చవక ధరకే దొరికే ఔషధం వంటి ఆహారం… !
ఇటీవల కాలం లో టీవీ లలోను ఫోన్ ల లోను రకరకాల పండ్లు కొత్త కొత్త రకాల బ్రీడ్ పండ్లు చూస్తున్న సంగతి తెల్సిందే. ఇదివరకు కాలం లో సీసనల్ పళ్ళు మాత్రమే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు సీసన్ తో పని లేకుండా ఎలాంటి రకమైన పండ్లు అయినా మర్కెట్స్ లో దొరుకుతున్నాయి. మాములుగా అందరి దృష్టిలో ఏ పండ్లు అయితే ఎక్కువ ధర ఉంటాయో అవే ఆరోగ్యానికి మంచిది అన్నట్టు ప్రచారం చేస్తున్నారు, విదేశాలలో పాండిచేతు వంటి కొత్తరకం పండ్లను ఇప్పుడు మర్కెట్స్ లో ఎక్కువగానే చూస్తున్నాం. ఒకప్పుడు మనం ఎప్పుడు చూడని వినని కొత్తరకం పండ్లు పేర్లు వింటున్నాం, అవి తింటే ఎలాంటి రోగాలు తగ్గుతాయి అన్నది ప్రచారం చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఇలాంటి రకాల పండ్లు లేకపోయినా ఆరోగ్యం గానే ఉండేవాళ్ళు. మనకు అందుబాటులో ఉన్న పండ్లు, ఏ సీసన్ లో వచ్చే ఆ సీసన్ పండ్లు తీసుకుంటే సరిపోతుంది. తక్కువ ధరకే ఎక్కువ పోషకాలు ఇచ్చే పండు ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వలసిందే. అదేంటో కాదు జామకాయ…! చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉండేవి, కొని తినవలసిన అవసరం ఉండేది కాదు, అప్పట్లో అన్ని రోగాలు కూడా ఎప్పుడున్నట్టుగా ఉండేవి కాదు, మరియు ఎరువులు ఏమి వాడకుండానే జామకాయలు బాగా కాసేవి. అలంటి జమ కాయల్లో ఉండే పోషక విలువలేంటో మనం తెల్సుకుందాం.
ఉపయోగాలు : జామకాయల్లో విటమిన్ ఏ, బి , సి , కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ , పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. అంతే కాదు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తినాల్సిన పండు జామకాయ. జామకాయ రోగనిదొక శక్తిని పెంచడం లో చాల సహాయపడుతుంది. ఇంకా ఉదర సమస్యలకు దివ్య ఔషధం అని పేర్కొనబడింది, మనం తీసుకునే ఆహారం లో పోషకాలను సరిగా సవీకరించడం లో సహాయపడుతుంది మరియు ఎక్కువ పీచు, సోడియం, పొటాషియం నిల్వలను సమన్వయము పరచి రక్త పోటును అదుపులో ఉంచుతుంది. అంతే కాదు శరీరం లో కొవ్వుని కూడా తగ్గిస్తుంది. పీసీఓడీ సమస్యలతో బడా పడే ఆడవాళ్లు ఈ జామకాయలు తీసుకుంటే చాల బాగా పనిచేస్తుంది. అంతే కాదు గర్భిణీలకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందడం తో పాటు, సంతానోత్పత్తి పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. బరువు కంట్రోల్ అవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు జామకాయ తీసుకుంటే చాల మంచిది. జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు కాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేస్తుంది. అంతే కాదు జమ ఆకులను నమిలితే పంటి వ్యాధులు కూడా దూరం అవుతాయి. జామకాయ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే దగ్గు జలుబు నయం అవుతాయి. జామకాయ తినడం వలన ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది, మలబద్దకం తగ్గుతుంది. జామకాయ వలన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు , రక్తపోటును నియంత్రించడం తో పాటు, గుండె సమస్యలను కూడా మెరుగుతీస్తుంది. ఇంకా జామకాయ తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రోజువారీ ఆహారం లో జామకాయ ని కూడా చేర్చితే ఆరోగ్యం గా ఉంటారని నిపుణులు చెపుతున్నారు.