కార్తీక దీపం Serial Today Episode(05/12/2024)

జరిగింది తెసులుకుని బాధ పడిన కాంచన…..

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, కార్తీక్ దీపాలు ఇంటికి వచ్చి కాంచన తో జరిగింది చెప్తాడు, తన తాతయ్య అన్న మతాల గురుంచి చెప్పాడు, దీప మ్యాచ్న్హితనం గురుంచి చెప్తూ తాను చేసిన సాయం గురుంచి చెప్తూ జరిగింది అంత చెప్తాడు, దానికి కాంచన మా నాన్న అనుకున్నది జరగలేదని ఆవేశం అంతేయ్ రా అంటుంది, అప్పుడు కార్తీక్ కావాలనే అయన జరిగింది జరగలేదని మీ అన్నయ్య మీ పిన్ని మీ నాన్న ఇలా పగపట్టారు, ఆ కోపం తోనే నన్ను సీఈఓ గ తీసేసి తన మనవరాలిని పెట్టుకున్నారు అంటాడు, అప్పుడు కాంచన బాధపడుతుంది, దీప కూడా తప్పు జరగకుండా మాటలు పడుతున్నామని కార్తీక్ బాబు కి కోపం వచ్చింది లే అమ్మ అంటుంది దీప, దీప ఈ ఆక్సిడెంట్ విష్యం లో పది సౌర్య గురుంచి మర్చిపోతుంది, అప్పుడు సౌర్య ని దీప హాస్పిటల్ లో ఏం జరిగింది, నీకు ఏమైనా టెస్ట్ లు చేశారా అని అడుగుతుంది, అప్పుడు సౌర్య లేదు అమ్మ ఏమి చెయ్యలేదు, నాన్న కి కూడా మందులు ఇవ్వడం మర్చిపోయారు నేనే గుర్తుచేసాను అంటుంది, అప్పుడు దీప కి అంటే కార్తీక్ బాబు తన కోసం హాస్పిటల్ కి వెళ్ళలేదు అని అనుమానం వస్తుంది.

సౌర్య గురుంచి నిజం తెసులుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న దీప….

దీప కార్తీక్ తో ఏం జరిగింది అని అడుగుతుంది, అప్పుడు కార్తీక్ ఏమి లేదు నువ్వు అనవసరం గా బయపడుతున్నావ్ అనుమానపడుతున్నావ్ అంటాడు, అయినా భాద్యత గల తండ్రి లేకపోతే భయపడాలి గాని నీకుండు దీప అంటాడు, అప్పుడు దీప ఆలా అని అన్ని భాద్యతథాలు  తండ్రి మీదకే నెతీయకూడదు కదా అంటుంది దీప, అప్పుడు కార్తీక్ థాంక్స్ దీప నేను సూర్య తండ్రి అని ఒప్పుకున్నందుకు అంటాడు, తన గురుంచి నువ్వు ఏం భయం పెట్టుకోకు, ఎప్పుడు హ్యాపీ గానే ఉంటుంది దీప అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్, వెళ్తూ దీప ని చూస్తూ మనసులో నువ్వు మనఃస్ఫూర్తిగా నవ్వితే చూడాలని ఉంది దీప అని అనుకుంటూ వెళ్తాడు కార్తీక్.

జ్యోత్స్న కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దాసు…..

హాస్పిటల్ లో జ్యోత్స్న కి స్పృహ వస్తుంది, అప్పుడు పారిజాతం అసలు ఏం జరిగింది నువ్వెందుకు హాస్పిటల్ కి వచ్చావ్ అంటూ ప్రశ్నలు వస్తుంది, అప్పుడు శివన్నారాయణ నర్స్ తనని దిస్తుర్బ్ చెయ్యొద్దు అన్నాడు గా అన్ని కార్తీక్ చెప్పాడు కదా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి వస్తాను అంటూ వెళ్తాడు, అప్పుడు జ్యోత్స్న నన్ను బావ కాపాడాడ గ్రానీ అంటుంది, అప్పుడు దాసు లోపలి వచ్చి పారిజాతాన్ని బయటకు వెళ్ళమని జ్యోత్స్నా ని దాసు కోపం గా నువ్వు ఆక్సిడెంట్ ఎందుకు చేసావ్ అని అడుగుతాడు, అప్పుడు జ్యోత్స్న ని నువ్వు పద్ధతి మార్చుకో నేను నీకు నా నోటితో వారసురాలు ఎవరో చెప్పను అని మాట ఇచ కదా, నువ్వు మాట మీద నిలబడాలి కదా అంటాడు, దీప ని ఎందుకు చంపాలని చూసావ్ నేను అంతా చూసాను, నువ్వు మాటలతో చంపుతావని తెసులు కానీ ఇలా హత్యలు కూడా చేస్తావ్ అనుకోలేదు, నువ్వు నాకు దూరం అయిపోయిన తర్వాత నేను కాసి గాడి కోసం బ్రతికాను, ఇప్పుడు అయితే నా వదిన వదిలోనుంచి దూరం అయినా బిడ్డ ని తనకు చేరవెయ్యాలని నేను బ్రతుకుతున్నాను, నువ్వు నా కాళ్ళమీద పది బ్రతిమిలాడవని నిజం ఎవరికీ చెప్పను అని నీకు మాట ఇచ్చాను, అందుకే నేను గీత గీసుకున్నాను నేను గీసిన గీత దాటితే ఏం వుతుందో నీకు తెలీదు అంటూ వార్నింగ్ ఇస్తాడు, ఈ లోగ శివన్నారాయణ కూడా లోపలి వచ్చేస్తాడు అందర్నీ వెళ్ళిపోమంటాడు, అప్పుడు శివన్నారాయణ  నేను డాక్టర్ తో మాట్లాడాను నువ్వేం బయపడకు రెస్ట్ తీస్క అని చెప్తాడు.

సూర్య దగ్గర నుంచి లాకెట్ లాక్కున్న కార్తీక్, దీప మనసులో కార్తీక్ గతం ఫై అనుమానం….

సౌర్య కార్తీక్ రూమ్ లో ఒక లాకెట్ చైన్ చూస్తుంది అప్పుడు అది నా కోసమేనా అంటుంది అప్పుడు కార్తీక్ ఇది నీకు కాదు నీకు వేరేది కొనిస్తా అంటాడు, అప్పుడు సౌర్య నాకు ఇదే కావాలి అంటూ అమ్మ చూడు నాన్న ఈ లాకెట్ చైన్ ఇవ్వమని చెప్పు అమ్మ అంటుంది, నేను ఏది అడిగిన ఇస్తాడు కదా ఇవ్వమని చెప్పమ్మా అంటుంది, అప్పుడు కార్తీక్ ఇది తప్ప ఏమైనా ఇస్తాను, నీకు అలాంటిదే వేరేది ఇస్తాను, ఇది మాత్రం అడగకు ఇది నాకు డైమండ్  కంటే ఎక్కువ అంటూ వెళ్ళిపోతాడు, అప్పుడు దీప సౌర్య ఏం అడిగిన ఇచ్చే కార్తీక్ బాబు దాని గురుంచి ఎందుకు అంటున్నారు, అంటే కార్తీక్ బాబు నాకు తీలిని ఎదో గతం ఉంది అనుకుంటుంది.

జ్యోత్స్న తో పారిజాతం నీకు బావ కావాలి కానీ ఇది టైం కాదు ఎందుకు అంత కంగారు పడటం అంటుంది, అప్పుడు జ్యోత్స్న నీకు దీప వారసు రాలు అన్న నిజం తీలిక ఇలా అంటున్నవ్ గ్రానీ అది నీకు చెప్పాలని కూడా నేను అనుకోవడం లేదు, ఎలా అయినా దీప ని దూరం చెయ్యాలని అనుకుంటుంది మనసులో.

Scroll to Top