సార్వత్రిక ఎన్నికల ఐదవ విడత కేంద్ర ఎన్నికల సంగం డేటా ప్రకారం సోమవారం అర్దరాత్రి వరకు 60.09 % పోలింగ్ నమోదు అయింది.
సార్వత్రిక ఎన్నికల ఐదవ విడత పోలింగ్ లో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు 49 నియోజక వర్గాలకు సోమవారం నిర్వహించిన పోలింగ్ లో 54 % మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు సినీ రాజకీయ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఓటును వినియోగించుకున్న వారిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, స్మృతి ఇరాన్, ప్రపంచ ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా మరియు అనిల్ అంబానీ వారి వారి కుటుంబాలతో సహా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు, అలాగే ప్రముఖ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరియు బాలీవుడ్ యాక్టర్స్ అయిన అక్షయ కుమార్, అనిల్ కపూర్, శబాష్ అజ్మీ, పరేష్ రావల్, జాన్వీ కపూర్, అనుపమ కేర్, రాజ్ కుమార్ రావ్, జావెర్ అక్తర్, షాహిద్ కపూర్ వంటి తదితరులు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగా ఉండే జమ్మూ & కాశ్మీర్ లో రికార్డు స్థాయిలో 59 % వోటింగ్ జరిగింది, ఉగ్రవాదుల దాడులు అధికం గా ఉండే ఈ నియోజక వర్గం లో 1984 లో 58.90 % పోలింగ్ నమోదు అయింది.
రాష్ట్రాల వారీగా చూసుకుంటే :
- పశ్చిమ బెంగాల్ లో అత్యధికం గా 76.05 % పోలింగ్ నమోదు అయింది.
- మహారాష్ట్ర లో అత్యల్పం గా 54.33 % పోలింగ్ నమోదు అయింది.
- బీహార్ లో 54.85 %
- జార్ఖండ్ లో 63.09 %
- ఒడిశా లో 69.34 %
- ఉత్తర్ ప్రదేశ్ లో 57.79 %
- కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడక్ లో 69.62 % పోలింగ్ నమూడు అయింది.
పోలింగ్ నమోదు అయింది మొత్తం 543 స్థానాలకు గాను ఇప్పటి వరకు 428 సీట్ల కు పోలింగ్ పూర్తి అయింది. మిగతా స్థానాలకు 6,7 విడతల్లో భాగంగా మే 25 , జూన్ 1 న ఓటింగ్ జరగనుంది.
పశ్చిమ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల్లో బ జ ప త్రొనముల కార్యకర్తలు దాడులు చేసుకోగా, మరికొన్ని చోట్ల ఈవిఎం లు పనిచేయకపోవడం వంటి ఇబ్బందులు మినహా పోలింగ్ ప్రశాంతం గా ముగిసింది, వివిధ అంశాలపై ఈసీ కి 1000 కి పైగా ఫిర్యాదులు అందాయి.