దీప ని కార్తీక్ వ్రతానికి ఒప్పించి నీకు ఇష్టం లేకపోతే వ్రతం ఆపేస్తాను అంటాడు………….
కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, దీప కార్తీక్ తో నాకు వ్రతం చేస్కోవడం ఇష్టం లేదని నాకు సాయం చేయండి అని అడుగుతుంది, అప్పుడు కార్తీక్ సరే అని చెప్పి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు నువ్వు నాకు బ్లడ్ ఇచ్చావ్ ఒకవేళ నువ్వు ఇవ్వకుండా పోయననుకో నువ్వేం చేస్తావ్ అంటాడు, అప్పుడు దీప బ్రతికినంత కాలం నవల్లనే అని ఏడ్చేదాన్ని బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ నరసింహ నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నేను అడ్డురాలేదు ఆ కత్తి నీకే దిగేది నువ్వు పోయవనుకో అప్పుడు ఎం జరుగుతుంది అంటాడు, అప్పుడు దీప సౌర్య అనాధ అయ్యేది అంటుంది, అప్పుడు కార్తీక్ ఇప్పుడు నిజం చెప్పు అంటాడు, అప్పుడు దీప మీ దగ్గరే పెరిగేది అంటుంది, అప్పుడు కార్తీక్ సౌర్య కి నువ్వు నేను తప్ప ఎవ్వరు లేరు నేను ఏం చేసిన సౌర్య గురుంచే, దాని మొహం లో నేను ఆనందం చూడాలి, దాని గురుంచే నీ మేడలో తాళి ఖాతాను, నన్ను అది నాన్న గా ఉంటావా అని అడిగింది ఉండాలని అనిపించింది, నీకు శ్రేయోభిలాషగా సౌర్య కి తండ్రి లా ఉండాలంటే ఆ క్షణం నాకు తాళి తప్ప మరేం దారి కనిపించలేదు, మీ నాన్న చనిపోతూ దీప దీప అంటూ మీ భాద్యత ని నా చేతుల్లో పెట్టి చనిపోయారు అని అంటుండగా సౌర్య వహ్న్స్తుంది, సౌర్య కార్తీక్ తో నాన్న ఈ పట్టు పరికిణి ఎలా ఉంది చెప్పు అంటుంది, అప్పుడు కార్తీక్ బంగారు బుట్ట మొబ్బా లా ఉన్నవ్ అంటూ ముద్దు పెట్టుకుంటాడు, అనసూయ దీప అన్ని ఆ గదిలో పెట్టాను తయారవ్వు అంటుంది, కార్తీక్ దీప తో నువ్వు అందర్నీ మర్చిపోయి నీ కూతురు కోసం ఆలోచించు మా అమ్మ కి నువ్వు మాట ఇచ్చావ్ నువ్వు మాట తప్పవు నాకు నమ్మకం ఉంది, నేను బయట ఎదురుచూస్తాను వ్రతం చీరలో వస్తే ఓకే, లేకపోతే నేనే నీ శ్రేయోభిలాష గా ఈ వ్రతామ్ ఆపేస్తాను అంటాడు.
దీప వస్తుందా రాదా అని ఇంట్లో వాళ్లంతా భయం తో ఎదురుచూస్తూ ఉంటారు, ఈ లోగ దీప….
అనసూయ కాంచనలు కార్ లో ఎదురుచూస్తూ ఉంటారు, కార్తీక్ సౌర్య హాల్ లో దీప కోసం ఎదురు చూస్తూ ఉండగా దీప వ్రతం చీర కట్టుకుని వస్తుంది, అప్పుడు సౌర్య ఈ చీర నీకు చాలా బాగుంది అమ్మ కదా నాన్న అంటుంది, అప్పుడు కార్తీక్ అవును మీ ఇద్దరికీ దిష్టి తియ్యాలి అంటాడు, కాంచన అనసూయలు దీప ఇంకా రాకపోయే సరికి దీప మనసు మార్చుకుందేమో అనుకుంటూ ఉండగా దీప కార్తీక్ సౌర్య లు బయటకు వస్తారు, అప్పుడు వాళ్లిద్దరూ దీప ని చూసి సంతోష పడి దీప ఈ చీరలో ఎంత అందంగా ఉందొ అనుకుంటారు, అప్పుడు దీప ని కార్తీక్ పక్కన కుర్చోపెట్టాలని వెనుక ముగ్గురికి సరిపోదు నువ్వు ముందు కూర్చో అని సౌర్య ని వాళ్ళిద్దరి మధ్య కుర్చోపెట్టుకుంటారు కాంచన అనసూయా లు, అప్పుడు దీప ముందు సీట్ లో కార్తీక్ పక్కన కూర్చుంటుంది, అప్పుడు కార్తీక్ దీప ని సీట్ బెల్ట్ పెట్టుకోమంటాడు, దీప కి రాకపోవడం తో కార్తీక్ దీప సీట్ బెల్ట్ పెడతాడు, ఆలా వ్రతం కోసం అందరు కార్ లో గుడికి బయల్దేరాతారు.
ఉంటె నేనైనా ఉండలు లేక ఆ దీప అయినా ఉండాలి అంటూ గుడికి బయల్దేరిన జ్యోత్స్న…..
పారిజాతం జ్యోత్స్న తో దీప కి మీ భావ కి గుడిలో సత్యన్నారాయణ వ్రతం చేస్తున్నారు, ఈ వ్రతం చేస్తే ఇంకా వాళ్లిద్దరూ నిజం గానే భార్య భర్తలని అందరికీ ప్రకటించినట్టే అంటుంది, అప్పుడు జ్యోత్స్న అదేంటి మరి ఈ వ్రతానికి ఆ దీప ఎలా ఒప్పుకుంది మరి ఆ రోజు ఇంటికి వచ్చి ఓవర్ ఆక్షన్ చేసింది, ఆ వంట మనిషిని పక్కన పెట్టుకుని బావ ఈ వ్రతం ఎలా చేయించుకుంటాడో నేను చూస్తాను, ఇది నాకు బావ కి దీప కి జరుగుతున్న పోరాటం ఉంటె నేనైనా ఉండాలి ఆ దీప అయినా ఉండాలి అంటూ వెళ్తుండగా పారిజాతం వద్దు నువ్వు అక్కడికి వెళ్లొద్దు అంటుంది, అప్పుడు జ్యోత్స్న ఇది నా విషయమ నువ్వు అడ్డురాకు అంటూ ఎంత ఆపిన ఆగకుండా పారిజాతాన్ని పక్కకి నెట్టేసి కోపం గా కార్ వెళ్ళిపోతుంది, అప్పుడు ఇంట్లో వాళ్లంతా పారిజాతం కేకలకు బయటకు వచ్చి ఎం అయింది జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుంది అంటారు, అప్పుడు పారిజాతం జరిగింది అంత చెప్తుంది, అప్పుడు జ్యోత్స్న తాతయ్య దశరథ ఇప్పటికి జరిగింది చాలదు అన్నట్టు మల్లి ఎందుకు అక్కడికి వెళ్లడం అక్కడ నా మనవరాలిని ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు చెప్తా అని చెప్పి అందరు కార్ లో గుడికి బయల్దేరతారు.
దీప నుదిటి పైన బొట్టు పెట్టి కంకణాలు కట్టుకుని కార్తీక్ దీప ని తన భార్య గా చేసుకున్నాడు….
వ్రతానికి అందరు వచ్చేస్తారు, పంతులుగారు అమ్మ మీ దంపతులు ఇద్దరు వచ్చి పీటల మీద కూర్చోండి అంటారు, పంతులుగారు అంత మంచి జరగాలని మనఃస్ఫూర్తిగా అనుకుని దీపం వెలిగించమంటారు, అప్పుడు దీప కార్తీక్ ఇద్దరు కలిసి దీపమ్ వెలిగిస్తారు, కార్తీక్ పంతులుగారు మీరు బొట్టు పెట్టుకుని అమ్మాయి కి కూడా బొట్టు పెట్టి కంకణాలు కట్టుకోండి అంటారు, అప్పుడు కార్తీక్ బొట్టుపెట్టుకుని దీప నుదిటి ఫై బొట్టు పెడతాడు, తర్వాత ఒకరికి ఒకరు కంకణాలు కట్టుకుంటారు కాంచన అనసూయ లు ఇదంతా చూసి సొంతోషిస్తారు, వ్రతం జరుగుతుండగా దీప కాంచన వైపు చూస్తుంది, అప్పుడు అనసూయ కాంచనతో దీప ఏంటి మీ వంక ఆలా చూస్తుంది అంటుంది, అప్పుడు కాంచన ఇచ్చిన మాట ప్రకారం వ్రతం మొదలవుతుంది మావయ్యగారు ఇంకా రాలేదేంటి అని చూపుల్తోనే నా కోడలు నన్ను అడుగుతుంది అంటుంది, ఈయన ఇంకా రాలేదు ఏంటి వస్తారు అంటావా అనుకుంటూ ఉంటారు.