తెలంగాణ పంచాయితీరాజ్ సేకమంత్రి సీతక్క తెలంగాణ మహిళలలకు ఒక శుభవార్తను వెల్లడించారు, తెలంగాణా మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేయనుంది, అయితే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదించారు. సోలార్ ప్లాంట్లను కేటాయిస్తే భూములను గుర్తించి మహిళా సంఘాలకు లీజుకు ఇస్తామని ఇంధన శాఖ కార్యదర్శికి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
అయితే ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ కు మూడు కోట్లు ఖర్చు అవుతాయని అంచన వేశారు, ఇందులో 10% మహిళా సంఘాలు భరిస్తే, మిగిలిన 90% బ్యాంకు రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఒక మెగావాట్ ఉత్పత్తిపై ఏటా 30 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్ల కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించడాం జరిగింది. అయితే నాలుగేళ్లలో స్వయం సహాయక సంఘాలకు 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన భూములను గుర్తించడంతో పాటు, రుణ సమీకరణ కోసం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క తెలియజేసారు.