Guppedantha Manasu Serial Today Episode 19-04-24

గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. మహేంద్ర దేవయాని తో ఇన్విటేషన్ గురుంచి చెప్పగా ఆ ఇన్విటేషన్ ఏంటా అని ఫణేంద్ర శైలేంద్ర దేవయాని అనుకుంటూ ఉంటారు. శైలేంద్ర డాడ్ కొంప తీసి బాబాయ్ వేరే కాలేజ్ పెట్టి మనూ ని md ని చేద్దాం అనుకుంటున్నాడంటావా అంటాడు శైలేంద్ర. అప్పుడు ఫణేంద్ర శైలేంద్ర నీకు బుర్ర లేదా అందుకే నిన్ను తిట్టేది అంటాడు ఇప్పటికిప్పుడు  కాలేజ్ ఎలా ఓపెన్ చేస్తాడు రా అంత డబ్బు ఎలా వస్తుంది అంటాడు  ఫణేంద్ర. కార్ లో ఫణేంద్ర వసుధారా వెళ్తుండగా, వసుధారా అనుపమ మేడం చాల బాధ పడుతున్నారు మావయ్య అంటుంది వసుధారా మహేంద్ర తో. అప్పుడు మహేంద్ర అనుపమ కొత్తగా బాధ పాడటానికి ఏముంది అమ్మ, తను బాధల్లోనే ఉంది కానీ , లోపల అంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతుంది, మన సమస్యలు తీర్చడానికి వచ్చింది అంటాడు మహేంద్ర. అప్పుడు వసుధారా అయినా మీరు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు తర్వాత  మనూ తండ్రి నిజం గా వస్తే దాని వల్ల ఏమైనా సమస్య రావచ్చు కదా మావయ్య అంటుంది వసుధారా. ఆలా అయినా నిజం బయట పడుతుందనే కదా నేను ఇదంతా చేసేది, నీలానే నేను చాల రిక్వెస్ట్ చేశాను అన్ని ప్రయత్నాలు చేశాను నిజం బయట పెడతారని అనుపమ నిజం చెప్పాలనే ఇదంతా చేసేది, అనుపమ నోరు తెరచి చెప్పిందంటే చాలు నేనే వాళ్ళ నాన్న ని తీసుకొచ్చి ముందు పెడతాను, కానీ అనుపమ నిజం చెప్పేంత వరకు మనూ ని నా కొడుకు లనే చూసుకుంటాను, ఒకకుంటుంబానికి తండ్రి ఎలా అయితే రక్షణ గా ఉంటాడో నేను మనూ ని అలానే చూసుకుంటాను అంటాడు మహేంద్ర వసుధారా తో. మహేంద్ర వసుధారా ఫణేంద్ర ఇంటికి వస్తారు, ఏం అయింది  మహేంద్ర అని ఫణేంద్ర అంటాడు , అప్పుడు మహేంద్ర మొన్న నేను తీసుకున్న  నిర్ణయం  కొంత మందికి నచ్చింది కొంత మందికి నచ్చలేదు, మీరంతా పరువు గురుంచి ఆలోచించారు కానీ నేను నిందలు మోస్తున్న ఒక తల్లి కొడుకుల బాధ గురుంచి ఆలోచించాను , ఇక మీదట వాళ్ళు ఆలా బాధ పడకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను అంటాడు  మహేంద్ర. నిర్ణయమా ఏంటది అంటాడు  ఫణేంద్ర. అప్పుడు మహేంద్ర మనూ ని దత్తత తీస్కోవాలనుకుంటున్నాను అంటాడు  మహేంద్ర, మహేంద్ర ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు, ఆలోచించే ఈ నిర్ణయం తీస్కున్నావా అంటాడు  ఫణేంద్ర. అప్పడు దేవయాని ఆలోచిస్తే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు  కాకపోతే ఏంటి ఇదంతా, సరే మనూ కి తండ్రి లేడు, తల్లి ఉంది కదా అలాంటప్పుడు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏం ఉంది అంటుంది దేవయాని. శైలేంద్ర అదేంటి బాబాయ్ అంటే రిషి ని వదిలేసినట్టేనా అంటాడు, అప్పుడు మహేంద్ర ఎం మాట్లాడుతున్నావ్ శైలేంద్ర రిషి నాకొడుకు అంటాడు . అప్పుడు శైలేంద్ర లేకపోతే ఏంటి  రిషి ని  తీసుకొస్తా అని ఎన్ని రోజులు అయింది , ఇప్పటి వరకు ఏమి తెలీలేదు, ఇప్పుడేమో కొత్తగా మనూ ని  దత్తత తీసుకుంటాను అంటున్నారు అసలు ఏమైనా అర్ధం అవుతుందా అంటాడు శైలేంద్ర, ఇందుకు నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు మహేంద్ర నువ్వు ఒప్పుకునేది  ఏంటి అంటాడు మహేంద్ర శైలేంద్ర తో. అప్పుడు ఫణేంద్ర , ఏ శైలేంద్ర  నువ్ కొంత సేపు సైలెంట్ గా ఉంటావా అంటాడు ఫణేంద్ర , అమ్మ వసుధారా నువ్వయినా మహేంద్ర కి చెప్పు అమ్మ అంటాడు ఫణేంద్ర వసుధారా తో . అప్పుడు వసుధారా ఈ విష్యం లో మావయ్య చాల కచ్చితం గా నిర్ణయం తీసుకున్నారు నేను కూడా ఇది సరైన నిర్ణయం అనుకుంటున్నా అంటుంది వసుధారా. అప్పుడు ఫణేంద్ర అదేంటి నువ్వు కూడా ఆలా అంటే ఎలా అమ్మ అంటాడు ఫణేంద్ర. ఫణేంద్ర మహేంద్ర ఆ రోజు నువ్వు వాళ్ళు ఎదో బాధల్లో ఉన్నారని ఆలా చేసావ్ కానీ ఇప్పుడు నువ్వు మనూ ని దత్తత తీసుకుంటాను అనడం కరెక్ట్ కాదు మహేంద్ర అంటాడు ఫణేంద్ర, మనం ఇప్పటికే రిషి కనిపించక చాల బాధ పడుతున్నాం, ఇలాంటి సమయం లో మనూ ని దత్తత తీస్కుని మరింత సమస్యలు తెచ్చుకోవడం అవసరం అంటావా అంటాడు ఫణేంద్ర మహేంద్ర తో, ఆ మనూ మన కాలేజ్ కి హెల్ప్ చేసాడు మన కుటుంబం కష్టాల్లో ఉంటె అండగా ఉన్నాడు నేను కాదు అనడం  లేదు, అందుకు నువ్వు ప్రతి ఫలం గా తనకు అండగా ఉండాలి కానీ ఇలా మాత్రం చెయ్యకు మహేంద్ర, ప్లీజ్ మహేంద్ర ఈ విష్యం లో నా మాట విను అంటాడు ఫణేంద్ర . అప్పుడు మహేంద్ర సారీ అన్నయ్య మీ మాట కాదు అన్నందుకు, నేను ఇంత వరకు మీ మాట కాదు అనలేదు కానీ ఇప్పుడు అనాల్సివచ్చింది నన్ను క్షమించండి అన్నయ్య అంటాడు మహేంద్ర. అప్పుడు దేవయాని అదేంటి ఆలా అంటావ్ అనగానే అప్పుడు మహేంద్ర వదినగారు నేను మీ పర్మిషన్ తీసుకోడానికి రాలేదు ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చానుఅంటాడు మహేంద్ర దేవయాని తో. ఇన్విటేషన్ కార్డు ని ఫణేంద్ర కి ఇస్తాడు  మహేంద్ర, అన్నయ్య మీరు తప్పకుండ రావాలి, వచ్చి నన్ను మనూ ని ఆశీర్వదించాలి , అమ్మ ధరణి నువ్వు కూడా రామ్మా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర.

                                        శైలేంద్ర మనూ కి ఫోన్ చేస్తాడు , అప్పుడు మనూ లిఫ్ట్ చెయ్యడు మల్లి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తాడు మనూ. అప్పుడు శైలేంద్ర అబ్బబ్బబ్బా ఎం ప్లానింగ్ రా మామూలోళ్లు కాదురా మీరు అంటాడు శైలేంద్ర నువ్వు చేసావా మీ మమ్మీ ప్లేన్ న అంటాడు. అప్పుడు మనూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు మనూ శైలేంద్ర ని . అప్పుడు శైలేంద్ర మనూ మొత్తం కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం నువ్వే చేస్తూ ఏం తెలీనోడిలాగా ఏం నటిస్తున్నావ్ రా ఈ ప్లేన్ మీ ఇద్దరు చేసారా నువ్ ఒక్కడివేనా అంటాడు శైలేంద్ర, అప్పుడు మనూ కి అర్ధం కాకా నువ్ సోది కబుర్లు చెప్తుంటే నేను వినను అంటూ  ఫోన్ కట్ చేస్తాడు . శైలేంద్ర మల్లి మనూ కి ఫోన్ చేస్తాడు, నీకు మేటర్ తెల్సు కదా నేను ఏం మాట్లాడుతానో అని ఫోన్ కట్ చేస్తున్నావ్ ఇంతకు మా బాబాయ్ నిన్ను దత్తత తీసుకునే  ప్లేన్ నీదా, మీ మమ్మీ దా. ఇది నువ్వు మీ మమ్మీ వేసిన ప్లేన్ కదా అంటాడు శైలేంద్ర. అప్పుడు మనూ శైలేంద్ర ని ఏం మాట్లాడుతున్నావ్ మీ బాబాయ్ నన్ను దత్తత తీస్కువడం ఏంటి నన్ను అడగకుండా ఆలా ఎలా తీసుకంటారు అంటాడు మనూ. అప్పుడు శైలేంద్ర ఏమి  ఆక్టింగ్, నీకు తెలీకుండానే మా బాబాయ్ మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇస్తాడా మా మామ్ అండ్ డాడ్ ఎంత చెప్తున్నా వినలేదు అంటాడు శైలేంద్ర. అవును ఇది  ఎప్పటి నుంచో అనుకుంటున్నా ప్లేన్ నా ఈ మధ్యనే వేసుకున్న ప్లేన్ నా అంటూ మనూ ని అవహేలగా మాట్లాడుతాడు శైలేంద్ర, 1st మీ మమ్మీ వచ్చారు మా ఇంట్లో సమస్యలని తీరుస్తా అంటూ వద్దన్నా ఇన్వొల్వె అయ్యారు, అనుపమ గారు ఇంటికొచ్చినప్పుడు రిషి కనిపించకుండా పోయాడు, 2nd కాలేజ్ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు దిగావు , అది నువ్వు అనుకుని వచ్చావా లేదంటే మీ మమ్మీ ప్లేన్ నా మీరు ఇద్దరు ప్లానింగ్ వేసుకుని వచ్చారా అంటూ, కొంప తీసి  మీ అసలు తండ్రి ని చంపేసారా ఏంటి అంటూ మాట్లాడతాడు శైలేంద్ర మనూ తో. అప్పుడు మనూ కోపం గా మహేంద్ర ని కలవడానికి వెళ్తాడు.

Scroll to Top