ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరి పెన్నా నదుల అనుసందానం…..

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి కృష్ణ పెన్నారను అనుసంధానించి ఆంధ్రప్రదేశ్ ను కరువు రహితంగా మారుస్తామని సీతారామన్ కు చంద్రబాబు వివరించారు, ప్రస్తుతం పోలవరం ద్వారా గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తెస్తున్నామని అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడికాలువలోకి ఎత్తిపోసి బనకచర్లమీదుగా రాయలసీమకు తీసి తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యం అని తెలియజేసారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే భరించలేదన్న చంద్రబాబు గారు, కేంద్రం సహకరించాలని కోరారు, నదుల అనుసంధానానికి సాయంపై కేంద్ర మంత్రి మంత్రి నిర్మల సీతారాం సానుకూలంగా స్పందించారు, 60 వేల కోట్ల వరకు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని కోరారు, త్వరలో డిపిఆర్ సిద్ధం చేసి పంపుదామని చెప్పారు.

                                        తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ   గోదావరి పెన్నా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం పూర్తయితే ఆ నీటిని మనం పెన్నా దాకా తీసుకురావడానికి అన్ని ప్రణాళికలు కూడా చేయడం జరుగుతుంది. అయితే దానికి కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెకోరారు, ఎలా అయితే కెన్ బిట్వ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్స్ ప్రారంభించారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేంద్రం వైపు నుంచి సహాయ సహకారం అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మల సీతారాం గారిని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది అన్నారు.

Scroll to Top