ఇంటి పనులు చెప్తూ రాజ్ ని ఒక ఆట ఆడుకుంటున్న కుటుంబ సభ్యులు……
బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, రాజ్ తనని ఆఫీస్ కి వెళ్ళమని ఇంట్లో వాళ్లంతా భ్రతిమిలాడతారేమో అనుకుంటాడు, కానీ ఎవరు ఆ విష్యం గురుంచి మాట్లాడరు, రాజ్ తన తండ్రి దగ్గరకి వెళ్లి డాడీ నువ్వు నాతో ఎదో చెప్పాలని అనుకుంటున్నావు కదా అంటాడు, అప్పుడు అవును రా అంటాడు రాజ్ తండ్రి , అప్పుడు రాజ్ పితృవాక్య పరిళాన చేస్తాను చెప్పండి అంటాడు, కానీ చెప్తే నువ్వు ఒప్పుకోవు రా అంటాడు, అప్పుడు రాజ్ ఓహో అదా విష్యం నేను అస్సలు ఒప్పుకోను అంటే ఒప్పుకోను డాడీ అంటాడు, అప్పుడు రాజ్ తండ్రి అదేంటి రా నేను నీ కన్నా తండ్రి ని ఎందుకు ఒప్పుకోవు అంటాడు, అప్పుడు రాజ్ కావాలంటే మీ కాళ్ళు పట్టమనండి పడతా అంతేగాని అది మాత్రం ఒప్పుకోను అంటాడు, అప్పుడు రాజా తండ్రి నేనేం చెప్పలేదు కదరా న కార్ సర్వీస్ కి వెళ్ళింది నీ కార్ అడుగుదామని అనుకుంటున్నాను అంటాడు, అప్పుడు రాజ్ షాక్ అవుతాడు, అప్పుడు రాజ్ బాబాయ్ దానికి వాడిని అడిగేది ఏంటి అన్నయ్య పనిపాట లేదు కదా తీసుకెళ్ళు అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఏమిటో రా నిన్ను చూస్తుంటే కడుపు కంద ముక్కాలా తరుకుపోతుంది ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ రా అంటుంది, అప్పుడు ఈ లోగా అపర్ణ రాజ్ అని పిలుస్తుంది, ఈ సరి నా మాట వినాలిసిందే అంటుంది, అప్పుడు రాజ్ నాకు తెల్సు మమ్మీ నువ్వు ఎం చెప్పాలనుకుంటున్నావో అంటాడు, అప్పుడు అపర్ణ నీకు ముందే తెల్సా నేను కూరగాయలు తీసుకురమ్మంటానని ముందే తెల్సా అంటుంది, అప్పుడు రాజ్ నేనా కూరగాయల అంటాడు, అప్పుడు రాజ్ ఓహో మీరంతా రూటు మార్చారా, నేను కూడా రూటు మారుస్తాననుకుంటు కూరగాయల లిస్ట్ చెప్పంటాడు, అప్పుడు అందరు షాక్ అవుతారు, అప్పుడు రాజ్ నానమ్మ వాడికి ఎం తెసులు పుచ్చులు సంచులు వాడిపోయినివి తెస్తాడు అంటుంది. అప్పుడు రాజ్ నానమ్మ నేను ఏది చేసిన పర్ఫెక్ట్ గా చేస్తాను అంటాడు, అప్పుడు కుదగాయల లిస్ట్ తీస్కుని ఆయిల్ అనే సరికి ఆయిల్ 2 kg అంటాడు అప్పుడు రాజ్ నానమ్మ ఒరేయ్ ఆయిల్ kg లలో కాదు రా లీటర్లు లో కొలుస్తారు అంటుంది, అప్పుడు రాజ్ కార్ కోసం వెళ్తుంటే అప్పుడు అపర్ణ ఒరేయ్ కార్ లేదు నువ్వు కాళీ నడకన వెళ్లి కూరలు తీసుకురా అంటుంది.
ఆఫీస్ లో ఎంపీలోయ్స్ కావ్య రాజ్ లలో ఎవరు ఆఫీస్ కి వస్తారని పందాలు వేసుకుంటారు…………..
కావ్య ఆఫీస్ కి వస్తుంది, అందరు కావ్య రాజ్ లలో ఎవరు ఆఫీస్ కి వస్తారని పందాలు వేసుకుంటూ ఉంటారు ఈ లోగ కావ్య వచ్చి అందరు పందాలు పెట్టుకుంటున్నట్టున్నారు అంటుంది, అందరు చూసి షాక్ అవుతారు సారీ మేడం అని చెప్తారు, అందర్నీ తితి పని చూసుకోమని పంపించేస్తుంది, కావ్య శృతి తో మీ సర్ ఇంకా రాలేదా అంటుంది, అందుకే కదా మేడం పందాలు వేసుకున్నాం, అంటే నిన్న అయన చేసిన గొడవకి మిమ్మల్ని పంపించే వరకు వదలరు అంటుంది, అప్పుడు కావ్య అదంతా నేను చూస్కుంటా గాని మనల్ని వద్దనుకుని వెళ్లిన పోయిన కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి మీటింగ్ కి ఆరెంజ్ చెయ్యి అంటుంది.
రాజ్ ఎలా అయినా టార్చెర్ పెట్టి ఆఫీస్ కి వెళ్లేలా చెయ్యాలని చూస్తున్న రాజ్ నానమ్మ అపర్ణ లు….
కావ్య అపర్ణ వాళ్ళకి ఫోన్ చేస్తుంది, అప్పుడు అపర్ణ చెప్పండి సీఈఓ గారు అంటుంది, అప్పుడు కావ్య అంత ఎటకారం ఎందుకు అత్తయ్యగారు అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ నిజమే కదా కానీ ఆ నిజాన్ని రాజ్ జీర్ణించుకోలేక పోతున్నాడు అంటుంది, అప్పుడు కావ్య మీరు ఎందుకో తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది అత్తయ్య, అయన బడదు పడుతున్నారు కదా అంటుంది, అప్పుడు అపర్ణ వాడు బడా పడతాడని కంపెనీ నష్టాల్లో ఉంటె చూస్తూ ఊరుకోవాలా, వాడు నిన్ను అపార్థం చేస్కుని చెయ్యని తప్పుకి బాధపెడుతుంటే చూస్తూ కూర్చోవాలా, అయినా నువ్వు ఇప్పుడు ఆనందం గా ఉండాలి అంటుంది, అప్పుడు కావ్య అయన రాకుండా ఎలా ఇవన్నీ జరుగుతాయి అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ వస్తాడు అవన్నీ మేము చూస్కుంటాము, నువ్వు ఇవన్నీ ఆలోచించడం మానేసి ఆఫీస్ పని చుస్కో అంటుంది, అప్పుడు అపర్ణ నా కోడలు ఎంత పిచ్చిదో వాడు అంత బడా పెట్టిన వాడి కోసమే ఆలోచిస్తుంది అంటుంది, అందుకే అత్తయ్య కొడుకని కూడా చూడకుండా టార్చెర్ చెయ్యాలి అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ అందుకే గా కనకాని అక్కడ పెట్టాం అంటుంది.
రాజ్ ని కలసిన కనకం, మీ మాట మీ కూతురు మాట అస్సలు వినను అని చెప్పేసిన రాజ్……….
రాజ్ కూరగాయల మార్కెట్ కి వెళ్లి ఒక షాప్ దగ్గరకు వెళ్తాడు, కనకం రాజ్ ని దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది, అప్పుడు రాజ్ కూరగాయల లిస్ట్ తీసి గుమ్మడికాయ ఎంత అంటాడు , అప్పుడు షాప్ అతను ఎంత బాబు వంద రూపాయలే అంటాడు, అప్పుడు రాజ్ ఏంటి అంతేనా ఇంత చిన్న ఆపిల్ నే 50 ఉంటె కనీసం దీనికి 200 అయినా తీసుకోవాలి ఇలా అయితే ఎలా భ్రాతుకుతావ్ బాబు అంటాడు షాప్ అతన్ని, షాప్ అతను మనసులో బాగా డబ్బున్న అమాయకుడిలా ఉన్నాడు ఈ రోజు నా పంట పండినట్టే అనుకుని, అవును బాబు మా ఆవిడా కూడా నన్ను అందుకే తిడుతుంది, మీకు కాబట్టి సగం రేట్ కె ఇచ్చేస్తున్నాను అంటూ టమాటాలు మీకు కాబట్టి 350 కె ఇస్తాను మాములుగా అయితే 400 అంటాడు, అప్పుడు రాజ్ నాకు కాబట్టి ఏనాడూ నేను నీకు 400 రూపాయలే ఇస్తాను అంటూ కూరగాయల్ని ఫోన్ తో స్కాన్ చేస్తాడు, కూరగాయలు అన్ని తీసుకున్నాక బిల్ ఎంత అయింది అంటాడు, అప్పుడు షాప్ అతను 6000 అయింది అంటాడు, అప్పుడు అంత తక్కువ అంటూ ఆ డబ్బులు ఇస్తుంటాడు రాజ్, అది చూసి కనకం వచ్చి షాప్ అతనితో ఏరా మా అల్లుడు 600 కూడా ఖరీదు చెయ్యని కూరగాయకు అంత చెప్తావా, మా అల్లుడు ఎంత కాలీగా ఉంది ఏరి ఏరి కూరగాయలు కొంటె మాత్రం అంత డబ్బులు తీస్కుంటావా అంటుంది, అప్పుడు రాజ్ నేను ఇప్పుడు కాలీగా ఉన్న అని మల్లి చెప్పాలా అంటాడు,ఆ ప్పుడు కనకం అది కాదు బాబు వీడి మిమ్మల్ని మోసం చేస్తున్నాడను అంటుంది, అప్పుడు రాజ్ మీరేం చేసారు కాన్సర్ కనకం గారు, మీకు కాన్సర్ ఉందని జారిపోయే పొద్దని అబద్దం చెప్పి మోసం చెయ్యలేదా, అప్పుడు కనకం ఆ తప్పు నేనే చేశాను బాబు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు, ఆ ముక్కే అప్పుడే చూపడం అంటే గ్యాప్ ఇవ్వకుండా కడిగి పడేసారు అంటుంది, అప్పుడు రాజ్ ఇప్పుడు మాత్రం ఎలా ఇస్తాను అనుకున్నారు, మిమ్మల్ని మీ కూతుర్ని ఇంకా జన్మ లో నమ్మను అంటాడు, అప్పుడు కనకం బాబు నేను చేసిన తప్పుకి నా కూతుర్ని నిందించకూడదు అంటూ వెటకారం గా జోకులు వేసుకుంటూ కావ్య తప్పేం లేదు అని అర్ధం చేస్కుని ఆఫీస్ కి వెళ్ళండి బాబు అంటుంది, అప్పుడు రాజ్ మీరు మీ కూతురు ఉన్న ప్లేస్ లో అడుగు పెట్టేదే లేదు అంటూ కూరగాయలు తీస్కుని పంతానికి 6000 ఇచ్చి ఈవిడని అస్సలు నమ్మకు కూరగాలను పిన్నీసు తో పొడిచి పూచులని చెప్పి తక్కువకి తీసేసుకుంటుంది అంటాడు రాజ్.
బుసినెస్ మీట్ కి నిరాకరించిన కంపెనీ లు…..
శృతి కావ్య దగ్గరకి వచ్చి మీటింగ్ కి ఎవరు రాము అంటున్నారు మాడెం మన కంపెనీ మీద వాళ్లకు నమ్మకం లేదు మనతో కలిసి బుసినెస్ చెయ్యము అని చెప్పేసారు మేడం అంటుంది, ఈ లోగ కావ్య కి అనామిక ఫోన్ చేస్తుంది, మొదటి సారి నువ్వు సీఈఓ గా భాద్యతలు తీస్కుని నువ్వనుకున్నది జరగ;లేదని భాద పడుతున్నావా అంటుంది, అప్పుడు కావ్య ఓ అప్పుడే నా విషయాలు తెసులుకున్నావా అంటుంది, అప్పుడు అనామిక నిన్ను ఓడించడమే నా పని కాబట్టి నీ గురుంచి ఆలోచించ ఇంకెవ్వరి గురుంచి ఆలోచిస్తాను చెప్పు అంటుంది కావ్య తో, అప్పుడు అనామిక నీ కంపెనీ క్లైంట్స్ ని నేను లాక్కున్నాను అందుకే వాళ్ళు మీ కంపెనీ కి రాము అనేసారు అంటుంది అనామిక.