వేరుశనగ గురుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు…..!
డెయిలీ డైట్లో నట్స్ తింటే గుండె సమస్యలు వచ్చే రిస్క్ చాలా వరకూ తగ్గుతుందని చెబుతారు. పల్లీలు మీ గుండెకి చాలా మంచివి, పల్లీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో హెల్దీ విటమిన్స్, ఖనిజాలు, సమాన పరిమాణంలో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. పల్లీల్లో 16 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అయితే, వీటికి అదనంగా పల్లీల్లో ఎక్కువగా బి విటమిన్స్ కూడా ఉంటాయి.
నానపెట్టిన వేరుశనగ తింటే….?
రోజూ ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం. అలాగే వేరుశనగలలోని ఇతర పోషకాలు ఎముకల దృఢత్వానికి, చర్మ ఆరోగ్యం కోసం, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అయితే వేరుశనగలను నానబెట్టుకొని తినడం వలన వాటిలోని పోషక విలువలు మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేరుశనగలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా పరిగణిస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం 100 గ్రాముల వేరుశనగలు 25.8 గ్రాముల ప్రొటీన్లను అందిస్తాయి. నానబెట్టిన వేరుశెనగలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూడండి.
అయితే ఈ నానపెట్టిన శనగలను ఎప్పుడు తీసుకోవాలి….?
డైటీషియన్ల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం ఒక గుప్పెడు నానపెట్టిన వేరుశనగలను అల్పాహారానికి ముందు తీసుకోవాలి. అలాగే ఎప్పుడైనా ఆకలివేసినపుడు గానీ, లేదా భోజనాల మధ్య కూడా వేరుశనగలను చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. ఇలా నానబెట్టిన వేరుశనగలను సరైన సమయంలో తింటే, వాటిలోని పోషకాలు మన శరీరంలోకి పూర్తిగా శోషణ చెంది గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
వేరుశనగలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. నానబెట్టిన వేరుశనగ కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది, కండరాల క్షీణతను నివారిస్తుంది. దృఢమైన శరీరాన్ని కోరుకునేవారు ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలను తినడం ప్రయోజనకరం. ఉదయం పూట వేరుశనగ మొలకలుగా కూడా చేసుకుని తినవచ్చు. ప్రోటీన్లతో పాటు, ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి.
వెన్నునొప్పిని కూడా దూరం చేస్తుంది….
రోజంతా కూర్చోవడం వలన వెన్నునొప్పి సమస్యలు పెరుగుతున్నాయి. ఈరోజుల్లో చాలా మంది ఇంటి నుంచే పనిచేయడం, పెరిగిన పనిభారం కారణంగా అది శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిని బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గడం తో పాటు తినడానికి కూడా అల్పాహారంగా బాగుంటుంది.
చర్మానికి నిగారింపు ఇచ్చే ఈ వేరుశనగలు…….
వేరుశనగలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మేలు చేస్తాయి. నానబెట్టిన వేరుశనగలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ చర్మానికి అద్భుతమైన మెరుపు వస్తుంది.
కంటి చూపును నయం చేసేందుకు వేరుశనగలు…
ఈరోజుల్లో అందరు చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు కళ్ళజోడు తో బడా పడుతున్నారు, వేరుశనగలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇలా మరెన్నో రకమైన ప్రయోజనాలు ఈ వేరు సనగలవల్ల ఉన్నాయ్.