ప్రధాని మోడీ ప్రధాని మోడీ 2014 నుంచి ప్రతి సంవత్సరం మన భారత సరిహద్దుల్లో ఉన్న సైనికులతోనే దీపావళి పండగని జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం కూడా సైనికులతో దీపావళి జరుపుకుని ప్రధాని మోదీ వరుసగా 11వ సారి దీపావళిని సైనికులతో జరుపుకున్నారు. అలాగే ప్రతీ సంవత్సరం దీపావళి వేడుకల్లో మన సైనికులు మన భారత దేశ సరిహద్దు అవతల ఉన్న దేశాల సైనికులకు స్వీట్లు పంచుతారు. అలా ఇతర దేశాలతో సైనికుల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి, స్నేహ భావం పెంపొందుతోంది.
ఇదే సమయంలో ప్రధాని మోదీ సైతం.. వారితో దీపావళి జరుపుకుంటుండటం వల్ల సైనికుల్లో ఆత్మీయతా భావం పెరుగుతోంది. ప్రధాని మనతోనే ఉన్నారనే భావన పెరుగుతోంది. కచ్ లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలోని అంగుళం భూమి విషయంలో కూడా తమ ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు, సాయుధ దళాలే భారత దేశ బలమని ప్రధాని మోదీ (narendra modi) అన్నారు. ప్రపంచం మిమ్మల్ని చూసినప్పుడు భారత్ బలం కనిపిస్తుంది. మన ప్రత్యర్థులు మిమ్మల్ని చూసినప్పుడు, వారు వారి దురుద్దేశపూరిత ప్రణాళికలకు ముగింపును చూస్తారు. మన విధానాలు మన సాయుధ దళాల సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ భారతీయ సైనికులతో అన్నారు.