బావ తప్ప నాకు ఎవ్వరు వద్దని జ్యోత్స్నా తేల్చి చెప్పేసింది…
కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, జ్యోత్స్న ని పెళ్ళికి ఒప్పించడానికి తన తల్లి తండ్రులు ప్రయత్నిస్తున్నారు, కానీ తాను మాత్రం బావ ని తప్ప నా మనసులో ఎవరు లేరు అంటూ కచ్చితంగా తేల్చి చెప్పేస్తుంది, నాకు ఆల్రెడీ బావ తో పెళ్లి అయింది, మీరు మాటలు మార్చినంత తీలిగ్గా నేను మనసును మార్చుకోను, ఆ దీప నాతోనే చెప్పింది నాకు బావ కి పెళ్లి చేస్తానని పైగా దానిది ఎం తప్పులేనట్టు క్షమించమని అడగటానికి ఇంటికి వచ్చింది, పెళ్ళాన్ని ఎక్కడ మాటలు అనేస్తామని బావ గారు పరిగెత్తుకుంటూ వచ్చేసారు, దగ్గరుండి జాగ్రత్తగా దీపని తీసుకెళ్లారు, నరసింహ సినిమా లో రమ్య కృష్ణ లాగ ఏ గోడమీద చుసిన ఎక్కడ చుసిన వాళ్లిద్దరూ నన్ను ఎగతాళిగా చూసినట్టు కనిపిస్తుంది అంటుంది, ఎం చెయ్యాలో ఆలోచించడానికి నాకు కొంచెం టైం పడుతుంది అంటుంది జ్యోత్స్నా.
దీప కార్తీక్ లను కలపడానికి, అనసూయ కాంచనల మరో ప్లాన్…….
కాంచనికి అనసూయ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది, అప్పుడు కాంచన మీరు నాకు ఇలా పని వాళ్ళలాగా సేవలు చెయ్యడం ఇష్టం లేదు మీరు ఈ ఇతని మనుషుల్లా ఉండాలి అంటుంది, అప్పుడు అనసూయా ఈ ఇంటి మనుషులు అని మీరే అన్నారు కదా ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా అంటుంది, అప్పుడు కాంచన అనసూయ ని దీప నే కాదు మీరు కూడా అభిమానంతో కాస్త ఇబ్బంది పేతున్నావు అంటుంది, అప్పుడు అనసూయ పెట్టిపోతల్లో మీరు ఇబ్బంది పడక తప్పదమ్మా, మా దీప కి మీరు చేసిన మేలు తో ఈ జన్మ లో ఋణం తీర్చుకోలేను అంటుంది, అప్పుడు కాంచన అయితే ఋణం తీర్చుకునే మార్గం నీకు ఒకటి చెపుతాను అంటుంది, అప్పుడు అనసూయ ఏంటో చెప్పండి అమ్మ అంటుంది, అప్పుడు కాంచన మనం ఎం అనుకున్నాం ఏదోటి చేసి దీప ని కార్తీక్ ని కలపాలని అనుకున్నాం కదా, ముందు మనం కార్తీక్ దగ్గరకు వెళ్దాం అక్కడ చెప్తాను అంటూ ఇద్దరు కార్తీక్ దగ్గరకి వెళ్తారు.
దీప, కార్తీక్ లతో సత్యన్నారాయణ వ్రతం, దీప ఒప్పుకుంటుందా….?
కాంచన కార్తీక్ తో నువ్వు సౌర్య కోసమే ఈ పెళ్లి చేస్కున్నావని మాకు తెల్సు, కానీ ఎంత కాదనుకున్న మీరిద్దరూ ఇప్పుడు భార్య భర్తలు, నీ గదిలో నువ్వు తన గదిలో తాను ఉంటె ఎలా, పాపకి మీరు ప్రేమ పంచాలంటే ముందు మీ ఇద్దరి మనసులు కలవాలి, పెళ్లి అయినా తర్వాత జరగాల్సినవి కొన్ని జరిపించాలి, అందుకనే మీ ఇద్దరికీ సత్యన్నారాయణ వ్రతం చేయించాలని అనుకుంటున్నాను అంటుంది, అప్పుడు కార్తీక్ అలాగే మమ్మీ మీ ఇష్టం నాకేం అభ్యన్తరం, కానీ దీప ని ఇబ్బంది పెట్టకండి అంటుంది, అప్పుడు కాంచన దీపని ఒప్పించే భాద్యత మాది నీ వర్క్ నువ్వు చేస్కో దీప తో నేను మాట్లాడతాను అంటుంది కాంచన, అప్పుడు కార్తీక్ సరే మమ్మీ అంటాడు.
కాంచన అనసూయలు దీపని ఈ విష్యం గురుంచి అడగటానికి ఒప్పించాలి అని అనుకుంటారు, అప్పుడు అనసూయ దీప ని వ్రతం గురుంచి అడగడానికి వెళ్తుంది, దీప తన తండ్రి ఫోటో పట్టుకుని భాద పడుతూ ఉంటుంది, ఎక్కడ మొదలయిన ప్రయాణం ఎక్కడకి వచ్చి ఆగింది నాన్న, నువ్వు అన్న మాట మన జీవితాలు మనం అనుకున్నట్టు నడవవు అన్న మాట నిజం అయింది నాన్న, భావ కోసమే పుట్టి, బావ నే భర్తగా ఊహించుకున్న జ్యోత్స్నా మేడలో పడాల్సిన తాళి నా మేడలో పడింది నాన్న, ఇందులో నా తపెం లేదు, అలాగని తెంపుకు పోయే దైర్యం లేదు, నేను ఎం చేసిన నా కూతురు కోసమే చేస్తున్నాను, దాని కోసమే భరిస్తున్నాను, కానీ మనసు ప్రశాంతం గా లేదు నాన్న, ఎవరు నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు అన్న భాద ఉంది, నన్ను తల్లిలా చూసుకున్న సుమిత్రమ్మ గారికి ఇచ్చిన మాట ని నిలబెట్టుకోలేక పోయాను నాన్న అంటూ భాద పడుతుండగా, సౌర్య వచ్చి అమ్మ నిద్రొస్తుంది అమ్మ అంటుంది.
దీప ని నాన్న గదిలోనే మనం నిద్ర పోదాం అని పేచీ పెట్టిన సౌర్య…
మనం ముగ్గురం కలిసి పాడుకుందాం అంటుంది దీప తో సౌర్య, అప్పుడు దీప ఆలా పడుకోకూడదు అంటుంది, అప్పుడు సౌర్య నేను ఇక్కడ పడుకొను అని అంటుంది, అప్పుడు దీప ఎప్పుడు మనం ఇద్దరమే కదా పడుకుని కథలు చెప్పుకుంటాం ఆలా కార్తీక్ బాబు రూమ్ లో పడుకోకూడదు కొత్త అలవాట్లు వద్దమ్మా అంటుంది, అప్పుడు సౌర్య నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మ, మా ఫ్రెండ్స్ చెప్తుంటే నాకు ఇలా జరిగితే బాగుండు అని ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను, మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న లతో కల్సి ఒకే గదిలో పడుకుంటారంట, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ డాడీ లు కథలు చేప్తారంటా, నాన్న దగ్గరే పడుకుంటారంట, నేను కూడా అలానే అనుకున్నాను, నాన్న తో కథలు చెప్పించుకుందాం అనుకున్నాను అంటుంది సౌర్య, అప్పుడు అనసూయ వచ్చి అదన్న మాట లో తప్పేం ఉంది, నువ్వు ఎలాంటి దానిలో కార్తీక్ బాబు కి తెసులు, నువ్వే పసిదాన్ని అర్ధం చెస్కోలేకపోతున్నావ్, దీనికి ఊహ తేసులైనప్పటి నుంచి తన నాన్న కోసం ఎన్నో కళలు కంది, దీని ముద్దు ముచ్చట తీర్చడం కోసం తల్లి గ నీ బాధ్యతో, ఈ వయసులో నువ్వు నీ తండ్రి గుండెల మీద పడుకునే దానివి, మరి నీ కూతురికి ఎందుకె దూరం చేస్తున్నావ్, మలినం లేని మనసు ఎక్కడ ఉన్న పవిత్రం గానే ఉంటుంది, నీ కూతురికి కార్తీక్ బాబు నాన్న, తల్లిగా దాని ఇష్టాన్ని తీర్చు అంటుంది.
అప్పుడు సౌర్య దీప ని చేయిపట్టుకుని రా అమ్మ అంటూ కార్తీక్ రూమ్ కి తీసుకెళ్తుంది, అప్పుడు దీప వ్రతం గురుంచి మాట్లాడటానికి వచ్చిందేమో అనుకుని కార్తీక్ దీప ని లోపలి రండి, నాతో ఏమైనా మాట్లాడాలా అంటుంది , అప్పుడు సౌర్య రమ్మని తీసుకొచ్చింది మాట్లాడటానికి కాదు నాన్న మన ముగ్గురం ఒకే గదిలో పడుకోడానికి అంటుంది, నేను పిలిస్తే అమ్మ రాను అంది, నానమ్మ చెప్తే వచ్చింది, నువ్వు చెప్పుడు నాన్న నువ్వు చిన్నప్పుడు అమ్మ నాన్న ల దగ్గర పడుకున్నావా, అమ్మ కూడా పడుకుంది అంటుంది, నువ్వు చెప్పు నాన్న నేను కూడా పడుకోవాలా లేదా అంటుంది, అప్పుడు కార్తీక్ పాడుకోవాలి అంటాడు, అప్పుడు సౌర్య చూసావా అమ్మ నాన్న నేను చెప్పినట్టే విన్నాడు ఇప్పుడు నేను చేపినట్టే మీరు వినాలి మీ ఇద్దరి మధ్యలో నేను పడుకుంటాను అంటుంది సౌర్య, కార్తీక్ దీప తో మీ ఇబ్బంది నేను అర్ధం చేసుకోగలను కనీసం సౌర్య నిద్రపోయే వరకు అయినా తనకి ఇష్టం వచ్చినట్టు పడుకుందాం అంటాడు, దీప చేతిని పట్టుకుని వాళ్ళ ఇద్దరి మధ్యలో సౌర్య పడుకుంటుంది.