కార్తీక దీపం Serial Today Episode(15-05-24)

కార్తీక దీపం  సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. బాబాయ్ హోటల్ లో దీప పెట్టిన ఉప్మా తిన్న కార్తీక్ చాల బాగుంది ఎలా చెయ్యాలో మాకు చెప్తే మా రెస్టారెంట్ లో ట్రై చేస్తాం అంటాడు, కార్తీక్ ఉప్మా కి డబ్బులు ఇవ్వబోతుంటే దీప ఉప ఫ్రీ నే బాబు అంటుంది, అప్పుడు బాబాయ్ మీ అకౌంట్ 499 రూపాయలు ఉంది బిల్ అంటాడు, అప్పుడు కార్తీక్ అవి అలానే ఉండనివ్వండి నేను మల్లి వస్తాను తినడానికి అంటాడు, దీప ని ఇక్కడ ఏమైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి అంటాడు కార్తీక్, అప్పుడు దీప మీకు ఇంకా ఇక్కడ ఏమైనా పని ఉండ బాబు అంటుంది కార్తీక్ ని, అప్పుడు కార్తీక్ లేదు అంటాడు, అప్పుడు దీప ఇంకా మీరు వెళ్లవచు బాబు అంటుంది, కార్తీక్ నేను రేపు కూడా తినడానికి వస్తాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. జరిగిన గొడవ గురుంచి ఆలోచిస్తున్న జ్యోత్స్న దగ్గరకి సుమిత్ర పలు తీస్కుని వెళ్తుంది, అప్పుడు జ్యోత్స్న సారీ మమ్మీ నీకు ఆలా ఎదురు చెప్పకుండా ఉండాల్సింది అంటుంది, అప్పుడు సుమిత్ర నేను అర్ధం చేసుకుంటాను జ్యోత్స్న అంటుంది, అప్పుడు జ్యోత్స్న నన్ను అర్ధం చేస్కున్నదానివే అయితే నాలా ఎందుకు ఆలోచించడం లేదు మమ్మీ అంటుంది, అప్పుడు సుమిత్ర నిన్న జరిగిన దాని గురుంచి ఎం ఆలోచించకు వదిలేసే  అంటుంది, అప్పుడు జ్యోత్స్న వదిలేసే అంత చిన్న మాటలు వాడు అనలేదు మమ్మీ అంటుంది, అప్పుడు సుమిత్ర వాటిని గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు అంటుంది, అప్పుడు జ్యోత్స్న నాకు అయితే ఉంది మమ్మీ అంటుంది, సుమిత్ర దీప అలంటి మనిషి కాదు అంటుంది, అప్పుడు జ్యోత్స్నఅంటే బావ అలాంటోడ ఇప్పటికి వాడి మాటలు నేను మర్చిపోలేక పోతున్న మమ్మీ ఎందుకు దీప అంతలా వెనకేసుకొని వస్తున్నావ్ అంటుంది, అప్పుడు సుమిత్ర, దీప కి ఈ ఇంటికి ఈలాటి సంబంధం లేదు కానీ నాకు దీప చాల దగ్గర అయిపొయింది, మన మనిషిలా అనిపిస్తుంది అంటుంది, దీప పరిస్థిని చూసి జాలి పడుతున్నానా లేదా అంత అనుభందం మా ఇద్దరిమధ్య కలిగిందా నాకు అర్ధం కావడం లేదు, దీప జీవితాన్ని చక్కదిద్ది అయినా ఏమైనా చెయ్యాలని ఉంది అంటుంది, అప్పుడు జ్యోత్స్న సరే నువ్ చేస్తుంది సాయం అని అర్ధం అవుతుంది, కానీ బావ చేస్తుంది ఆలా అనిపించడం లేదు నాకే ఇలా ఉందంటే బయట వాళ్ళకి ఇలానే అనిపిస్తుంది కదా అందుకే న బాధ ని  అర్ధం చేసుకోమంటున్నాను, దీప మీద నాకు ఏ కోపం లేదు మమ్మీ, కానీ ఇంత జరిగిన తర్వాత తనంటే ఏంటో నాకు అర్ధం అయింది అంటుంది కానీ నీకే అర్ధం కావడం లేదు అంటుంది, అప్పుడు సుమిత్ర ఒకే విషయాన్ని ఇంతలా ఆలోచిస్తే ఇలానే ఉంటుంది అంటుంది, ముందు నువ్వు రెస్ట్ తీసుకోవాలి నేను నీ కంటే ఎక్కువగా దీప ని సపోర్ట్ చేస్తున్నాను అని నువ్ ఫీల్ ఔతున్నావ్, నువ్ నా కన్నా కూతురువి నీ కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు కానీ దీప కూడా నాకు ముఖ్యమే అంటుంది సుమిత్ర, అలాగని దీప కన్నా కూతురు కాలేదు కదా ఈ వ్యత్యాసం నీకు అర్ధం అయితే  ఈ గొడవలు ఉండవు అంటుంది సుమిత్ర.

                                                                                                      దశరద్ రూబిక్ క్యూబ్ ని సెట్ చేస్తూ ఉండగా సౌర్య వచ్చి తాతయ్య ఎం చేస్తున్నారు అంటుంది, అప్పుడు దశరద్ నన్ను దిస్తుర్బ్ చెయ్యకు నేను ఇది సెట్ చేస్తున్నాను అంటాడు, అప్పుడు సౌర్య నేను చేస్తాను తాతయ్య అని ఆ క్యూబ్ ని సెట్ చేస్తుంది ఈ లోగ కార్తీక్ వచ్చి హాయ్ మావయ్య ఏం చేస్తున్నారు అంటాడు అప్పుడు దశరద్ సౌర్య చాల తెలివిడి ఏమైనా మంచి స్కూల్ లో జాయిన్ చేయించాలి అంటాడు , అప్పుడు కార్తీక్ ఇక్కడున్న కాపిటషన్ కి సౌర్య వీలతో పోటీ పడలేదేమో మావయ్య అంటాడు కార్తీక్, అప్పుడు దశరద్ రూబిక్ క్యూబ్ ని చూపించి ఇది నీకు సెట్ చెయ్యడానికి ఎంత టైం పడుతుంది అంటాడు అప్పుడు కార్తీక్ 2  స్టెప్స్ వరకు ఒకే తర్వాత కష్టం మావయ్య అంటాడు అప్పుడు దాన్ని సౌర్య కి ఇస్తాడు దశరద్ అప్పుడు మల్లి సౌర్య దాన్ని సెట్ చేస్తుంది, దాన్ని చూసి కార్తీక్ కూడా షాక్ అవుతాడు, అప్పుడు మంచి స్కూల్ లో జాయిన్ చేద్దామని దశరద్, కార్తీక్ లు నిర్ణయించుకుంటారు, అప్పుడు సౌర్య ఇప్పుడే న అమ్మ కి చెప్పాలి గ అంటుంది, అప్పుడు దశరద్ వాళ్ళ అమ్మ హోటల్ లో పనిచేస్తుంది కదా అక్కడికి వెళ్లి చెప్పి తీసుకువెళ్ళు అంటాడు, అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మ కి చెప్తే న కూతుర్ని మా స్థాయి కి తగ్గట్టు నేను చదివించుకుంటాడు మీ సాయం మాకు అవసరం లేదు అంటుంది అంటాడు కార్తీక్, అప్పుడు దశరద్ చెప్పకుండా తీసుకెళ్తే ఏమైనా అంటుందేమో అంటాడు, అప్పుడు కార్తీక్ అత్త తీస్కెళ్ళామండి అని చెప్దామ్ అంటాడు, అత్త పేరు చేతే వీళ్ళ అమ్మ ఏమి అనదు మావయ్య అంటాడు కార్తీక్ అప్పుడు సౌర్య ని ఏ రౌడీ నువ్ మీ అమ్మ కి చెప్పొద్దూ అంటాడు, అప్పుడు సౌర్య చెప్తే అంటుంది, అప్పుడు కార్తీక్ చెప్తే మన ఫ్రెంషిప్ కట్ అంటాడు, అప్పుడు సూర్య చెప్పను అడిగితే చెప్తాను అంటుంది, అప్పుడు కార్తీక్ అన్నిటికి బలే తప్పించుకుంటావే అంటాడు కార్తీక్, అప్పుడు సౌర్య కార్తీక్ లు స్కూల్ కి వెళ్ళడానికి బయటకు వస్తారు కార్ ఎక్కుతుండగా దీప ఇంటికి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావ్ సౌర్య అంటుంది అప్పుడు సౌర్య ఎం మాట్లాడు అప్పుడు కార్తీక్ ఏం లేదండి సౌర్య ని స్కూల్ లో జాయిన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను అంటాడు అప్పుడు దీప మిమ్మల్ని తీసుకెళ్లామని నేను చెప్పలేదు కదా బాబు అంటుంది దీప కార్తీక్ తో, అప్పుడు కార్తీక్ మా అత్త చెప్పించి అంటాడు కార్తీక్, మన ఇంటికి దగ్గర్లోనే పెద్ద స్కూల్ ఉంది దాంట్లో జాయిన్ చెయ్యమని అత్త చెప్పింది అంటాడు అప్పుడు దీప నేను తీసుకెళ్తాను, నా మీద న బిడ్డ మీద కానీ ఎలాంటి జాలి చూపించొద్దు బాబు అంటుంది దీప కార్తీక్ తో, వాళ్ళని చూసి పారిజాతం జ్యోత్స్న తో తప్పుగా చెప్తుంది, జ్యోత్స్న దీప కార్తీక్ ల గురుంచి లేని పోనివి చెప్పి రెచ్చకొడుతుంది పారిజాతం, తొందర పడక పోతే  నువ్వే నష్టపోతావ్ అంటుంది.

Scroll to Top