కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. జ్యోత్స్న కార్తీక్ ని బయటకు వెళ్దామా అని అడుగుతుంది, అప్పుడు సుమిత్ర కార్తీక్ ని న కూతుర్ని బయటకు తీస్కెళ్ళారా అంటుంది, అప్పుడు కార్తీక్ సరే నేను బయట ఉంటాను రమ్మంటాడు జ్యోత్స్న ని, జ్యోత్స్న సుమిత్ర తో థాంక్స్ అమ్మ నువ్వు నన్ను అర్ధం చేసుకున్నావ్ అంటుంది, నిన్ను మేము తిట్టినపుడల్లా నే మీద ప్రేమ లేదని కాదు భయం కూడా అంటుంది సుమిత్ర, ఓ అందమైన జీవితాన్ని నీకు అందిద్దాం అనుకున్నాం అది నీకు అండ్ లోపు ఎక్కడ నువ్ దూరం చేస్కుంటావో అని మా భయం అంటుంది, నీ సంతోషం కంటే మాకు ఏది ముఖ్యం కాదమ్మా అది నువ్వు అర్ధం చేస్కో, సరే బయట నీ కోసం కార్తీక్ ఎదురుచూస్తున్నాడు హ్యాపీ గ వెళ్లి ర అంటుంది జ్యోత్స్న ని. కార్తీక్ జ్యోత్స్న కార్ లో బయటకు వెళ్తుంటే ఒక స్కూల్ ముందు సౌర్య కనిపిస్తుంది, అప్పుడు కార్తీక్ కార్ దిగి సౌర్య దగ్గరకు వెళ్లి ఏ రౌడీ ఇక్కడ ఉన్నవేంటి అంటదు, అప్పుడు సౌర్య నేను ఈ స్కూల్ లోనే జాయిన్ అయ్యాను గా అంటుంది, అప్పుడు కార్తీక్ ఈ స్కూల్ లో జాయిన్ అవ్వడం ఏంటి మనం వేరే స్కూల్ అని అనుకున్నాం కదా అంటదు సౌర్య ని, అప్పుడు సౌర్య ముందు ఆ స్కూల్ కె వెళ్ళాం అంటుంది అప్పుడు సౌర్య ఎండా ఎక్కువగా ఉంది ఆలా కార్ లో కూర్చుందాం పద అని కార్ ఎక్కిస్తాడు సౌర్య ని, అప్పుడు అమ్మ నన్ను ముందు ఆ స్కూల్ కె తీసుకేల్లింది ఆ స్కూల్ లో జాయిన్ అవ్వాలంటే అమ్మ నాన్న బాగా చదువుకోవాలంట కానీ వాళ్ళు చదువుకోలేదు గ అంటుంది కార్తీక్ తో, కార్తీక్ నాకు ఆ స్కూల్ నే నచ్చింది అక్కడ ఆడుకోడానికి పార్కుకుడా ఉంది, నేను బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలంటే అమ్మ చెప్పింది అంటుంది సౌర్య, ఆమ్మో నేను స్కూల్ లో జాయిన్ అయినా విష్యం ఎవరికీ చెప్పొద్దూ అని చెప్పింది అంటుంది, అప్పుడు కార్తీక్ నువ్వెక్కడ చెప్పావ్ నేనే కదా నిన్ను స్కూల్ దగ్గర చూసింది అంటాడు సౌర్య ని, అప్పుడు సౌర్య ఒకే కార్తీక్ నేను లోపలి వెళ్తాను మా మిస్ కోప్పడుతుంది అని చెప్పి స్కూల్ లోపలి వెళ్ళిపోతుంది సౌర్య. అప్పుడు కార్తీక్ జ్యోత్స్న తో నేను ముందే చెప్పాను ఆ స్కూల్ లో జాయిన్ చేస్తుంటే బాగుంటుంది సౌర్య చాల తెలివిడి అన్నాను అప్పుడు దీప న కూతుర్ని ఎలా జాయిన్ చెయ్యాలో నాకు తెల్సు అని ఈ స్కూల్ లో జాయిన్ చేసింది అంటాడు, అప్పుడు జ్యోత్స్న మనసులో గ్రానీ చెప్పింది నిజమే బావ వీళ్ళని బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు అనుకుంటుంది, అప్పుడు కార్తీక్ జ్యోత్స్న అవునూ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటాడు, అప్పుడు జ్యోత్స్న ఎక్కడికి వద్దు ఇంటికి పోనివ్వు అంటుంది.
కార్తీక్ తండ్రి కావేరి అనే ఆవిడతో ఫోన్ లో వంటగదిలో ఉంది మాట్లాడుతూ ఉంటాడు, మా ఆవిడా నన్ను శ్రీరాముడు అనుకోబట్టే ఎన్నాళ్లయినా మన ఇద్దరికీ తప్ప ఎవ్వరికి తెలీదు అంటదు కావేరి తో, అప్పుడు కావేరి ఈ రోజు ఇంటికి వస్తున్నావా బేబీ అంటుంది కార్తీక్ తండ్రి ని, అప్పుడు అతను దేవి గారి దర్శనం చేసుకోకుండా నేను ఉండగలనా అంటదు కావేరి తో ఆలా మాట్లాడుతూ వేడి వేడి పాలను కాళీ ఫై పోసేసుకుని అరుస్తాడు ఫోన్ కింద పడిపోతుంది అప్పుడు కార్తీక్ తల్లి ఏమైంది అంటూ వంట గదిలోకి వచ్చి చూస్తుంది,తన భర్త ఇవన్నీ మీకు ఎందుకండీ, ఒక పనిమనిషిని పెట్టుకుందాం అంటే వినరు అంటుంది, ఈ లోగ ఆ కావేరి మల్లి ఫోన్ చేస్తుంటుంది, అప్పుడు కార్తీక్ తండ్రి నాకేం కాలేదు లే కాంచన నువ్ అనవసరం గా కంగారు పడకు అంటూ కాంచన ని కిచెన్ నుంచి బయటకు తీసుకెళ్తాడు, క్లీన్ చేసి వస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్లి నేను మల్లి కాల్ చేస్తాను అప్పటి వరకు నువ్ చెయ్యకు అంటూ ఫోన్ కట్ చేసి కాంచన కి శ్రీమతి గారు ముందు ఈ పాలు తగు అంటూ ఇస్తాడు, ఈ లోగ కార్తీక్ వచ్చి ఏం అయింది మమ్మీ అంటాడు కార్తీక్, అప్పుడు కాంచన మీ నాన్న చూడు ఎలా చేతులు కాళ్ళు కాల్చుకుంటున్నారో ఒక వంట మనిషిని చూడు కార్తీక్ అంటుంది, అప్పుడు తన తండ్రి వంట మనిషి ఎందుకు పెళ్లిచేసుకోమను అంటాడు, అప్పుడు కాంచన అంటే న కోడలిని వంట మనిషి చేస్తారా అంటుంది, అప్పుడు తన తండ్రి న మేనకోడలు కోడలిగా వచ్చిందంటే నా పనులను కూడా సగం పంచుకుంటుంది కదా అంటాడు, అప్పుడు కాంచన నా కోడలిని నేను ఇంటి పనులు చెయ్యనివ్వను అంది అంటుంది అప్పుడు కార్తీక్ తండ్రి ఇంటి పనులు కాదు కాంచన వాడి పనులు చేస్తే చాలు అంటాడు, అప్పుడు కార్తీక్ అబ్బా ఆపండి ఇంకా ఇప్పుడు మీకు వంట మనిషి కావాలి అంతే కదా అంటాడు, అప్పుడు కార్తీక్ తండ్రి కోడలు కూడా కావాలి అంటాడు, కాంచన కూడా అవును రా ఈ ఎండల్లో ముహుర్తాలు ఉన్నాయంటే నువ్ సరే అంటే నీర్చుతార్థం పెట్టుకుందాం అంటుంది, కార్తీక్ తండ్రి ఏరా ముహుర్తాలు పెట్టించమంటావా అంటాడు అప్పుడు కార్తీక్ పెట్టించండి రెస్టారెంట్ ఓపెనింగ్ కి అంటాడు, అయినా తర్వాత మీకు పెళ్లి గురుంచి చెప్తాను రెండు నెలల తర్వాత అని లోపలి వెళ్ళిపోతాడు కార్తీక్.
జ్యోత్స్న తో పారిజాతం అడగాలని వెళ్ళినదానివి పిల్ల అడ్డువచ్చిందని ఆగిపోవడం ఏంటి అన్ని అడిగేది ఉండాల్సింది కదా అంటుంది , అప్పుడు జ్యోత్స్న బావ దృష్టిలో నాకు అసలు ఇంపార్టెన్స్ నే లేదు అని చెప్పాను కదా ఆ రోజు అంతే సరదాగా బయటకు వెళ్దాం బావ అని తీసుకెళ్తే నన్ను కార్ లో కూర్చోపెట్టి దీప తో కలిసి టీ తాగుతున్నాడు ఈ రోజు అంతే పక్కన నేను ఉన్నాను అని మార్హ్సిపోయి పక్కన కూర్చూపెట్టుకుని స్కూల్ గురుంచి మాట్లాడుతూనే ఉన్నాడు, అంత అయిపోయిన తర్వాత జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు, కోపం తో ఇంటికి అని చెప్పాను అంతే కార్ ని యూ టర్న్ చేసాడు, ఎక్కడికో వెళ్దాం అన్నావ్ కదా ఇంటికి అంటున్నవ్ ఏంటి అత్త కూడా చెప్పింది కదా పోనీ మనం రెస్టారెంట్ కి వెళ్దామా లేదా కొత్తగా కడుతున్న రెస్టారెంట్ కి వెళ్దామా దానికి నీ పేరే పెట్టాం కదా వర్క్ ఎలా జరుగుతుందో చూద్దువు గాని ఇలాంటివేవీ లేవు గ్రానీ బావ లో నువ్వు అన్న మాటలు ఎక్కడ నిజం అయిపోతాయి అని భయం గా కూడా ఉంది గ్రానీ అంటుంది, నువ్వేం మాట్లాడవ్ ఏంటి గ్రానీ నేను మమ్మీ డాడీ లతో మాట్లాడనా అంటుంది, అప్పుడు పారిజాతం వద్దు దానికంటే ముందు నేను దీప ని కొన్ని అడగాలి అంటుంది, అప్పుడు జ్యోత్స్న ఏం అడగాలి అంటుంది, అప్పుడు పారిజాతం నాకున్న పెద్దరికాన్ని ఏం అడగాలో నాకు తెల్సు కానీ దానికంటే ముందు దాని కూతురుతో మాట్లాడాలి అంటుంది, తల్లి అయితే ముదురు గాని పిల్ల నైతే మాటల్లో పెట్టి మాయ చేసి నిజాలు బయటకు తీసుకురావచ్చు అంటుంది, అప్పుడు జ్యోత్స్న నువ్వేమైనా చెయ్యి గ్రానీ బావ లేకపోతే నేను బ్రతకను అంటుంది, అప్పుడు పారిజాతం నోరు ముయ్యవే నువ్ మొత్తం ఎవదాస్తికి శివన్నారాయణ గారి పరువు కి ఏకైక వారసురాలివి నువ్వు, నీకు కార్తీక్ కి పెళ్లి అయితే ఎవరో వచ్చి నే నేతి మీద కిరీటం పెట్టడం కాదు, ఈ వందల కోట్ల ఆస్తికి నువ్వే మహారానివి అవుతావు అంటుంది, అప్పుడూ జ్యోత్స్న నేను బావ గురుంచి మాట్లాడుతుంటే ఆస్థి గురుంచి చెప్తావ్ ఏంటి అంటుంది అప్పుడు పారిజాతం ఆస్థి నీకు దక్కాలని కాకపోతే నేను ఇదంతా ఎందుకు చేసినట్టు అంటుంది, అప్పుడు జ్యోత్స్న షాక్ అయ్యి నాకోసం నువ్వేం చేసావ్ గ్రానీ అంటుంది, అడిగేది నిన్నే గ్రానీ ఎందుకు ఇలా మాట్లాడావ్ అంటుంది, అప్పుడు పారిజాతం మాట మారుస్తూ ఏం మాట్లాడాను నువ్ పుట్టినప్పుడు మీ నాన్న నా చేతుల్లో పెట్టాడు దానికి ఏంటి అర్ధం మీ నాన్న నే బాధ్యత నాకు అప్పగించాడనే కదా అప్పటి నుంచి నిన్ను మహారాణి ల చూడాలని ఆశ అంటుంది.