మొదటిగా అసెంబ్లీ లో జాతీయగీతాన్ని పూర్తి చేసి, శాసన సభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టడానికి ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల శేఖర్ ని ప్రవేశ పెట్టారు, అప్పుడు మొదిటిగా కూటమి సబ్యులకు శుభాకాంక్షలు చెప్పి గత ప్రభుత్వం వళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన లాభ నష్టాల గురుంచి తెలియ జేశారు. గత ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కి చేసిన ఆర్థిక నష్టం వల్లనే ఇంత ఆలస్యం అయింది అన్నారు, ప్రభుత్వం పరిపాలనకు వచ్చిన నాలుగు నెలలకు బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది అన్నారు, వై స్ ర్ సి ప్ భ్రాభుత్వం రాష్టాన్ని అప్పులపాలు చేసిందని, ఎక్కువ వడ్డీలతో రుణాలు తెచ్చి మొత్తం 10 లక్షల కోట్లు అప్పు చేశారని మరియు ప్రతి గృహానికి 8 లక్షల అప్పు భారాన్ని పెట్టారని అన్నారు, ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టడానికి న్ డి ఏ కూటమి నాంది పలికిందని అన్నారు, ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి చెయ్యడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ద్యేయం అని అన్నారు,
రెవెన్యూ వ్యయం అంచనా – రూ.2.34 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా – రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు
ద్రవ్యలోటు – రూ.68,743 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
జీఎస్డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
సంక్షేమం – రూ.4376కోట్లు
మహిళ, శిశు సంక్షేమం – రూ.4285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి – రూ. 1215కోట్లు
పాఠశాల విద్య – రూ. 29909కోట్లు
ఉన్నత విద్య – రూ.2326 కోట్లు
ఆరోగ్య రంగానికి – రూ.18421కోట్లు
పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి – రూ.16739 కోట్లు
పట్టణాభివృద్ధి – రూ.11490 కోట్లు
గృహనిర్మాణం – రూ. 4012కోట్లు
జలవనరులు – రూ.16705కోట్లు
పరిశ్రమలు వాణిజ్యం – రూ.3127కోట్లు
ఇంధన రంగం – రూ.8207కోట్లు
ఆర్ అండ్ బీ – రూ.9554కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1215 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక – రూ.322కోట్లు
పోలీస్ శాఖకు – రూ.8495 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.39,007 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు
పర్యావరణం, అటవీశాఖ రూ.687 కోట్లు