బ్రహ్మముడి Serial Today Episode(11/10/2024)

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం. రాజ్, రాజ్ నానమ్మ, బాబాయ్ మరియు అపర్ణ లు భోజనం తింటుండగా, రాజ్ బాబాయ్ అమ్మ… కావ్య కి ఆలా జరగడం తట్టుకోలేక పోతున్న అంటాడు. అప్పుడు రాజ్ నానమ్మ, అవును అపర్ణ మన కావ్య కి ఆలా ఉంటె మనం ఎలా తింటాం అంటుంది, రాజ్ ని వదిలేసి ఆ ముగ్గురు అక్కడ నుంచి ప్లేట్స్ తీస్కుని వెళ్ళిపోతారు. రాజ్ కి అక్కడ ఏం జరుగుతుతుందో తెలీక కావ్య కి ఏం జరిగి ఉంటుంది ఎలా అయిన తెల్సుకోవాలి అని అనుకుంటాడు. అపర్ణ మరియు రాజ్ నానమ్మ లు ఇలా మాట్లాడుకుంటారు. అపర్ణ అంటుంది, పర్లేదు అత్తయ్య మీరు కూడా బాగానే నటిస్తుంన్నారు అంటుంది అని అప్పుడు ఆమె, కనకం తో సావాసం కదా అని అంటుంది, ఈ లోగ రాజ్ వాళ్ళ దగ్గరకి వచ్చి ఏం జరుగుతుంది చెప్పండి అంటాడు. అప్పుడు అపర్ణ నువ్వే కదరా పిల్ల గురుంచి చెప్పొద్దూ పిల్ల తల్లి గురుంచి చెపొద్దు అన్నావ్ అంటుంది, అప్పుడు రాజ్ సతి మనిషిగా తెల్సుకోవాలి మమ్మీ చెప్పండి ఏం జరిగిందో అంటాడు, అసలు ఏం జరిగిందో చెప్పి తీరాలి అంటాడు. అప్పుడు రాజ్ నానమ్మ మెం చెప్పం ర తెల్సుకుని నువ్వేం చేస్తావ్ లే అని ఆ ఇద్దరు అక్కడ నుంచి వెళ్లిపోతుండగా, రాజ్ సరే వెళ్ళండి మీరు చెప్పకపోతే నాకు కళ్యాణ్ ఉన్నాడు గ వాడు చెప్తాడు లే అంటాడు.ఆ మాటకు వాళ్లిద్దరూ షాక్ అయ్యి అపర్ణ కళ్యాణ్ తో చెప్తాను అంటున్నాడేంటి అత్తయ్య ఈ నాటకం సంగతి ఏం తెలీదు కదా మనమే చెప్పేద్దాం అత్తయ్య అని ఇద్దరు అనుకుంటారు, అప్పుడు రాజ్ కి చెప్పడానికి వస్తారు ఇద్దరు. రాజ్ తో అపర్ణ మీ అత్తగారు కనకానికి కాన్సర్ అంటుంది వాళ్ళ నానమ్మ అవును రా, లాస్ట్ స్టేజి లో ఉందట మహా అయితే నెల రోజులకన్నా ఎక్కువ బ్రతికేటట్టు లేదు, అప్పుడు రాజ్ ఆ రోజు వినాయక చవితికి బనే ఉంది గ అంటాడు అప్ప్పుడు అపర్ణ ఎక్కడ బాగుంది రా, ఆ రోజు ఎవరు ఎమన్నా ఓపిక లేక ఏమి మాట్లాడలేదు అంటుంది. అప్పుడు రాజ్ ఈ విష్యం కావ్య కి తెల్సా అంటాడు, అప్పుడు అపర్ణ అమ్మో ఈ విష్యం కావ్య కి తెలిస్తే బ్రతుకుంతుందా.. ఇప్పటికే నీకు దూరమై పుట్టింటిలో జీవచ్ఛవం గ బ్రతుకుతుంది, ఇంకా ఈ విష్యం తెలిస్తే తట్టుకొలేదు అంటుంది. అప్పుడు రాజ్ చెప్పకండి కళావతి తట్టుకొలేదు అంటాడు. అప్పుడు రాజ్ నానమ్మ కనకం ఆఖరి కోరిక కూడా చెప్దామా అంటుంది, అప్పుడు రాజ్ ఏంటి కావ్య ని కాపురానికి తీసుకుపోమన్దా అంటాడు , అప్పుడు అపర్ణ నువ్ అన్ని అలానే అపార్థం చేస్కుంటావ్ కనకాన్ని కూడా అలానే అర్ధం చేసుకున్నావ్ వద్దులే నీకేమి చెప్పకపోవడం మంచిది అంటుంది నీ వళ్ళ కాదు పాపం కనకం ఆఖరి కోరిక కూడా తీర్చకుండా చచ్చిపోతుంది అనుకుంటారు, ఏంటో చెప్పండి అంటాడు రాజ్, అప్పుడు అపర్ణ వద్దులే నీలాంటి బాండ రాయిన్కి చెప్పకపోవడమే మంచిసి అంటుంది. అప్పుడు రాజ్ మీరు చెప్పడం ఏంటి నేను మా అత్తగారిని అడిగి కనుక్కుంట పాపం మా అత్తగారు అనుకుంటూ కనకం ఇంటికి బయలుదేరుతాడు రాజ్.

                                                                                    కనకం ముందే అక్కడ ఒక లాయర్ ని పెట్టుకుని రాజ్ రాగానే ఆక్ట్ చెయ్యడానికి రెడీ గ ఉంది, ఈ లోగ రాజ్ వచ్చాడు, తాను చూస్తుండగానే కనకం లాయర్ గారు నేను చచ్చిపోయేలోగా న ఇంటిని న ముగ్గురు అల్లుళ్లకు రాసి ఇచ్చేస్తా అంటూ దగ్గుతుంది అప్పుడు రాజ్ దగ్గరకి వచ్చి కనకం ఈ ఏళ్ళు మాకు రాసిస్తే మావయ్యగారు రోడ్డు మీద ఉంటారా అని లాయర్ గారిని వెళ్ళిపోమంటాడు రాజ్. కనకం మీకు తెల్సిపోయిన అంటాడు, రాజ్ రండి అత్తయ్య మిమ్మల్ని పెద్ద డాక్టర్లు దగ్గరకి తీసుకెళ్తాను అంటాడు, అప్పుడు కనకం అక్కడకి వెళ్తానే దీనికి ట్రీట్మెంట్ లేదు అన్నారు అంటుంది ,కనకం. అప్పుడు రాజ్ ఇంత బాధను ఇలా తట్టుకుంటున్నారు అంటాడు, అప్పుడు కనకం న కూతుర్ని పెళ్లి అయ్యాక పుట్టింటిట్లో చూసి తట్టుకుంటున్న ఏదోఒక లెక్క బాబూ అంటుంది, ఏ జన్మ లో ఎంత పుణ్యం చేసుకున్నానో మీలాంటి అల్లుడు దొరికాడు ఏ జన్మ లో ఏం పాపం చేసుకున్నానో మనామాల్ని చూడకుండా చచ్చిపోతున్న అంటుంది, అప్పుడు అత్తయ్య గారు మీ చివరి కోరిక ఏంటి చెప్పండి అంటాడు, అప్పుడు కనకం మీకు తెల్సిపోయిందా బాబు వద్దు బాబు కన్నా కొడుకు ఉంటె ఈ కన్నా తల్లి కడసారి కోరిక తీర్చి కన్నీటితో వీడ్కోలు చెప్పేవాడు నేను ఆనందంగా అనంత లోకానికి ఫ్రీ బస్సు మీద వెళ్లినట్టు టికెట్ లేకుండా అనంత లోకానికి వెళ్లిపోయేదాన్ని లేదు కదా అందుకే న కోరిక న గుండె అట్టడుగు లోతుల్లో దాచుకున్నాను అంటుంది, అప్పుడు రాజ్ నన్నే మీ కొడుకు అనుకోండి నాతో చెప్పండి అని ఎమోషనల్ గ అంటాడు రాజ్, మీ చివరి కోరిక తీర్చలేక పోతే నేను బ్రతికే చివరి క్షణం వరకు బడా పడాలి అంటాడు, అప్పుడు కనకం నువ్వు కొడుకుల అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను, రేపే మా 25 సంవత్సరాల పెళ్లి రోజు న ముగ్గురు కూతుర్లు న ముగ్గురు అల్లుళ్ళు తో మా పెళ్లి రోజు చేసుకోవాలని ఉంది బాబు అంటుంది. అప్పుడు రాజ్ నేను మీ కోరికను తీరుస్తాను అంటాడు, అప్పుడు కనకం నిజామా బాబు లక్ష్మి పార్వతి సరస్వతుల్లా న ముగ్గురు కూతుర్లుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరూళ్ళ మీ ముగ్గురు వస్తారా బాబు అంటుంది. అప్పుడు రాజ్ మేమె కాదు మా ఇంట్లో అందరు వస్తారు అంటాడు. చుడండి మీరు జీవితం ఏ మాత్రం ఊహించనంతగా మీ పెళ్లి రోజు జరిపిస్తాను అంటాడు రాజ్. అప్పుడు కనకం ఈ విష్యం న కూతుర్లకు తెలీదు బాబు చెప్పొద్దూ అంటుంది, సరే అంటాడు రాజ్. అక్కడనుంచి వెళ్ళిపోతాడు .రాజ్

                                        రాజ్ వెళ్తుండగా కావ్య చూస్తుంది అమ్మ ఆయనే కదా ఎందుకు వచ్చాడు అంటుంది, అప్పుడు కనకం నీకోసమే అంటుంది అప్పుడు కావ్య బండరాయయిన కరుగుతుంది కానీ అయన మాత్రం మారదు అంటుంది అప్పుడు కనకం నీకు తెలీదా పెళ్ళాం దూరం గ ఉంటె ఏ మొగుడికి అయినా బడా ఉంటుంది అంటుంది కావాలంటే చూడు రేపు అయన కూడా వస్తాడు అంటుంది అప్పుడు కావ్య అదేం జరగదు అమ్మ అని వెళ్ళిపోతుంది. అప్పుడు కనకం అపర్ణ వాళ్ళకి ఫోన్ చేస్తుంది జరిగింది చెప్తుంది.

Scroll to Top