వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనలో కుట్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు, ఇప్పటికే 16 మందినే రిమాండ్ కు తరలించారు, కొందరు దాడికి తమను ప్రోత్సహించారని నిందితులు చెప్పారన్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు, దాడి ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, దాడుల విషయంలో బిఆర్ఎస్ వైఖరిని ఆయన తప్పు పట్టారు, వికారాబాద్ జిల్లా దుద్ద్యాల మండలం లగజచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర గా పరిగణించింది, 100 మందికి పైగా దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు 16 మందిని రిమాండ్ కు తరలించారు మరో 57 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు, రాజకీయ దురుద్దేశంతో దాడి జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు లగచర్లకే చెందిన సురేష్ రాజ్ ప్రధాన కుట్రదారుగా పోలీసులు తేల్చారు, హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్న సురేష్ రాజ్ కొన్ని రోజులుగా లగచర్ల పరిసరాల్లోనే మకాం వేసి స్థానికుల్ని రెచ్చగొట్టి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సురేష్ పై మూడు నాన్ బేలబుల్ కేసులు నమోదు చేసి ప్రధాన నిందితుడిగా చేర్చామని వెల్లడించారు, పరారీలో ఉన్న సురేష్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామని వెల్లడించారు, కొడంగల్కు చెందిన కీలక నేతతో సురేష్ ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తించినట్లు సమాచారం, ప్రధాన నిందితుడిని పట్టుకుంటే కుట్రకోణం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు, కేవలం సురేష్ అనే వ్యక్తి ఒక ట్రాప్ లాగా ముందస్తు ప్రణాళికతో అక్కడ చాలా మంది యువకులను పెట్టుకుని కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి తీసుకెళ్లడం ముందస్తు ప్రణాళికతో ఈ అటాక్ చేసినట్టుగా మేము భావించి, మూడు కేసులు నమోదు చేయడం జరిగింది 16 మందిని ఇప్పుడు రిమాండ్ చేశాం అన్నారు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ టీములు నడుస్తున్నాయి అన్నారు , సురేష్ రాజు అనే వ్యక్తి కాల్ డేటాని కూడా ఇప్పటికే అనాలసిస్ చేయడం జరిగింది ఎవరైతే కుట్రపూరితంగా ఆ వాళ్ళు చేశారు అనేది ప్రాథమికంగా కొంత నిర్ధారణ అయింది అన్నారు, మిగతాది ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది అన్నారు, టూ త్రీ డేస్ చాలా మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఎవరైతే ప్రేరేపణ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అన్నారు.