సముద్రగర్భంలోనూ అన్వేషణలకు శ్రీకారం చుట్టింది భారత్………మత్స్య 6000

ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా టెక్నాలజీ విష్యం లో ముందడుగు వేస్తుంది, ఆకాశ నౌకలు కాకుండా భూగర్భ నౌకులను కూడా ఆవిష్కరించడం లో చక చక పరుగులుతీస్తుంది, సముద్రగర్భంలోనూ అన్వేషణలకు శ్రీకారం చుట్టింది. సముద్రయాన్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది.దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మెషిన్ ను కూడా భారతదేశం సిద్ధం చేసింది. ఇక ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ లో ప్రయాణం చేసే సభ్యుల కోసం ప్రత్యేక ఆహారాన్ని కూడా డిఆర్డిఓ సిద్ధం చేసింది. సంక్లిష్ట సమయంలో 96 గంటల పాటు సిబ్బంది దీనిలో ఉండేలా ఏర్పాట్లు కూడా చేసింది, మొత్తం దీనిలో 67 ఆక్సిజన్ సిలిండర్లు పనిచేస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలోకి వెళ్లడానికి మూడు గంటలు, రావడానికి మూడు గంటల పాటు, సముద్ర గర్భంలో పరిశోధన చేయడం కోసం ఆరు గంటలు ఉండేలాగా ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ ను రూపొందించారు. సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశంలో 108 గంటలు ఈ వెహికల్ ఉండగలుగుతుంది.

                          అయితే ఈ సబ్ మెర్సిబుల్ వెహికల్ మత్స్య పై సముద్ర గర్భంలోకి వెళ్ళినప్పుడు 6000 మీటర్ల కిందకు వెళితే 596 రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది దాదాపు 1848 ఏనుగుల బరువుకు సమానంగా ఉంటుందని సమాచారం . దీని తయారీ కోసం 80 ఎంఎం మందంతో ఉన్న టైటాన్ అలాయ్ ను వాడారు.

                                        దాదాపు 2.1 మీటర్ పొడవు ఉన్న ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లి పాతాళ లోకాలను అన్వేషించనుంది. భవిష్యత్తులో సముద్రగర్భ పర్యాటక అభివృద్ధి కోసం కూడా దీనిని వినియోగించనున్నారు..మత్స్య 6000 సముద్ర జలాల్లోకి పంపించడానికి సాగర్ నిధి అనే రీసెర్చ్ నౌకను కూడా సిద్ధం చేశారు. ఇది నీటి ఉపరితలంపై నుంచి ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ కు సహకరిస్తుంది.

                                            ఇక ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం ఉన్న దేశాల చెంత భారత్ కూడా చేరుతుంది. ఇప్పటికే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాలకు ఉంది. ఇక ఈ దేశాల చెంత భారత్ కూడా సగర్వంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం మన దేశం దాదాపు 4077 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. ఇది సక్సెస్ అయితే గగనతలాన్నే కాదు పాతాళ లోకాలను కూడా అన్వేషించే శక్తివంతమైన దేశంగా భారతదేశం నిలుస్తుంది.

Scroll to Top