మూసి నది సుందరీకరణకు మార్గదర్శకాలు చేపాట్టారు, మూసి ఎఫ్ టిఎల్ బఫర్ జోన్ లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అక్రమ నిర్మాణాలను తొలగించడం సహా కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది, మూసి సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది. మూసి నది గర్భం బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో చట్ట విరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలని ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగు నీరు కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది, ఇదే సమయంలో సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి మూసి పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితం అవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది. ఆక్రమణలో ఉన్న పట్టా భూములు శిఖం భూములు అయితే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూ యజమానులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించారని అధికారుని ఆదేశించింది. మూసి పునరుజ్జీవనలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడం కూల్చివేతల్ని సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు, ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నింటిని పరిష్కరిస్తూ నివాసాల్ని ఖాళీ చేయించేందుకు ఆక్రమణాలను తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
మూసి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ రివర్ బెడ్ జోన్లలోని ఆక్రమణ దారుల నిర్మాణాలను తొలగించే సమయంలో పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలని ఖచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానం తెలిపింది. మూసి రివర్ బెడ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లోని తాత్కాలిక అనధికారిక నిర్మాణాల్ని నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది 2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చెరువుల పరిరక్షణ సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో భూ కేటాయింపుల విధానం తీసుకొచ్చిందని వివరించింది, ఆ విధానం ప్రకారం సహజకొండ ప్రాంతాలు నదులు రివర్ బెడ్లను కేటాయింపులు జరపరాదని పేర్కొంది, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా చెరువుల రక్షణకు జీవ 99 ద్వారా ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది, తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.