కార్తీక దీపం Serial Today Episode(24/10/2024)

 కార్తీక్ ని దీప ని కలపడానికి సౌర్య ప్రయత్నాలు……                            

                                                                        కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, కార్తీక్ తన రూమ్ లో కూర్చుని వర్క్ చేస్కుంటూ ఉంటాడు, సౌర్య బయట నుంచి దాక్కుని కార్తీక్ ని చూస్తూ కార్తీక్ ఇప్పుడు నాన్న కదా…? నాన్న అంటే పలుకుతాడా అని అనుకుంటూ నాన్నా అని పిలుస్తుంది కార్తీక్ ని, అప్పుడు అది విని కార్తీక్ ఏం పలకకుండా ఆలా ఉంది పోతాడు అప్పుడు కార్తీక్ అంటుంది సౌర్య అప్పుడు కార్తీక్ ఏంటి రౌడీ అంటాడు, అప్పుడు సౌర్య కార్తీక్ అంటే  పలుకుతావ్ నాన్న అంటే పలకవే అంటుంది, అప్పుడు కార్తీక్ ఓ కదా నేను నీకు ఇప్పుడు నాన్న ని అయ్యాను కదా పిలుపు అలవాటు లేక పలకలేదు అని అనుకుంటాడు, అప్పుడు సౌర్య నిన్ను నాన్న అని పిలవాలని ఉంది పిలవచ అంటుంది, అప్పుడు కార్తీక్ పిలవచ్చు పిలువ అంటాడు, అప్పుడు సౌర్య నాన్న అంటుంది, అప్పుడు అప్పుడు కార్తీక్ సౌర్య ని దగ్గరకి తీస్కుని కౌగిలించుకుంటాడు, నిన్ను నాన్న అని పిలిస్తే చాల హ్యాపీ గా ఉంది అంటుంది సౌర్య, నాన్న కి కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్లి ఆడుకుంటావా అంటాడు సరే నాన్న ఏమైనా కావాలంటే చెప్పు అని అంటుంది సౌర్య. అప్పుడు అనసూయ సౌర్య ని పిలిచి కార్తీక్ బాబు నాన్న అంటే నీకు సంతోషం గా ఉందా అంటుంది, అప్పుడు సౌర్య చాల సంతోషం గ ఉంది అంటుంది, అప్పుడు అనసూయ మరి మీ అమ్మ ని కూడా సంతోషం గా ఉంచాలంటే మీ అమ్మ నాన్న ని కలపాలి అంటుంది సౌర్య తో, అప్పుడు సౌర్య ఎలా అని అడుగుతుంది, అప్పుడు కాంచన ఎలా అంటే నాన్న గదిలో అమ్మ వంట గదిలో ఉంది కదా ఇద్దరు పక్కపక్కన ఉంటె ఎంత బాగుంటుంది అంటుంది, అప్పుడు సౌర్య నాకు ఏం చెయ్యాలో తెలుసు అనుకుంటూ కార్తీక్ దగ్గరకి వెళ్లి నాన్న నీకోటి చెప్తా ర నాన్న రా నాన్న అనుకుంటూ చెయ్యి పట్టుకుని  లాక్కుని హాల్ లో సోఫా లో కూర్చోపెట్టి, వంటగదిలో ఉన్న దీప దగ్గరకి వెళ్లి అమ్మ నువ్వు నాతో రా అంటూ దీప ను కూడా చెయ్యి పట్టుకుని హాల్ లోకి తీస్కుని వెళ్తుంది సౌర్య, అప్పుడు దీప ని కార్తీక్ పక్కన కూర్చో మని అడుగుతుంది సౌర్య, బలవంతంగా దీప ని కార్తీక్ ని దగ్గరగా కూర్చో పెడుతుంది సౌర్య యెద్దర్నీ కూర్చో పెట్టి ఫోన్ తీస్కుని నాన్నమ్మ నువ్వు ఫోటో తియ్ అని చెప్పి వాళ్ళ వెనక్కి వెళ్లి ఇద్దరి మీద చెయ్యి వేసి ఫోటో దిగుతుంది సౌర్య, ఆ ఫోటో ని దీప కి చూపించి అమ్మ ఫోటో చాల బాగుంది కదా అని దీప కి కార్తీక్ కి చూపిస్తుంది.

   కాసి, స్వప్న లు దీప, కార్తీక్ లకు శుభాకాంక్షలు చెప్తారు…..

                                                                                             ఈలోగా అక్కడికి కాసి, వాళ్ళ తండ్రి, స్వప్న లు అక్కడికి వస్తారు, జరిగింది విన్నాం సంతోషం గా ఉంది కార్తీక్ నాకు మేనల్లుడు దీప బాబాయ్ అని పిలిచి నాకు ఎప్పుడో కూతురు అయిపొయింది అని అంటాడు కాసి తండ్రి, స్వప్నా కాసి లు వాళ్ళ ఇద్దరికీ కాంగతులేషన్స్ చెప్పి స్వీట్స్ ఇస్తారు కార్తీక్ కి, అప్పుడు దీప కు కూడా ఇవ్వబోతుంటే నాకు పని ఉంది మీరు మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది, అప్పుడు సౌర్య కి కూడా లడ్డు ఇస్తే సౌర్య తీసుకోకుండా అమ్మ కి ఇస్తా అంటూ వెళ్తుంది సౌర్య. అప్పుడు అందరు ఆ పెళ్లి గురుంచి అందరు అంత మంచికే జరిగింది అనుకుంటూ సంతోషం గ చెప్పుకుంటూ ఉంటారు, అప్పుడు సౌర్య వచ్చి అమ్మ అని పిలుస్తుంది, ఏంటి అని కోపం గా అంటుంది దీప, అప్పుడు సూర్య ఎందుకమ్మా అంత కోపం గా మాట్లాడుతున్నావ్ అంటుంది సౌర్య, అప్పుడు దీప మరి ఎదో పనియున్న దానిలా తీసుకెళ్లి కార్తీక్ బాబు పక్కన కుర్చోపెడతావా అంటుంది, అప్పుడు సౌర్య అమ్మ నాన్న లు పక్కపక్కనే కదా కూర్చుంటారు అంటుంది, అప్పుడు దీప అసలు నీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు అంటుంది, అప్పుడు సౌర్య పేరెంట్స్ మీటింగ్ లో అందరు అలానే ఉంటారు అంటుంది, అప్పుడు దీప వాళ్ళు మేము ఒకటి కాదు ముందు నువ్వు ఇక్కడి నుంచి పో అంటుంది, అప్పుడు కార్తీక్ వచ్చి చిన్న పిల్లలకి అర్ధం అయ్యేలా చెప్పాలి కోప్పడకూడదు అంటాడు, అప్పుడు ఆ స్వీట్ తీసుకుంటుంది దీప, అప్పుడు సౌర్య వెళ్ళిపోతుంది, అప్పుడు కార్తీక్ దీప తో ఒకసారి నువ్వు అన్నావ్ కదా ఎన్ని భాదలు ఉన్న ప్రేమ ఉంటె అన్ని మర్చిపోవచ్చు అని అది నువ్వు మా అమ్మ తో అన్న మాటనే, నువ్వు అన్నమాటే నువ్వు ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వాళ్ళ అమ్మ ని చూస్తూ మనసులో నీతో ఒక్కమాట చెప్పకుండా పెళ్లి చేసుకున్న నన్ను ఒక్కమాట కూడా అనలేదు, దీప ని కోడలిగా ఆక్సిప్ట్ చేసావ్ నువ్వు ఇంత మంచిదానివి అమ్మ నీలాంటి దాన్ని మోసం చెయ్యాలని నాన్న కి ఎలా అనిపించింది అమ్మ అనుకుంటాడు కార్తీక్ మనసులో.

జ్యోత్స్నా పెళ్లి గురుంచి అడిగిన సుమిత్ర, దాసరదాలూ…..?

                                                    జ్యోత్స్న కోపం గా కూర్చుని పిచ్చి గీతాలు గీసుకుంటూ ఉండగా, జ్యోత్స్న తల్లి తండ్రులు తన దగ్గరికి వస్తారు, అప్పుడు ఏంటి అంటుంది, నీతో మాట్లాడాలి నీ పెళ్లి గురుంచి అంటారు, అప్పుడు తాను దీప పెళ్లి గురుంచి అంటుంది, అప్పుడు సుమిత్ర కాదు నీ పెళ్లి గురుంచి అంటుంది, అప్పుడు జ్యోత్స్న నాకు ఎప్పుడో బావ తో పెళ్లి అయిపొయింది కదా అంటుంది, అప్పుడు దరసాద్ అదంతా మా తప్పే అమ్మ ఎదిగిన పిల్లలల అభిప్రాయాలూ తెసులుకుని అప్పుడు చెప్పవలసింది, నా చెల్లెలి మాట కాదు అనలేక నేను మాట ఇచ్చాను అంటాడు, అప్పుడు జ్యోత్స్న మీరు మాట ఇచ్చారని నేను మనసు ఇచ్చాను అంటుంది, అప్పుడు సుమిత్ర దానికి కారణం మేమె కాబట్టి మమ్మల్ని క్షమించమని అడగడానికి వాహకం అంటుంది, అప్పుడు జ్యోత్స్న మీరు క్షమించండి అనగానే అయ్యో అదేంటి డాడీ తాళి కట్టింది బావ మీరేం చేస్తారు అంటే వెంటనే మీరు అవును అమ్మ నీ జీవితం ఆగి పోదు కదా నీకో మంచి సంబంధం చూసాం తథా ఫ్రెండ్ విశ్వనాద్ మనవడు మంచోడు నువ్వు ఉ అంటే రేపే పెళ్లి చూపులకి వస్తారు అంటారు అంతేగా అంటుంది జ్యోత్స్న.

Scroll to Top