అరటి పండ్ల తో ఎన్నో ప్రయోజనాలు… కానీ వారికీ మాత్రం

అరటి పళ్ళు, పల్లెటూరు నుంచి సిటీ వరకు ఎక్కడయినా సరే ఎవరయినా సరే తినే పండు అరటి పండు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఇంకా వీటి ధర తక్కువనే చెప్పొచ్చు, ఇది చెట్టుకి ఒక గెల మాత్రమే కాస్తుంది, తర్వాత ఆ చుట్టును తీసేస్తారు, ఆ చెట్టుకు ఉండే కెపాసిటీ ని బట్టి గెలకు అన్ని ఆస్తాలు కాస్తాయి, అయితే అరటి పండ్లలో చాల రకాలు ఉన్నాయ్, దీనిని పండుగ తినొచ్చు, జ్యూస్ చేస్కోవచ్చు అలానే అరటి పండ్లలో కొన్ని రకాల వాటిని కూర వండు తయారు మరియు చిప్స్ ల కూడా  చేస్కోవచ్చు, ఇలా ఈజీ గ దొరికి అంతే  ఈజీ గా తినగలిగే ఈ అరటి పండ్లు గురుంచి మనం ఇప్పుడు తెల్సుకుందాం.

అయితే ఇప్పుడు అరటి పండ్లలో ఉండే పోషక విలువలు గురుంచి తెల్సుకుందాం, వంద గ్రాముల బరువుండే అరటి పండులో 0 శాతం కొవ్వు, 0 శాతం కొలెస్ట్రాల్, 258 మిల్లీగ్రాముల పొటాషియం, 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ B6, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, శరీరానికి శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం బాగా లభిస్తాయి.అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. పేగులోని ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది.అందులో ఉండే కరిగిపోయే గుణమున్న ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అరటి పండ్లలో అధిక ఫైబర్ కారణంగా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.అరటి పండ్లు పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్‌ల సమతౌల్యాన్ని కాపాడడంతో పాటు రక్త పోటు(బీపీ)ని నియంత్రిస్తుంది. పొటాషియం రక్తపోటును తగ్గించడమే కాకుండా, గుండెపోటు రాకుండా అడ్డుకుంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. వారానికి 2-3 అరటి పండ్లు తినే మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. అరటి పండ్లు కణ నష్టాన్ని నివారిస్తాయి.

యాంటీఆక్సిడెంట్స్ వల్ల అంతర్గత, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి అరటి పండు ఉపయోగపడుతుంది. వ్యాధులబారిన పడకుండా రక్షిస్తుంది.రోజుకో అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించి, క్యానర్స్‌తో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్ ఏర్పడటాన్ని అడ్డుకుని ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అరటి పండ్ల వల్ల చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే మాంగనీసులో 13 శాతం అరటి పండు సమకూరుస్తుంది. అరటి పండ్లలో విటమిన్-C కూడా ఉంటుంది. అరటి పండుతో కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలతోపాటు మొటిమలు, మచ్చలను సైతం దూరం చేసుకోవచ్చు. అరటి పండులో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి, చక్కెర వ్యాధి ఉన్నవారు తక్కువ పరిమాణంలో తినాలి. అరటి పండులో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు తక్కువ పరిమాణంలో తినాలి. అరటి పండులో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. అరటి పండులో ఉండే పొటాషియం మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి హాని కలిగించవచ్చు. రాత్రి పూట తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి తినే పరిమాణాన్ని నిర్ణయించుకోవడం మంచిది. ఏదైనా సందేహం ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.

Scroll to Top