కార్తీక దీపం Serial Today Episode(26/10/2024)

కార్తీక్ సౌర్య తో దీప కథ ని చెప్పి నిరపుర్చుతాడు…..

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, సౌర్య దీప ను ఒప్పించి బలవంతంగా కార్తీక్ రూమ్ లో నిద్రపోడానికి తీసుకెళ్తుంది, సౌర్య కార్తీక్ దీప లకు మధ్యలో పడుకుంటుంది, సౌర్య నాకు ఇప్పుడు చాల హ్యాపీ గ ఉంది కార్తీక్ అంటూ ఇద్దరి చేతుల్ని పట్టుకుని తన పై పెట్టుకుంటుంది, అప్పుడు కార్తీక్ ని నాన్న నేను పడుకోవాలంటే నువ్వు కథ చెప్పు నాన్న అంటుంది, అప్పుడు కార్తీక్ దీప స్టోరి నే సొంత మాటల్లో కథల చెప్తుంటాడు, సౌర్య అప్పుడు బలే బలే చాల బాగుంది అంటూ నాన్న ఇంకో కథ చెప్పవ అంటుంది, అప్పుడు కార్తీక్ ఇంకో కథ చెప్పి సౌర్య ని నిద్రపోయేలా చేస్తాడు, అప్పుడు దీప లేచి వెళ్ళిపోతుంది.

సత్యన్నారాయణ స్వామి వ్రతానికి అనసూయతో నిరాకరించిన దీప…

అప్పుడు అనసూయ చూసి న మాట కాదు అనలేక వెళ్ళావ్ గాని నీకు ఇష్టం లేదని నాకు తెల్సు, కానీ నువ్వు జీర్ణించుకోలేక పోతున్నావ్, కార్తీక్ బాబు తో నీకు పెళ్లి అయింది, నీ భర్త ఇది కూడా నిజం, ఒక భార్య గా భర్త తో ఎలా ఉండాలో ఆలా ఉండు, ఇది అనుకోని పెళ్లి, కానీ జరిగింది నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ మనసులో నర్సింహా ఉన్నదా లేదు కానీ, తండ్రి ఇష్టం తో తల వంచుకుని తాళి కట్టించుకున్నావ్, భార్యగా నీ దర్మం నువ్వు నువ్వు చేసావ్ కానీ ఆ వెధవ నిలబెట్టుకోలేక పోయాడు, ఆ భగవంతుడు మరొక అవకాశం ఇచ్చాడు, ఇది నీ కూతురి కోసమే అనుకోకు ఈ బంధం నీ కోసం కూడా, నీ కూతురు కోసమే అని నువ్వు అనుకుంటే కార్తీక్ బాబు కి అన్యాయం చేసిన దానివి అవుతునావ్, ఆలా అని కార్తీక్ బాబు కి అసలు లేకుండా ఉంటాయా అతనికి కూడా అసలు కూడా ఉంటాయి, మా అమ్మ మా నాన్న తో ఉన్నట్టే నా భార్య కూడా నాతో ఉండాలి అని ప్రతి

భర్త అనుకుంటాడు, అలానే మా అమ్మ మా నాన్న తో ఉన్నట్టే నేను నా భర్త తో ఉండాలని ప్రతి భార్య అనుకోవాలి, భర్త కె కాదు, అతని తల్లికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి, అలానే మీ అత్తగారికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయ్, పెళ్లి అయినా తన కొడుకు కోడలితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని ఆశ పడుతున్నారు కార్తీక్ బాబు ఎలాంటి అభ్యన్తరం లేదు, నువ్వు సరే అంటే వెళ్లి కాంచనమ్మ గారితో చెప్తాను అంటుంది అనసూయ, అప్పుడు దీప వద్దు అత్తయ్య నువ్వు ఎన్ని చెప్పిన ఈ పెళ్లి ఆ విధం గా నేను తీసుకోలేను అంటుంది, అప్పుడు అనసూయ ఇలా ఎన్నాళ్ళు ఉంటావే, అందమైన జీవితాన్ని ముక్కలు చేసుకోకు అంటుంది, అప్పుడు దీప నా కూతురు కోసం ఈ తాళి నా మెడలోని ఉంటుంది అత్తయ్య, అంతేగాని ఇవన్నీ వద్దు అంటుంది, అప్పుడు అనసూయ వద్దు అన్న కోడలిగా కార్తీక్ బాబు భార్య గా నువ్వు సరే అనాలి, లేదంటే మీ అత్తగారి నిన్ను అడుగుతారు అంటుంది, అప్పుడు దీప అడగనివ్వండి అత్తయ్య ఆవిడతోనే నేను చెప్తాను ఇది జరగదని అంటుంది, అప్పుడు అనసూయ  దీప సమాధానం చెప్పే ముందు ఒకసారి ఆలోచించావే అంటుంది.

జ్యోత్స్న కోసం ఇచ్చిన ప్రసాదాన్ని దీప కి ఇచ్చిన సుమిత్ర…..

దీప గుడికి వెళ్తుంది ఒకచోట కూర్చుని బడా పడుతూ కూర్చుంటుంది, అదే గుడికి సుమిత్ర కూడా వస్తుంది, సుమిత్ర జ్యోత్స్న పేరు మీద అర్చన చేయించి, పూజారి జ్యోత్స్న కోసం ప్రసాదం గా ప్ఫలం ఇస్తాడు, అది తీస్కుని వస్తుంటే జారీ దీప దగ్గరికి వెళ్తుంది, సుమిత్ర కింద పడిన ప్రసాదం కోసం చూసే సరికి అది దీప చేత్తో పట్టుకునే సరికి దీపని చూసి దీప అంటుంది, ఆ పండు ని దీప సుమిత్ర కి ఇస్తుంది, అప్పుడు సుమిత్ర పెళ్లి అయినా దాదానివి వంటరిగా గుడికి వచ్చావే అంటుంది, అప్పుడు దీప నన్ను చూసి మొకం తిప్పుకుని వెళ్ళిపోతారు అనుకున్న అమ్మ అంటుంది, అప్పుడు సుమిత్ర జరిగింది మారదు కదా అంటుంది, అప్పుడు దీప నేను తప్పు చేశానన్న కోపం అయితే ఉంటుంది కదా నేను అవకాశవాదిని కాదు అమ్మ, కానీ జ్యోత్స్న కి అన్యాయం చేశాను అంటుంది నేను కావాలనే ఈ తప్పు చేసానని అనుకుంటున్నారా అంటుంది, అప్పుడు సుమిత్ర నీకు అయితే న్యాయం జరిగింది, భగవంతుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడు, తప్పు జరగలేదు పెళ్లి జరిగింది బగవంతుడు మీ ఇద్దరికీ రాసి పెట్టాడు, అందుకే నా కూతురు మేడలో పడాల్సిన తాళి నీ మేడలో పడింది , నా భాద అంత నా కూతురు కోసమే, అది బావ ని ఎం,అర్చిపోడు ఇంకా పెళ్లి చేస్కోడు ఆ భాద అంత మర్చిపోడానికి కొంత టైం పడుతుందని నాకు తెల్సు, కానీ తల్లి మనసు కదా బిడ్డ భాదని చూడలేదు, సరే ఇంతకు నువ్వెలా ఉన్నావ్ నువ్వేదో భాదగా ఉన్నవని నీ మొహమే చెప్తుంది అంటుంది, అప్పుడు దీప ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి కి ఇంకెలా ఉండాలమ్మ ఇది న జీవితం లోకి రావాలని నేను కోరుకోలేదు అంటుంది, అప్పుడు సుమిత్ర కార్తీక్ ని నీ భర్త గా ఒప్పుకోలేదు అంటుంది, అప్పుడు దీప మీరయినా నా మనసును అర్ధం చేస్కోండి అమ్మ నేను నా కూతురు కోసమే భ్రాతుకుతున్నాను ఇదిగో ఈ తాళి నా మెడలో పడింది కూడా అదే సౌర్య కోసం, నా మేడలో తాళి కట్టి కార్తీక్ బాబు నా కూతురికి తండ్రి అయ్యాడు కానీ నేను భర్తగా ఎలా అనుకోగలను అమ్మ అంటుంది ], అప్పుడు సుమిత్ర చూడు దీప నువ్వు అనుకున్న అనుకోకపోయిన కార్తీక్ ఇప్పుడు నీ భర్త, తాళి ఎలా పడింది అని అనవసరం, నేను నిన్ను నమ్ముతున్న లేదా నాయి అనవసరం,పెళ్లి అయితే జరిగింది దీన్ని ఎవరు మార్చలేరు , నేను అదే చెప్తాను అలాగని నువ్వు చేసిన పని నను అందడం అని చెప్పలేను, అందరాని లాగా నేను నిన్ను తిట్టలేను, ఒకప్పుడు నేనే అన్నాను దీప నువ్వు నా కూతురివి అని, నా మేనల్లుడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నా సంకల్పం డాన్ని మరో రకం గా నువ్వు నిజం చేసావ్ అని జ్యోత్స్న కోసం ఇచ్చిన ప్రసాదాన్ని ఇప్పుడు నీకే ఎక్కువ అవసరం అని దీప కి ఇస్తుంది సుమిత్ర.

Scroll to Top