ప్రముఖ తబలా సంగీత విద్వాన్సులు జాకీర్ ఉస్సేన్ ఇంక మనకు లేరు….

జాకీర్ ఉస్సేన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, ముఖ్యం గా సంగీత ప్రేమికులు అయితే ఆయనకి వీరాభిమానులనే చెప్పాలి, అయితే ఇకపై అయన సంగీతం మనం వినలేము,  ప్రముఖ తబలా విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుసేన్ కన్ను మూసారు, కొన్ని రోజులుగా గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఏడేళ్ల వయసులోనే తబలా చేతబట్టారు, 12 ఏళ్లకే దేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు, తబలా విద్వాంసుడిగా ప్రశంసలు అందుకున్నారు, ఆయన భారతీయ చిత్రాలకే కాకుండా అంతర్జాతీయ  చిత్రాలకు కూడా సంగీతం అందించారు, ఉస్తాద్ జకీర్ హుసేన్ 40 ఏళ్ల క్రితమే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో స్థిరపడ్డారు, ఆయన వయసు 73 ఏళ్ళు.

1951 వ సంవత్సరం లో మర్చి 9 న ముంబై లో జన్మించారు, జాకీర్ ఉస్సేన్ అసలు పేరు జాకీర్ ఉస్సేన్ అల్లారఖా ఖురేషి . జకీర్ హుసేన్ తన ప్రస్థానంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు, 12 ఏళ్ల వయసు నుంచి ఆయన దేశవ్యాప్తంగా తబులా ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు, అనేక సినిమాలకు ఆయన కంపోజర్ గా పని చేశారు, హిందుస్తాని క్లాసికల్ మ్యూజిక్ జాస్ ఫ్యూజన్ అలాగే ప్రపంచ సంగీతంలో ఆయన దిట్ట, ప్రఖ్యాత గ్రామీ అవార్డు ను కూడా అందుకున్నారు, ఆయన 2009లో 51వ గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్ లో ఆయన కాంటెంపరరీ ప్రపంచ సంగీతానికి ఆల్బం కి గాను ఆయన గ్రామీ అవార్డు ను కూడా అందుకున్నారు, జకీర్ హుసేన్ సంగీత స్వరకర్తే కాదు ఆయన యాక్టింగ్ కూడా చేశారు. మలయాళం సినిమా వానప్రస్థంలో ఆయన యాక్ట్ చేశారు, 1998 కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా నామినేట్ కూడా అయింది,  ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు, ఆయన ఉస్తాద్ జకీర్ హుసేన్ గా ప్రసిద్ధులైనటువంటి జకీర్ హుసేన్ 1988లో పద్మశ్రీ 2002లో పద్మభూషణ్ 2023 లో పద్మ విభూషణ్ అందుకున్నారు.

అల్లా రఖ పెద్ద కుమారుడే జకీర్ హుసేన్, జకీర్ హుసేన్ కథక్ నర్తకి గురువైనటువంటి అంటోనియా మినెకోలా అనే ఆమెను వివాహం చేసుకున్నారు, ఆవిడ ఆయన మేనేజర్ గా కూడా పని చేశారు, వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అనీసా ఖురేషి, ఇసాబెల్లా కురేషి అనీసా లాస్ ఏంజెలిస్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి గ్రాడ్యుయేట్ చేసి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు, ఇసాబెల్లా మన్హటన్ లోని నృత్యం మీద అధ్యయనం చేస్తున్నారు, అలాగే జకీర్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సంగీత విభాగం 2005 నుంచి 2006 మధ్యలో ప్రొఫెసర్ గా కూడా పని చేశారు. అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ గా పని చేశారు, ఆయన ప్రస్తుతం ప్రాన్సిస్కో లోనే ఉంటున్నారు, జకీర్ హుసేన్ హిందుస్తాని జాస్ ఫ్యూజన్ అలాగే ప్రపంచ సంగీతంలో ఆయన మేటి విద్వాంసుడిగా పేరుపొందారు.

Scroll to Top