ఈ రోజుల్లో ప్రజలు ఆయుర్వేదానికి ఎక్కువగా ప్రిఫెరెన్సు ఇస్తున్నారు, సోషల్ మీడియా లో కూడా నాచురల్ ఫుడ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు, ఆరోగ్యం మీద ఎంత గానో ద్రుష్టి పెడుతున్నారు, అదేవిధం గా నేడు, అనేక వైద్య శాస్త్ర పరిశోధనల్లో తేనె ప్రయోజనాలపై వైద్య లోకం ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ మన పూర్వీకులు ఏనాడో పరిశోధనలు చేసి, తేనె వల్ల అనేక ప్రయోజనాల ఉన్నాయని నిర్థారించారు. అలాగే ఆహార పదార్థాలలో ఎక్కువ కాలమ్ నిలువ ఉండేది తేనె, ఈ విషయాలలో కొన్నింటిని ఒకసారి చూద్దాం.
అనేక వ్యాధులను, గాయాలను నయం చేయడంలో తేనె బాగా పనిచేస్తుంది. గాయాలను మాన్పడంలో కూడా తేనె బాగా పనిచేస్తుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ దెబ్బను మాన్పడంలో కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కాలిన గాయాల మీద తేనె రాస్తే త్వరగా తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది. యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్, తేనె అనేది సహజంగా లభించే చక్కెర రూపం. కొంతమంది వేడి టీలో కొద్దిగా తేనె కూడా కలుపుతారు. తేనె రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. తేనె ముఖ్యంగా పిల్లల్లో దగ్గును తగ్గిస్తుంది. తేనెలో పసుపు, అల్లం రసం కలిపి రోజుకు మూడుసార్లు తీసుకుంటే పిల్లల్లో, పెద్దల్లో దగ్గు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది బ్రోన్కైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. ఇంతకు ముందు తేనెను ఒక ఔషధ మూలికగా ‘సుమేరియన్ మట్టి మాత్రలలో’ సుమారు 4000 సంవత్సరాలుగా ఉపయోగించారు. దాదాపు 30% సుమేరియన్ల వైద్య చికిత్సలో తేనె కలిసి వుంటుంది. భారత దేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలైన సిద్ధ, ఆయుర్వేదంలో తేనె ప్రధాన మూలికగా ఉపయోగపడుతోంది. పురాతన ఈజిప్ట్ నాగరికతలో, తేనెను చర్మ సంరక్షణకు, నేత్ర సంబంధ వ్యాధుల నివారణకు, అలాగే గాయాలను, కాలిన గాయాలను సహజంగా నయం చేసే మూలికగా ప్రసిద్ది పొందింది. ఇంతకు ముందు తేనెను ఒక ఔషధ మూలికగా ‘సుమేరియన్ మట్టి మాత్రలలో’ సుమారు 4000 సంవత్సరాలుగా ఉపయోగించారు. దాదాపు 30% సుమేరియన్ల వైద్య చికిత్సలో తేనె కలిసి వుంటుంది.
భారత దేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలైన సిద్ధ, ఆయుర్వేదంలో తేనె ప్రధాన మూలికగా ఉపయోగపడుతోంది. పురాతన ఈజిప్ట్ నాగరికతలో, తేనెను చర్మ సంరక్షణకు, నేత్ర సంబంధ వ్యాధుల నివారణకు, అలాగే గాయాలను, కాలిన గాయాలను సహజంగా నయం చేసే మూలికగా ప్రసిద్ది పొందింది.తేనె వాడకం వల్ల కిమోథెరపి రోగులలో తక్కువగా వున్న తెల్ల రక్త కణాల సంఖ్యను నియంత్రిస్తాయని మరికొన్ని ప్రాథమిక ఆధారాల వల్ల రుజువైంది. చిన్న పాటి ప్రయోగాలలో, కిమోథెరపిలో భాగంగా 40% మంది రోగులు రోజుకు రెండు చెంచాల తేనెను తీసుకోవడం వల్ల ప్రమాదకర స్థాయిలో తక్కువగా ఉన్న తెల్ల రక్త కణాల సంఖ్య నియంత్రించబడి, ఆ సమస్య తిరిగి పునరావృతం కాకుండా నివారించబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.