వేరు వేరు మత విశ్వాసాలను అనుసరించే వారు రిజర్వేషన్ల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడంపై సుప్రీం కోర్ట్ వ్యతిరేకిస్తూ తీవ్రంగా మండిపడింది, అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని రాజ్యాంగాన్ని మోసం చేయడమేనంటూ స్పష్టికరించింది. వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది, క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించడం జరిగింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పు పట్టింది, ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో లో ప్రస్తావించింది, వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది, మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మతమార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం అయితే అనుమతించమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది, అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని బ్రిటిషనర్ అనుసరిస్తున్నారని చర్చకి వెళ్తున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసరం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు, కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడ ఆధారాలు సమర్పించలేదని సుప్రీం కోర్టు తెలిపింది, స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని పేర్కొంది. అయినా ఆమె తాను హిందువునని ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక దృపత్రం కోరుతున్నారని మండిపడింది, ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని స్పష్టం చేసింది, ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్ కు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలను సామాజిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది, ఈ కేసులో బ్రిటిషర్ సెల్వరాణి హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి జన్మించారు, మూడు నెలల వయసులో బాప్టిజం పొందారు 2015 లో ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని తన తండ్రి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ, ఎస్సీ ధ్రువ పత్రం కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది, దీన్ని ఆమె మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు, తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇచ్చారు.