విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్లో….

విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్లో ఉత్తరాఖండ్ టాస్ గెలిచింది, దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు సరైన ఆరంభం దొరకలేదు, ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో కూడా ఆంధ్ర జట్టు కు గెలుపు లేదు, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లతో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది.

ఉత్తరాఖండ్ తరపున ఆడిన వాళ్లలో పేన్షు ఖండూరి 272 బంతుల్లో 107 స్కోర్ చేశారు ఇందులో 11 ఫోర్లు కూడా కొట్టారు, అలాగే ఓపెనర్ అవినీష్ 158 బంతుల్లో 86 స్కోర్ చేసి 12 ఫోర్లు కొట్టారు, వీళ్ళిద్దరూ కలిసి మొదటి వికెట్ లోనే 157 పరుగులు స్కోర్ చేసి ఉత్తరాఖండ్ కు ఒక మంచి పునాది వేశారు.

 అంతేకాకుండా ఫియాన్షకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది రెండో సెంచరీ గా సాధించారు, శతకానికి దగ్గరగా ఉన్న అవినీష్  ను లలిత్ మోహన్ అవుట్ చేశారు.

Scroll to Top