గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. రాజీవ్ వసుధారా మెడలో తాళి కట్టడానికి రెడీ అయ్యాడు అప్పుడు వసుధారా మెడలో రిషి కట్టిన తాళి చూసి ఈ తాళి తీసేసి అప్పుడు నేను కడతాను అంటాడు ఆ తాళి ని తియ్యడానికి వసుధారా దగ్గరకి వస్తాడు రాజీవ్ వసుధారా వద్దు బావ అంటూ బ్రతిమిలాడుతుంది, కానీ రాజీవ్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చింది అంటూ తాళి చేతితో తెంపడం మహా పాపం కదా అంటూ బయ్యా ఆ గన్ ఇవ్వు అంటాడు రాజీవ్ శైలేంద్ర ని, ఆ గన్ తీస్కుని వసుధారా మెడలో తాళిని తెంపడానికి ట్రై చేస్తుంటాడు అప్పుడు శైలేంద్ర వసుధారాలు వద్దు అంటుంటారు కానీ రాజీవ్ వాళ్ళ మాటలు వినడు ఈ లోగ మహేంద్ర వాళ్ళ దగ్గరకి వచ్చి కర్ర పట్టుకుని రాజీవ్ నెత్తి మీద కొడతాడు అప్పుడు రాజీవ్ కింద పడిపోతాడు, అప్పుడు వసుధారా కట్లు ఇప్పుతారు అప్పుడు శైలేంద్ర మేము ఇక్కడికి వస్తాం అని నాకే తెలీదు మీకెలా తెల్సు బాబాయ్ అంటాడు శైలేంద్ర అప్పుడు వసుధారా తన చేతిలో ఉన్న GPS ని చూపిస్తుంది , అప్పుడు రాజీవ్ లేచి మహేంద్ర కి గన్ పెట్టి బెదిరిస్తాడు, ఈ పెళ్లి ని ఆపాలని చూస్తే నిన్ను కాల్చేస్తాను అంటాడు రాజీవ్, అప్పుడు శైలేంద్ర ఇందులో బుల్లెట్స్ లేవు కదా అంటాడు, అప్పుడు రాజీవ్ ఇందాక లేవు బయ్యా ఇప్పుడు రెండు ఉన్నాయ్ అంటాడు రాజీవ్ అప్పుడు శైలేంద్ర జోక్ చేస్తున్నావ్ అంటాడు అప్పుడు రాజీవ్ ఏంటి బయ్యా నేను జోక్ చేస్తున్నానా నేను నీకంటే విల్లన్ ని ఆంటూ ఆ గన్ తో పక్కకి పేలుస్తాడు రాజీవ్, మల్లి మహేంద్ర కి గన్ పెడతాడు రాజీవ్ అప్పుడు మహేంద్ర రాజీవ్ చేతుల్లో ఉన్న గన్ ని లాక్కుని రాజీవ్ కి షూట్ పెడతాడు మహేంద్ర, రాజీవ్ ని మహేంద్ర రేయ్ రాజీవ్ నువ్ ఇన్నాళ్లు నా కొడుకుని చూసావ్ నా కొడుకే డేంజర్ అనుకుంటే నేను వాడి అబ్బా ను రా నేను ఎంత డేంజరస్ గా ఉంటాడు అంటాడు, రాజీవ్ నేను అనుకుంటే నిన్ను ఇప్పుడే కాల్చేయొచ్చు కానీ నేను నీలాగా దుర్మార్గుడిని కాదు అంటూ బయట ఉన్న పోలీస్లను పిలిచి రజ్జేవ్ ని అప్పగిస్తాడు మహేంద్ర.
శైలేంద్ర ఇంటికి వచ్చి దేవయాని తో మామ్ రాజీవ్ బ్రతికే ఉన్నాడు అంటాడు, ఇప్పుడే పోలీస్ లు తీసుకెళ్లారు అంటాడు, అప్పుడు దేవయాని అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావ్ నా చెవులకు వినసంపుగా ఉంది అంటుంది దేవయాని, అప్పుడు ధరణి అత్తయ్య నాకో డౌట్ ఆ రాజీవ్ బ్రతికి ఉంటె మీకెందుకు సంతోషం గా ఉంది అలాంటి వాడి గురుంచి తెలిసాక చీదరించుకోకుండా సంతోషపడతారేంటి అంటుంది ధరణి, అప్పుడు శైలేంద్ర కవర్ చెయ్యడానికి అదే ధరణి, వాడు బ్రతికి ఉన్నాడంటే మనూ ఏ తప్పు చెయ్యలేదు అనే కదా అంటాడు ధరణి తో, అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న మనూ బయటకు వస్తాడు కదా అంటాడు. ముందు నేను చెప్పేది వినండి అంటాడు శైలేంద్ర నాకు రేపు కాలాగే లో ఒక మంచి జరగబోతుంది మీరు ఇద్దరు కాలాగే కి రండి అంటాడు, ధరణి ని కూడా రమ్మంటాడు అప్పుడు ధరణి నేను రాను అంది అంటుంది అప్పుడు శైలేంద్ర ఎందుకు రావు ఏం ప్రాబ్లెమ్ అంటాడు, అప్పుడు మీకు కాలాగే లో మంచి జరుగుతుంది అన్నారు కదా నేను వస్తే మీకు మంచి జరగదు మీరే వచ్చి ఏం మంచి జరగుతుంది చెప్పండి అని లోపలి వెళ్ళిపోతుంది ధరణి. దేవయాని శైలేంద్ర తో ఇదంతా చేసింది నువ్వేనా అంటుంది, నాకేదో అనుమానం గ ఉంది నిజం చెప్పు అంటుంది శైలేంద్ర ని, అప్పుడు లేదు మామ్ అంటాడు శైలేంద్ర, అప్పుడు దేవయాని షిల్డ్రా ఆ రాజీవ్ ని ఎవరు పోలీస్ లకు పట్టించారో గాని వాడిని కచ్చితం గ రాజీవ్ చంపేస్తాడు వాడి గురుంచి నాకు బాగా తెల్సు కట్టుకున్న పెళ్ళాన్ని చంపేశాడు ఇంకా వాడిని పట్టించిన వాడిని వదులుతాడా అంటుంది దేవయాని. మహేంద్ర వసుధారా ని మనూ ని తీస్కుని ఇంటికి వస్తాడు, అప్పుడు వసుధారా మేడం మేము చెప్పినట్టే మీ అబ్బయ్ ఏ నేరం చెయ్యలేదు అని నిరూపించాం మీ దగ్గరకి తీస్కొచం అంటుంది, మీరు మీ అబ్బాయి తో మాట్లాడండి అంటుంది కానీ అనుపమ ఏం మాట్లాడదు, అప్పుడు మహేంద్ర ఏంటి అనుపమ ఇన్ని రోజులు మనూ గురుంచి ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఎదురుగా వస్తే మాట్లాడావ్ అనుపమ అంటాడు మహేంద్ర, అప్పుడు మనూ ఆవిడా మాట్లాడక పోయిన ఆవిడా ప్రేమ కోపం అన్ని తెల్సుతాయి ఒకేఒక్క సమాధానం తప్ప అంటాడు మనూ.