సీజనల్ ఫ్రూట్ గా పిలవబడే ఈ సీతాఫలం ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు తెసులుకుందాం…!

సీజనల్ ఫ్రూట్ గా పిలవబడే ఈ సీతాఫలం గురుంచి మీకు తెల్సా…..?

సీతాఫలం ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే పండు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. నోటికి తియ్యని రుచి.. మెత్తగా ఉండటంతో ఖర్చు ఎక్కువైన సరే దీనిని తినడానికే ఇష్టపడతారు. సాధారణంగా మనం సీతాఫలాన్ని ఆకుపచ్చ రంగు తొక్క, తెల్లటి గుజ్జు, నల్లటి గింజలతోనే చూస్తాం. కానీ చాలా ప్రాంతాల్లో ఇవి ఎరుపు రంగులో కూడా ఉంటాయి. పర్పుల్, పింక్ కలర్‌లో కూడా కనిపిస్తాయి.సీతాఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనిలో పోషకాల మెండు. ఈ పండులో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నిషియం ఎన్నో ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. ఈ ఫలంలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఎన్నో రోగాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. సీతాఫలంలో ఉండే పొటాషియం, మెగ్నిషియం బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. సీతాఫలంలో ఉండే కారెనాయిక్ యాసిడ్ వాపుల్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. చర్మ కండరాలు బిగుతుగా ఉండేలా చేస్తాయి.

ఎంతో మధురంగా ఉండే ఈ సీతాఫలాలు ఎలాంటి వారు తినకూడదో తెల్సుకుందాం…!

నోటికి తియ్యని రుచి, మెత్తగా ఉండే ఈ సీతాఫలాలు ఎలాంటి వారు తినకూడదో తెల్సుకుందాం, అయితే, ఎన్నో పోషకాలు ఉన్న సీతాఫలంని కొందరు తినకూడదు. ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. కొందరు మాత్రం సీతాఫలానికి దూరంగా ఉండాలి. ఈ సీజన్‌లో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో బాధపడతారు. ఇలాంటి వారు సీతాఫలానికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. సీతాఫలం తింటే జలుబు వచ్చే ప్రమాదముంది. ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువ తినకూడదు. ఉబ్బరం సమస్యలు ఉన్నవారు.. దీనిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సీతాఫలంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు ఎక్కువగా తింటే కొందరికి తీవ్ర‌మైన క‌డుపు నొప్పి వ‌స్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణమవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఎక్కువగా తినడం వల్ల విరోచనాల సమస్యతో బాధపడే అవకాశం ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తినకపోవడమే బెటర్. ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలానికి దూరంగా ఉండాలి. ఈ పండు అతిగా తింటే అలర్జీ వచ్చే ప్రమాదముంది. ఈ పండు తినేటప్పుడు కొందరు.. తొక్క కూడా తింటారు. దీంతో.. దురదతో బాధపడతారు. చిన్న పిల్లలకు తినిపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా.. గింజల్లోని కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సీతాఫలం తెల్లటి గుజ్జు, నల్లటి గింజలతో ఉంటుంది. ఇది తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గింజలు గొంతుకు అడ్డు పడే ప్రమాదముంది. సీతాఫలంలో అనోనాసిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది ఎక్కువ తినడం వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తాయి. నరాల సమస్యలు, బలహీనతతో బాధపడుతూ మెడిసిన్ తీసుకునే వారు.. సీతాఫలాలకు దూరంగా ఉండాలి.

Scroll to Top