High Speed Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. గంటకు 280 K.M Speed

టెక్నాలజీస్ మన దేశం ఎన్నో ముందడుగులు వేస్తుంది, వేరే దేశాలతో పాటు  మన దేశంలో గత కొన్నేళ్లలో రైల్వే శాఖలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వందే భారత్ రైళ్లు, వందే భారత్ మెట్రో రైళ్లు ఇప్పటికే పట్టాలెక్కి పరుగులు తీస్తుండగా,  వందే భారత్ స్లీపర్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లు పట్టాలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లో హైస్పీడ్ రైళ్లు కూడా పరుగులు పెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. తాజాగా వెల్లడించారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానాన్ని అందించారు. ఇందులో హైస్పీడ్ రైళ్ల గురించి కీలక విషయాలను అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

మన దేశంలో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా హైస్పీడ్‌ రైళ్లు రానున్నాయని తెలిపారు. ఈ హైస్పీడ్ రైళ్ల తయారీకి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభం అయినట్లు తెలియజేసారు. ఇప్పటివరకు మన దేశంలో ఏ రైలూ పరిగెత్తని విధంగా గంటకు 280 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈ హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేలా తీర్చిదిద్దుతున్నారని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్-బీఈఎంఎల్‌తో కలిసి తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ-ఐసీఎఫ్‌లో ఈ హైస్పీడ్ రైళ్ల డిజైన్, తయారీ కొనసాగుతోందని రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు.

Scroll to Top