తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ లో ఆశ వర్కర్ల ధర్నాలు, కరోనా టైం లో కూడా మేము ఎంత గానో కృషి చేశామని, రాష్ర్టం లో ఏ విధి నిర్వహణలు మొదలు పెట్టిన కచ్చితంగా మేము ఉండాలని, శీతాకాల సమావేశాల్లో తమకు 18000 వేతనాన్ని నిర్ణయించడం సహా పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్ తో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు.
కోటీలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టిన ఆశ వర్కర్లు లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతే కొత్త సర్వేలు చేయించాలని డిమాండ్ చేశారు, సంవత్సరాల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా లెప్రసీ సర్వే చేయాలని ఒత్తిడి చేయడం అన్యాయం అని చెప్పారు, తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని పెండింగ్ బిల్లులు చెల్లించడం సహా ఆశాలను ఆదుకోవాలని కోరారు, వేతనాల పెంపు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్ తో చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తల్ని జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు.