హైదరాబాద్ లో మెట్రో వాళ్ళ చాలా వరకు ట్రాఫిక్ లో సేఫ్ అవుతున్నారనే చెప్పాలి, అంతే కాదు మెట్రో ప్రయాణం సులభతరం మరియు సుఖవంతం అయినది, టైం కూడా సేవ్ అవుతుంది, అయితే హైదరాబాద్ మరో మెట్రో లైన్ ప్రారంభం చేయనున్నారు అనే వార్త చాల రోజుల నుంచి వినిపిస్తుంది, కానీ ఇంత వరకు అది అమలు చేయకపోవడానికి కారణం ఉంది, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నష్టాల్లో కొనసాగుతున్నందున రెండో దశ నిర్మాణానికి ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేకపోతున్నాయని ఆ సంస్థ ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.
ప్రతి ఏడాది 1300 కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రోకు 6000 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని తెలియజేసారు, హైదరాబాద్లోని ఆడిట్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన ఆడిట్ వీక్ కార్యక్రమానికి హాజరైన ఎన్విఎస్ రెడ్డి హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రస్థానంపై మాట్లాడారు, మిగతా రాష్ట్రాల తరహాలో ప్రభుత్వమే మెట్రో రైలు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు.