India Constitution Day: రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం:Drowpadhi…

దేశ రాజ్యాంగం సజీవ ప్రగతిశీల దస్త్రం అని దాని ద్వారా సామాజిక న్యాయం సమ్మిళిత సమగ్రాభివృద్ధి వంటి లక్ష్యాలను సాధించినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేసారు, కొన్నేళ్ల నుంచి కేంద్రం దేశంలోని అనేక వర్గాలు ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నట్లు తెలియజేసారు, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ నాణాన్ని తపాళా బిళ్ళను ఆవిష్కరించారు. మైథిలీ సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు, ఈ సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు భాగస్వాములు అయినట్లు గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్ల చట్టంతో మహిళా సాధికారత దిశగా కొత్త శకం మొదలైనట్లు చెప్పారు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వివరించిన రాష్ట్రపతి కేంద్ర సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. 75 ఏళ్ల క్రితం ఆమోదించిన రాజ్యాంగం పై చర్చించేటప్పుడు రాజ్యాంగ సభ నిర్దేశించిన నిర్మాణాత్మక గౌరవప్రదమైన సంప్రదాయాన్ని అనుసరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా  సూచించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 వ వార్షికోత్వాన్ని పురస్కరించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బిర్లా రాజ్యాంగంలో దేశంలోని భౌగోళిక సామాజిక వైవిధ్యాన్ని మిళితం చేసేందుకు రాజ్యాంగ సభ మూడేళ్ళు కష్టపడిందని గుర్తు చేశారు, నిర్మాణాత్మక గౌరవప్రదమైన చర్చలను ఈ రాజ్యాంగ సభ చూసిందన్న బిర్లా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని సభ్యులకు సూచించారు, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ గ్లిమ్స్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ అనే పుస్తకాలను ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.

Scroll to Top