకంటే ఇంకా పోగొట్టుకోడానికి ఏం మిగిలిందని బాధ పడాలి ఇంకా న దగ్గర ఉంది ప్రాణం ఒక్కటే అదే నా కూతురు దానికి ఇవన్నీ తెలీకూడదు అమ్మఅందుకే అది నాన్న గురుంచి అడిగిన నానమ్మ గురుంచి అడిగిన ఇదొక అబద్దం చెప్తున్నాను, ఆ నాన్న రాడు, ఆ నానమ్మ రాదు అంతే అంటుంది దీప. అప్పుడు సుమిత్ర నీకు జరిగిన నష్టానికి వాళ్ళకి బుద్ది చెప్పాల్సిందే నీ భర్త మీద పోలీస్ కేసు పెడదాం అంటుంది సుమిత్ర, నీ అత్త మీద కూడా పోలీస్ కేసు పెట్టాల్సిందే అంటుంది, అప్పుడు దీప వద్దమ్మా వల్లే వద్దు అనుకున్నప్పుడు ఎవరి మీద కేసు పెడితే ఏం ఉపయోగం అంటుంది దీప, నాకు జరిగిన అన్యాయానికి మీరు భాద పడుతున్నారని అర్ధం అయింది , మీరు ఇప్పుడే విన్నారు కాబట్టి భాద పడుతున్నారు, నేను వాళ్ళ కోసం కార్చిన కన్నీళ్ళన్నీ దారిలోనే వదిలేసి ఇంటికొచ్చాను వదిలేయండి అమ్మ అంటుంది సుమిత్ర తో.

Scroll to Top