బ్రహ్మముడి  సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం. హలో బ్రదర్, నువ్వా హేయ్ నాకు అసలే చిరాగ్గా ఉంది వెళ్ళు ఇక్కడి నుంచి నాకు ఇంకా చిరాగ్గా ఉంది కానీ పద వెళ్దాం ఎక్కడికి ఏంటి? ఇందాక మన భార్య జ్ఞాపకాలు ఇంట్లో ఉండకూడదు తగలెట్టేస్తా అంటూ తీసుకెళ్లి బయట పడేసావు కదా వర్షం తగ్గిపోయింది వెళ్లి తగలెట్టేద్దాం పదా.  హేయ్ నన్ను విసిగించడానికి వచ్చావా ముందు వెళ్లి ఇక్కడి నుంచి,  కల్కిలో కమలహాసన్ లాగా బానే యాక్ట్ చేస్తున్నావా,  హేయ్ నేను నటించడం ఏంటి నాకు అంత అవసరం లేదు, ఎంత అవసరం ఉందో కళ్ళ ముందే కనిపిస్తుంది కదా పెళ్ళం మీద ఇష్టం లేదంటూ అందరి ముందు తిడతావ్ అరుస్తావ్, కానీ లోపల మాత్రం ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. హేయ్ దాని మీద నాకు ప్రేమ ఉందని నీకు ఎవరు చెప్పారు, అంటే ప్రేమ లేకుండానే ఎక్స్పో లో దాంతో గొడవ పడ్డావా, చేసిన ద్రోహానికి గొడవ పడ్డాను. నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసురా ఎవరైనా మోసం చేస్తే వాళ్ళతో మాట్లాడవు వాళ్ళని కనీసం దగ్గరకు కూడా రానివ్వవు అలాంటిది అందరి ముందు కావాలని గొడవ పెట్టుకున్నావ్ ఎందుకు తన మీద ప్రేమ ఉండబట్టే కదా నేరుగా వెళ్లి మాట్లాడితే నువ్వు ఎక్కడ తగ్గిపోతావో అని కోపాన్ని అడ్డుపెట్టుకొని వెళ్లి మాట్లాడావు అది నటన కాదా? ఆపుతావా జ్ఞాపకాలు కూడా ఉండకూడదని తీసి బయట పడేసావ్ ఎందుకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎక్కడ కరిగిపోయి వెళ్లి మాట్లాడేస్తాను అని భయం నీకు, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా, అసలు నీ కోపానికి కారణం ఏంటో చెప్పనా నీ భార్య ఏం చేసినా అది నీ కోసమే చేయాలి కానీ ఈరోజు వేరే ఎవరో కంపెనీకి పని చేసింది అది నీకు నచ్చడం లేదు నీ భార్య నీకు మాత్రమే సొంతం అని నీ మనసులో ఉంది కదా. తొక్కలో సిద్ధాంతాలన్నీ చెప్తున్నాడు ఆ కళావతిని నేను ప్రేమించడం ఏంటి నాకే సొంతం కావాలనుకోవడం ఏంటి అది చేసిన ద్రోహానికి జీవితంలో ఎప్పటికీ క్షమించరు.

                          అత్తయ్య, ఎవరు నువ్వు గుడికి రమ్మని పిలిచావ్ నీకు నాకు ఏ సంబంధం ఉందని రమ్మన్నావ్, నేను మీకు తెలియదా? ఈ నువ్వు నాకు తెలీదు అంటే నాకు నాకు తెలిసిన కావ్య నువ్వు కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఒక్కలాగే ఉన్నాను, కానీ ఒక్క చోట లేవు అప్పుడు మా ఇంట్లో ఉన్నావ్ ఇప్పుడు పుట్టింట్లో ఉన్నావు. అది మీ ఇల్లు కనుకనే మీ ఇంట్లో చోటు లేదని మీ అబ్బాయి మనసులో స్థానం లేదని మా పుట్టింటికి పోయాను, నా ఇల్లు నీ ఇల్లు కాదా నా కొడుకు నీ భర్త కాడా వాడి మనసులో స్థానం లేకపోతే సంవత్సరం పాటు కలిసి కాపురం చేసేవాడా. మీరు బలవంతం చేస్తేనే నాతో కాపురం చేశాను అన్నారు కదా అత్తయ్య మీరు ఎలా ఉన్నారు అత్తయ్య. ఇప్పుడు అడిగేది హాస్పిటల్ లో ఉన్నప్పుడు చూడ్డానికి రాలేదు ఇంటికి వచ్చాక పలకరించడానికి కూడా రాలేదు కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగలేదు ఇక్కడ కలిసాం కాబట్టి అడుగుతున్నావా? అత్తయ్య నేను అక్కడ లేకపోయినా ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను అత్తయ్య మీ పరిస్థితి అలా ఉన్నప్పుడు నేను మీ పక్కనే ఉండాలనుకున్నాను కానీ నా మొహమే చూపించొద్దని మీ అబ్బాయి హాస్పిటల్ నుంచి నన్ను వెళ్లగొట్టారు ఇంటికి   వచ్చాక అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, నాకంతా తెలుసు కనీసం నేను వచ్చే వరకైనా నువ్వు అక్కడే ఉండాల్సింది నేను మాట్లాడేదాన్ని కదా, మాట్లాడితే ఏం జరిగేది మళ్ళీ నన్ను ఉండనిచ్చేవారు మళ్ళీ నాతో బలవంతంగా కాపురం చేసేవారు అదే కదా జరిగేది. మరి ఇప్పుడు ఎందుకు రమ్మని పిలిచావ్ మీ గొడవ గురించి చెప్పడానికా, కాదు అత్తయ్య ఏం జరిగిందో మీకు తెలుసని నాకు తెలుసు కానీ నిన్న ఏం జరిగిందో మీకు మీకు తెలియదు ఇంట్లో రుద్రాణి గారు అందరికీ కథలు కథలుగా చెప్పే ఉంటుంది కానీ జరిగిన కథ వేరు ఆ విషయంలో మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకు నువ్వు తప్పు చేసావని నా కొడుకు చెప్తేనే నమ్మలేదు ఆ రుద్రాణి చెప్తే నమ్ముతానా మీ అత్త అంత తెలివి తక్కువది అనుకున్నావా, కాదు అత్తయ్య ఇది చెప్పే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు నేను నా పుట్టింటికి భారం కాకూడదని నా కాళ్ళ మీద నేను నిలబడాలని నాకు వచ్చిన కళ్ళని ఉపయోగించుకుని పని కల్పించుకోవాలనుకున్నాను కానీ దాని వెనక అనామిక ఉందని ఆ అనామిక తెలివిగా నాతో డిజైన్స్ వేయించి ప్రత్యర్థులకు ఇచ్చింది అని అక్కడికి వెళ్ళాకే నాకు తెలుసు నాకు అలాంటివి ఏమీ తెలియక నేను మోసపోయాను అత్తయ్య అంతే తప్ప నేను కావాలని వెళ్లి ఆయన ఓడిపోవాలని ఎవరో గెలవాలని నేనెందుకు పోటీ పడతాను. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అనామిక గెలిచింది అటు కంపెనీ మీద దెబ్బతీసింది ఇటు నీ కాపురం మీద దెబ్బ కొట్టింది, ఇందులో నా తప్పేమీ లేదు అని చెప్పినా ఎంతకీ నమ్మలేదు ఏం చెప్పి ఆయన్ని నమ్మించాలో నాకు తెలియడం లేదు, ఏమి చెప్పక్కర్లేదు ఇంటికి వచ్చి వాడితో బుద్ధిగా కాపురం  చేసుకో, రాను, మరి నీ తప్పు లేదని వాడికి ఎందుకు చెప్పాలి వాడు నీ గురించి ఏమనుకుంటే నీకేంటి వాడిని నమ్మించాల్సిన అవసరం నీకేంటి వాడే అక్కర్లేదు అనుకున్నప్పుడు వాడు నిన్ను అర్థం చేసుకుంటే ఎంత అపార్థం చేసుకుంటే ఎంత అసలు నువ్వు నాకు సంజాయిష్ ఇవ్వాలని పిలిచావా నా ద్వారా వాడికి నిజం చేరవేయాలని పిలిచావా వాడు తప్పుగా అనుకున్నాడనే కదా నిజం ఒప్పుకో కావ్య. నేను మీకు సంజాయిషి ఇవ్వాలనే పిలిచాను, దీన్నే ఆత్మ వంచన అంటారు ఇద్దరికి ఇద్దరు సరిపోయారు నా ప్రాణానికి లోపల ఉన్న అభిప్రాయం బయటికి చెప్పరు బయటికి మాట్లాడేదంతా లోపల ఉండదు మధ్యలో మీ కాపురం ఇలా అయింది ఏంటా అని మేము బాధపడాలి సరే జరిగింది ఏదో జరిగిపోయింది వాడు నీ పట్ల అమానుష్యంగానే ప్రవర్తించాడు నీ మనసు గాయపడేలా చేశాడు అందుకు నేను వాడికి రోజు గడ్డి పెడుతూనే ఉన్నాను నేను నిన్ను తీసుకెళ్తాను వాడేం మాట్లాడతాడో చూస్తాను, నేను రాను అత్తయ్య, మళ్ళీ అదే పాట అత్తయ్య అక్కడ ప్రేమ ఉందంటే నేను రావచ్చు.

లేదన్నాక నేను రాకూడదని ఆ ఇంటి గడప దాటాను, వాడు చేసిన తప్పుల్ని క్షమించి ఇంటికి రాలేవా? మీరెందుకు మావయ్య గారిని క్షమించలేకపోతున్నారు చెప్పండి అత్తయ్య మీరెందుకు క్షమించలేకపోతున్నారు? మధ్యలోకి ఆ దరిద్రపు విషయాన్ని ఎందుకు లాగుతున్నావ్ నా సంగతి వేరు మీ మామయ్య తన మనసులో ఇంకో ఆడదానికి చోటు ఇచ్చారు. అసలు మీ అబ్బాయి అయితే తన మనసులో నాకు చోటే లేదన్నారు ఏడాది పాటు నాతో కాపురం చేసిన నేనేంటో ఆయనకు అర్థం కాలేదు అంతా అర్థం చేసుకోవడంలోనే ఉంది, ఒకప్పుడు మాయ విషయంలో ఆయన తప్పు చేశాడు అని కన్న తల్లి నమ్మినా నేను నమ్మలేదు ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు అని మీతోనే నేను విభేదించాను అలాంటిది నేను కావాలని ఏ తప్పు చేయను అని తెలిసినా కూడా నన్ను దోషిని చేశారు, ఆస్తి లేని చోట కూడా ఉండొచ్చు అంతస్తు లేని చోట ఉండొచ్చు అవన్నీ ఉండి ప్రేమ లేని చోట ఏ భార్య ఉండలేదు, అక్కడికి వచ్చి ఒక వస్తువులా నేను ఉండలేను నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా. అహానికి ఆత్మాభిమానానికి కి మధ్య ఒక సన్నటి గీత మాత్రమే ఉంటుంది ఆ గీతని చెరిపేయాలంటే సహనం కావాలి వాడు ఓపిక పట్టలేకపోయాడు నువ్వు అది భరించలేకపోయావు సరే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు ఇక నేను చేయాల్సింది నేను చేస్తాను. మీరేం చేస్తారు ఆ లాగిపెట్టి ఒకటి ఇచ్చి కార్లోకి తోసి ఇంటికి తీసుకుపోతాను వస్తావా? నేను రాను, మళ్ళీ అదే పాట పాడావంటే ఒక్కటి కాదు నాలుగు పీకుతాను, చూస్తాను ఎన్నాళ్ళు అక్కడ ఉంటావో నేను చూస్తాను దేవుడి సమక్షంలో ఉండి చెప్తున్నాను మీ ఇద్దరికీ పై నుంచి కింద వరకు ఈగో ఒకటి సరఫరా అవుతోంది అది తగ్గిస్తే గాని మీరు దారికి రారు ఎందుకు నీకు ఇంత పట్టుదల నా మనవరాలు బాగుండాలి అని మా అత్తగారు మామగారు వస్తే రాను పొమ్మన్నావు సరే అని వాడిని పంపిస్తే తమలపాకుతో తాను ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటానని ఇద్దరికి ఇద్దరు తగువులాడుకుని రాను పొమ్మన్నావు ఇప్పుడు నేను రమ్మంటే నకరాలు చేస్తావా నకరాలు నరాలు తీస్తాను. అనండి మీరు నన్నే అంటున్నారా అందరూ నన్నే అనండి మా అమ్మ కూడా నన్నే అంటుంది గుండెల్లో సూలంతో గొచ్చినట్టు మాట్లాడిన మీ అబ్బాయి బానే ఉన్నాడు నన్నే అందరూ దోషిలా చూస్తున్నారా. ఏడ్చావులే పై నుంచి నిష్టూరం ఒకటి ఒసేయ్ ఇప్పుడు చెప్తున్నాను నాకు ఈగో ఉంది కోడలివి నీకే అంత ఉంటే అత్తని నాకెంత ఉండాలి, మీ ఇద్దరి పొగరంతా దించేసి మళ్ళీ ఒక్కటి చేయకపోతే నా పేరు అపర్ణే కాదు గుర్తుపెట్టుకో ఈ తేదీ రాసి పెట్టుకో రా పోదాం. ఎక్కడికి , నీ ఇంటికి నువ్వు నా ఇంటికి నేను చాలా పదా.

 అమ్మ నా అత్త ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోడలితో రాయబారం మాట్లాడుతున్నావా చెప్తా, ఎక్కడ చచ్చావ్, ఓ గుడి ముందు చచ్చాను ఆదాయం లేదని అడుక్కు దించే వస్తున్నావా? ముందు నేను చెప్పేది విను మామ్ ఏంటది అపర్ణ అత్త కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకుని రావడానికి మంతనాలు మొదలు పెట్టింది అవును ఇప్పుడే వాళ్ళని గుడి దగ్గర చూశాను. మా వదిన రాజుకి తెలియకుండా ఇలాంటి నాటకం మొదలు పెట్టిందా, ఈసారి కావ్య గాని తిరిగి వస్తే అత్త కోడళ్ళు కలిసి మన ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేయడం కాయం రెండు కర్చీఫ్లు కొనుక్కుని రమ్మంటావా? దేనికి ,నీకొకటి నాకొకటి గుడి ముందు అడుక్కునే వాళ్ళ పక్కన కర్చీఫ్లు వేసి మన ప్లేస్ రిజర్వ్ చేస్తాను. షట్ అప్ నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా నేను చేయాల్సింది నేను చేస్తాను ఓకే బాయ్ రాహుల్ పదా అమ్మేది నానమ్మ? తెలీదురా ,ఆ నీకు తెలియదా అమ్మా ఏ విషయం వదన ఎక్కడికి వెళ్ళిందో నీకు నిజంగా తెలియదా ఆ నాకు తెలుసు రాజ్ సరే ఏంటి సరే ఎక్కడికి వెళ్ళిందో అడగవా, నువ్వేదో చెప్పడానికి ఫిక్స్ అయినట్టు మధ్యలో దూరిపోయావు కదా వద్దన్నా చెప్తావని. మీరంతా ఇలా అందరిని గుడ్డిగా నమ్మడం వల్లే ఈ ఇల్లు ఇలా తయారైంది సరే ఇక నుంచి గుడ్డిగా నమ్మడం మానేస్తాడు వెళ్ళు ముందు చెప్పాల్సిందంతా చెప్పనివ్వవు నానమ్మ లేకుండా అత్త కడుపు ఉబ్బిపోయేలా ఉంది అందులో మా అమ్మ గురించి నాతోనే చెప్పడానికి వచ్చింది కదా మీ అమ్మ గుడికి వెళ్ళింది. శుభం చెప్పావు కదా వెళ్ళు, ఎవరి దర్శనానికి వెళ్ళిందో తెలుసా ఏంటా తను అనేది నీ భార్యని కలవడానికి వెళ్ళింది ఏం చేసినా పాపం లేదు గుడికి వెళ్ళినా నీ కోడలికి పుణ్యం రాదు పాపం రాజు వెనకాల కోడలితో కలిసి మంతనాలు చేయడానికి వెళ్ళింది . రుద్రాణి భార్యా భర్తల మధ్య చిచ్చు పెట్టడం అయిపోయింది ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? నీ కోడలు వస్తుందిగా అడుగు నా కోడలేం చిన్నపిల్ల కాదు అన్ని అడగడానికి అత్తయ్య గుడిలో రాజు పేరిట అర్చన చేయించాను ప్రసాదం తీసుకోండి, తీసుకోండి అత్తయ్య ఇదిగో రాజు నువ్వు కూడా తీసుకో తీసుకో నువ్వు కూడా తీసుకో ఆ ఇప్పుడు ఏం చెప్తుందో చూస్తాగా, ఉమ్ వదిన వెళ్ళింది అయ్యవారి గుడికా అమ్మవారి గుడికా ? అదేం ప్రశ్న, జవాబు ఒక్క ముక్కలో చెప్పాల్సిన ప్రశ్న ఏ బిట్ క్వశ్చన్ నువ్వు గుడిలో అమ్మవారిని చూడడానికి వెళ్ళావా నీ కోడల్ని కలవడానికి వెళ్ళావా మమ్మీ? ఏంట్రా నువ్వు మాట్లాడేది నువ్వేం మాట్లాడావు అది చెప్పు చెప్పు మమ్మీ మన ఇంటికి పట్టిన దరిద్రం అరిష్టం ఎప్పుడు వదులుతుందో పూజారిని అడగడానికి వెళ్ళాను అత్తగారు మామగారు చాలా ఏళ్ల క్రితమే ఒక దోషాన్ని ఇంటికి తెచ్చుకున్నారు దాన్ని బయటికి తరిమేసిన రోజు ఈ ఇంటికి మంచి జరుగుతుందంట అదే చెప్పారు.

                                           అవునా నిజమా ఆ దోషానికి పరిహారం ఎలా చేయాలో చెప్పాడా అతను, మమ్మీ ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు, రాజ్ అనవసరమైన విషయాల్లో తలదూర్చడం నువ్వు రుద్రాణి నుంచి నేర్చుకున్నావా, నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావో అది నాకు అనవసరం ఎలా అవుతుంది మమ్మీ, నువ్వు చాలా తెలివిగా ఏదో చెప్పి తప్పించుకుందాం అనుకున్నావా వదిన గుడిలో మీ ఇద్దరిని రాహుల్ చూసే చెప్పాడు. అవునా మమ్మీ, అవునురా నా కోడల్ని కలవడానికే వెళ్ళాను అనామి ఆడిన నాటకంలో తను ఎలా ఇరుక్కుపోయిందో చెప్పడానికి పిలిచింది నీ మనసులో తన మీద ఎలాంటి తప్పుడు అభిప్రాయం ఏర్పడిందో చెప్పుకుని బాధపడింది. నీ ప్రాణాల మీదకి తెచ్చిన నీకు అవసరం లేదు కదా నీ కొడుక్కి ప్రత్యర్థిలా పని చేసినా నీకు బాధ లేదు మనకు రావలసిన అవార్డు ని తను తన్నుకుపోయినా నీకు అక్కర్లేదు, మన కంపెనీ దివాళ తీయడానికి శత్రుత్వంతో కలిసి పని చేసిన నీకు కోపం రాలేదు కానీ అది పిలిస్తే మాత్రం గుడికి వెళ్ళిపోయావు, రుద్రాణి.. మమ్మీ అత్త మీద అర్జున అంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా నాకు బాధగా ఉంది మమ్మీ నేను నీ కోసం ఆలోచించి కళావతితో గొడవ పడ్డాను కంపెనీ గురించి ఆలోచించి రాత్రింబగళ్ళు కష్టపడ్డాను, మా అందరి అదృష్టం కొద్ది క్షేమంగా నువ్వు బయటపడ్డావు కానీ కంపెనీ నష్టాల నుంచి బయటపడే మార్గాన్ని ఆ కళావతి మూసేసింది అందుకు ఇంకా ద్వేషం పెరిగిపోయింది ఇంకోసారి అలాంటి మనిషిని నువ్వు కలవడం నాకు ఇష్టం లేదు మమ్మీ అది నాకే అవమానం. సంతోషంగా ఉందా రుద్రాణి ,ఈ రోజుకి భోజనం సరిపోతుందా..? ఈ ఇంటికి అన్యాయం చేసిన వాళ్ళని మీరు క్షమించిన నేను క్షమించను రాజుకి ద్రోహం చేసింది ఎవరైనా సరే జీవితంలో వాళ్ళ పేరే ఎత్తను. నా కొడుకు మీద ప్రేమ చాలా పెరిగిపోయినట్టు ఉంది రుద్రాణి?  ఆ అఫ్ కోర్స్ అది ఎప్పుడూ ఉంటుంది, కానీ నా కొడుకు యోగక్షేమాలు విచారించడంలో పడి నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం మర్చిపోయినట్టు ఉన్నావు.. నా కొడుకా వాడేం చేస్తున్నాడు వస్తున్నాడుగా నువ్వే అడుగు,  గుడిలో నిన్ను నీ కోడల్ని చూసే వస్తున్నాడు నీ కొడుకు ఆ సమయానికి అక్కడ ఏం చేస్తున్నాడో అడుగు ఏం చేస్తున్నాడు ఆంటీ నాతో చెప్పండి. అక్కర్లేదు నేను కనుక్కుంటానులే నువ్వు పదరా, హలో అత్త అవసరం లేదు నేను నేనే తేల్చుకుంటాను, ఉండరా ఏదో తేల్చుకుంటాను అంటుంది కదా ఏం చేసాడో చెప్పండి ఆంటీ..? ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకుని కార్లో ఇంకో అమ్మాయితో షికార్లు కొడుతున్నాడు.

Scroll to Top