తెలంగాణ లో మరో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం తలపెట్టనున్నన్నారు, వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం దిశగా మరో ముందడుగు పడడం జరిగింది, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జిఓ విడుదల చేసింది, ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూమి సేకరణకు 205 కోట్లు విడుదల చేయడం జరిగింది, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది.
మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 km ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకుంది, ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 696 ఎకరాలభూమి ఉండగా, అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాలకు కోసం నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ వెల్లడించింది. మరోవైపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది, స్టేషన్ గన్పూర్ లో ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతుందని రోడ్లు భవనాల శాఖ పేర్కొంది పేర్కోవడం జరిగింది.