జ్యోత్స్నా ముందు కార్తీక్ దీప తో కావాలనే క్లోజ్ గా మాట్లాడి తనని ఇంకా ఏడిపిస్తాడు….
కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, జ్యోత్స్నా కార్తీక్ కి దగ్గర అవ్వాలని, దీప కి దూరం చెయ్యాలని ఎంత గానో ప్రయత్నాలు చేసి కార్తీక్ ని ఆఫీస్ లో లేట్ నైట్ వరకు ఉంచేసింది, కార్తీక్ కార్ లోనే వెళ్లాలని ప్లాన్ వేసి తన డ్రైవర్ కి ఫోన్ చేసి వెళ్లిపొమ్మని చెప్తుంది, నేను బావ కార్ లో వస్తాను అని చెప్తుంది, కార్తీక్ దగ్గరకు వచ్చి బావ వర్క్ అయిపోయిందా వెళ్దాం పద నా కార్ వెళ్ళిపోయింది, నేను నీతోనే వస్తాను అంటుంది, అప్పుడు నేను వెళ్ళాలి నాకు చాల పనులు ఉన్నాయ్ అంటాడు కార్తీక్, అప్పుడు జ్యోత్స్నా ఏం పనులు బావ అంటూ ఉండగా దీప అదే టైం లో కార్తీక్ కి ఫోన్ చేస్తుంది, అప్పుడు కార్తీక్ అదే మంచి టైం అనుకుని దీప తో జ్యోత్స్నా ముందు కావాలనే దీప ఏమి అనేక పోయిన, ఏంటి దీప నాకోసం భోజనం కూడా చెయ్యకుండా ఎదురు చూస్తున్నావా, నేను వచ్చేస్తున్నలే నువ్వేం కంగారు పడకు దీప, ఇక్కడ మా కొత్త సీఈఓ మూడు రోజుల్లో చెయ్యలాడిన పని ని ఒక్కరోజు లోనే చేయించేసింది అందుకే లేట్ అయింది అంటాడు, అప్పుడు దీప కి జ్యోత్స్నా కార్తీక్ ని ఇబ్బంది పెడుతుందని అర్ధం అవుతుంది, అప్పుడు దీప తో కార్తీక్ కావాలనే జ్యోత్స్నా ముందు క్లోజ్ గా మాట్లాడుతూ వచ్చే తప్పుడు మల్లె పువ్వులు తీసుకురాన సరే దీప, వచ్చేస్తున్నలే ఎప్పటిలాగే కలిసి భోజనం చేద్దాం అంటూ ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్.
కార్తీక్ కార్ లో వెళ్లాలన్న జ్యోత్స్నా ప్లాన్ నెరవేరిందా..?
అప్పుడు కార్తీక్ ఏంటి రేపా, అంటే ఆఫీస్ లో ఓవర్ టైం వర్క్ చేస్తే నెక్స్ట్ డే లీవ్ ఉంటుంది అని ఇందిరెచ్త్ గా రేపు ఆఫీస్ కి రానని జ్యోత్స్నా కు అర్ధం అయ్యేక చెప్తాడు కార్తీక్, ఇంకా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతూ, బాయ్ అంటాడు జ్యోత్స్నా తో, అప్పుడు ఆమె నేను కూడా నీతో వస్తాను అంటుంది, అప్పుడు కార్తీక్ నీ కార్ లో నువ్వు వేళ్ళు నా కార్ లో నేను వెళ్తాను అంటాడు, అప్పుడు నా కార్ లేదు బావ నీతోనే వస్తాను అంటుంది, అప్పుడు అతను కుదరదు కావాలంటే క్యాబ్ బుక్ చేస్కో అంటూ వెళ్ళిపోతూ, వెనక్కి తిరిగి అవును ఇందాక ఎవరి కోసం వెళ్ళాలి అన్నావు కదా, మా ఆవిడా కోసం అని చెప్పి, మా ఆవిడా వెయిటింగ్ అంటూ దీప దీప మై డియర్ దీప అనుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాడు కార్తీక్.
కార్తీక్ అడగ కుండానే తన భాదను అర్ధం చేస్కుని, తన తలకు జండూబాల్మ్ రాసిన దీప…
దీప ఇంట్లో ఎదురుచూస్తూ సోఫా మీద నిద్రపోతుంది, కార్తీక్ దీప ని చూసి తన దగ్గరకి వెళ్లి లేపుతాడు, దీప ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దురు అంటుంది, కార్తీక్ స్నానం చేసి వస్తాడు, కార్తీక్ కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది, అప్పుడు అతను దీప ని నువ్వు కూర్చో దీప ఇద్దరం కలిసి తిందాం నువ్వు తినలే అని నాకు తెల్సు అని చెప్పి దీప ని కూడా తిన మంటాడు, అప్పుడు ఇద్దరు భోజనం చేస్తుంటారు, దీప మనసులో జ్యోత్స్నా నా గురుంచి కార్తీక్ బాబు ని కావాలనే ఇబ్బంది పెడుతున్నట్టుంది, ఈ మధ్య బాగా అలసిపోతున్నారు అనుకుంటుంది, కార్తీక్ బయట చైర్ లో కూర్చుని ఓవర్ వర్క్ లోడ్ తో పని చేస్తే ఇలానే ఉంటుందని అనుకుని వెనక్కు చైర్ లోనే పడుకుంటాడు, అప్పుడు దీప వచ్చి కార్తీక్ కి జండూబాల్మ్ రాస్తుంది, అప్పుడు కార్తీక్ తో నాకు కాంచనమ్మ గారు చెప్పారు మీకు తలనొప్పి వస్తే జండూబాల్మ్ నే వాడతారని అందుకే అంటుంది, అప్పుడు కార్తీక్ నేనేం అడగలేదు గా , నువ్వు రాయి పీడా అంటాడు, అప్పుడు జండూబాల్మ్ రాస్తూ జ్యోత్స్నా మీరు సొంతం అయ్యేవరకు మిమ్మల్ని వదలదు బాబు, తనని పెళ్లి చేస్కోండి అంటుంది, అప్పుడు కార్తీక్ దీప చేతుల్లో ఉన్న జండూ బలం ని తీస్కుని అది ఇలా ఇవ్వు నేనే రాస్కుంటా అంటూ, నీ మాటలు వింటుంటే నాకు ఇంకా తలనొప్పి పెరుగుతుంది అంటాడు, అప్పుడు దీప తాను మీ గురుంచే ఆశలు పెట్టుకుంది బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ నేను కాదు అది పెద్దలు అనుకున్నారు, నేను మొదటి నుంచి నేను వద్దు అనే అన్నాను, నువ్వే చేసుకోమన్నావు, సరే అనుకుంటే మా తాత అది కూడా జరగకుండా చేసాడు, అయినా పెళ్లి అయ్యాక కూడా నా వెంట పడమని నేను అన్నానా అంటాడు.
దీప ని చంపడానికి రౌడీ లను పెట్టిన జోత్స్నా…..
జ్యోత్స్నా దీప కోసం రౌడీ లను ఏర్పాటు చేస్తుంది, పారిజాతం నాకు చెప్పకుండా ఎందుకు ఆలా చేశావ్ అంటుంది, అప్పుడు తాను నేనేం చిన్నపిల్లను కాను గ్రానీ నేను మెచుర్ ని అంటుంది, ఈ లోగ రౌడీ వస్తాడు, అతనికి అడ్వాన్స్ ఇచ్చి దీప ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తుంది, అవి తీస్కుని ఆ రౌడీ ఇక మీ పని అయిపోయినట్టే దీపని నేను చంపేస్తాను అంటాడు. అప్పుడు పారిజాతం ఇంత విలోట్న్ గా ఉన్నదేంటి, అయినా దీప ని ఎందుకు అంత అర్జెంటు గా చంపేయాలని ఉంది అంటుంది, అప్పుడు జ్యోత్స్నా బావ కోసం ఆస్థి కోసం అంటుంది, అప్పుడు పారిజాతం బావ కోసం అంటే సరే ఆస్థి కోసం దానెందుకు చంపాలి అంటుంది, అప్పుడు జ్యోత్స్నా బావ ని పెళ్లి చేసుకుంటే తన ఆస్థి కూడా నాకే వస్తుందని ఆలా అన్నలే గ్రానీ అంటుంది.
దీప ని చంపడానికి ఫోన్ చేసి తనని బయటకు రప్పించిన రౌడీ….
ఆ రౌడీ కి దీప ఫోన్ చేసి మీ పాపా ఆడుకుంటూ స్కూల్ లో పడిపోయింది, మీరు త్వరగా రండి నేను స్కూల్ నుంచి చేస్తున్నాను అంటాడు, అప్పుడు దీప కంగారుగా సౌర్య మల్లి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఈ సారి నేనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలని వెళ్తుండగా అనసూయ ఏం అయింది కంగారు గా ఉన్నవ అంటుంది, అప్పుడు దీప జరిగింది ఆమెతో చెప్పి స్కూల్ కి వెళ్తుంది.