Kathika Deepam 2 Serial Today Episode 19-04-24

కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఏం అయింది చూద్దాం. సౌర్యకి కొన్న బట్టలు తీస్కుని దీప కార్తీక్ కి ఇచ్చేయాలనుకుంది, కార్తీక్ ని దీప ఎందుకు సౌర్య కి దగ్గర అవుతున్నారు జాలిచూపిస్తున్నారా, తనని చూసుకోడానికి నేను ఉన్నాను అంటుంది దీప కార్తీక్ తో. అప్పుడు కార్తీక్ నేను ఒక ఫ్రెండ్ ని అనుకోవచ్చు కదా అంటాడు కార్తీక్. నేను అనుకోను, మీ నీడను కూడా నేను భరించలేను , మీ దయ దాక్షిణ్యాలు నాకు అవసరం లేదని ఈ బట్టలు మీ మోహన కొడదాం అనుకున్నాను , ఎందుకు  మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు అంటుంది దీప, అప్పుడు కార్తీక్,  సౌర్య చిన్న పిల్ల తనకి  చిన్న చిన్న ఆశలు ఉంటాయి అంటాడు కార్తీక్. అప్పుడు మీరెవరు దాన్ని పట్టించుకోడానికి అంటుంది దీప కార్తీక్ ని. అప్పుడు కార్తీక్ మీరెందుకు మా అత్తయ్య ని ఆ రోజు కాపాడారు, మీరు కాపాడటం వెనుక ఏమి లేనిప్పుడు, నేను ఇలా ఉండటం లో ఏ దురుద్దేశం ఉంటుంది అంటాడు కార్తీక్, వెనక ముందు ఆలోచించ కుండా మా అత్త ని కాపాడారు మీ ప్రాణాలు గురుంచి ఆలోచించ కుండా ఆలా చేసారు, కొన్ని సహాయాలకి మనసు ఉంటె చాలు అంటాడు కార్తీక్. అప్పుడు దీప మనసుల గురుంచి మీరు మాట్లాడొద్దు, మీ నుంచి ఎలాంటి సాయం మాకు వద్దు, ఈ ప్రేమలు సహాయాలు మీ నుంచి నేను భరించలేను, డ్రెస్ వద్దు అంటే సౌర్య బాధపడుతుందని ఏం అనలేదు, మేము ఇక్కడ నుంచి వెళ్లేంత వరకు మమ్మల్ని ఇలా ప్రశాంతం గా ఉండనివ్వండి అంటుంది దీప. అప్పుడు కార్తీక్ నేను అతన్ని షాపింగ్ మాల్ లో చూసాను అతను మాట్లాడలేదు, కనీసం ఏం జరిగిందో మీరైనా చెప్పండి నాకు తోచిన సాయం చేస్తాను అంటాడు కార్తీక్. తెసులుకుని ఏం చేస్తారు, నిజం గా నాకు సాయం చెయ్యాలనుకుంటే మీరు నా కూతురుకి దూరం గా ఉండాలి ఇదే మీ నుంచి నేను ఆశించే సహాయం అంటూ వెళ్ళిపోతుంది దీప. నరసింహ రెండో భార్య శోభా నరసింహ భోజనానికి కూర్చున్నాడు శోభా భోజనం పెట్టి కూర వేయలేదు, ఏంటి కూర వేయలేదు అంటాడు నరసింహ, అప్పుడు శోభా కారం ఉప్పు వేసి ఇవి తిను నీకు రోషం పౌరుషం లేవు అంటుంది శోభా నరసింహ ని. అప్పుడు నరసింహ ఏంటి అని అడగగా, ఆ దీప ఇక్కడే ఉంది, అది గనుక పోలీస్ దగ్గరికి వెళ్లిన, లేదా ఎక్కడైనా చచ్చిపోయిన నిన్ను తీస్కుని వెళ్లి జయల్ లో పెడతారు అప్పుడు నా పరిస్థితి ఏంటి, నువ్వు చేతకాని వాడివి అందుకే దాన్ని ఇక్కడ నుంచి పంపించలేక పోతున్నావ్ అంటూ నర్సింహా ని తిడుతుంది శోభా, దీప ఇక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవాలి అంటూ లోపలికి  వెళ్లి పోతుంది. అప్పుడు నరసింహ, దానికి నేను అంటే భయం లేదు దాన్ని ఎలా అయినా పట్టుకుని చంపేస్తాను, దానికి మనశాంతి లేకుండా చేస్తాను, దాని పని వాడి పని ఇద్దరి పని చెప్తాను ఈ ఊరి నుంచి ఎలా అయినా వెళ్లిపోయేలా చేస్తాను అనుకుంటాడు నరసింహ దీప గురుంచి. జ్యోత్స్న తెచ్చిన చీర బాగుంది అంటూ కార్తీక్ తల్లి తండ్రులు ఆనందం గా ఉంటారు, నువ్వెందుకు తీసుకోలేదు కార్తీక్ అంటారు. అప్పుడు కార్తీక్ నేను మీకు ఒక విష్యం చెప్పాలి అని జ్యోత్స్న గురుంచి చెప్తుండగా, అప్పుడు కార్తీక్ తల్లి కార్తీక్ తో, నువ్వు జ్యోత్స్న ని దూరం పెట్టకు రా, మా అన్నయ్య ని కూతురు పుట్టాం గానే నేను నా కోడలిని చెయ్యాలని అడిగాను మా అన్నయ్య మీద ప్రేమతో నేను నా కోడలి ని కావాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా నా కోడలి ఇష్టాన్ని కాదనకు అంటుంది కార్తీక్ తల్లి.

                                            సౌర్య కనిపించడం లేదేంటి అని వెతుకుతుండగా, సౌర్య స్కెచ్ వేస్తూ కనిపిస్తుంది ఆ కలర్ పెన్సిల్స్ ఎక్కడివి అంటుంది దీప సౌర్య ని. నేనే కార్తీక్ ని కొనమన్నాను అమ్మ అంటుంది సౌర్య. అప్పుడు దీప నీకు ఏమైనా కావాలంటే నన్ను అడగాలి గాని ఇంకెవ్వరిని అడగకూడదు అంటుంది దీప సౌర్య ని. దీప పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా, సౌర్య వచ్చి తాను వేసిన డ్రాయింగ్ దీప కి ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ అంటుంది సౌర్య. ఆ పేపర్ ఎగిరిపోతుండగా కార్తీక్ తీసుకుంటాడు, అప్పుడు సౌర్య కార్తీక్ అది నేను మా అమ్మ కి ఇచ్చిన గిఫ్ట్ ఈ రోజు మా అమ్మ పుట్టిన రోజు అంటుంది సౌర్య కార్తీక్ తో. కార్తీక్ లోపలి వెళ్ళిపోతాడు. సౌర్యా అమ్మ, నా డ్రాయింగ్ ఎలా ఉంది చెప్పు అంటుంది. అప్పుడు దీప నా కూతురు బాగా వేసిందిగా అంటూ మెచ్చుకుంటుంది. అప్పుడు దీప ఈ రోజు జ్యోత్న పుట్టినరోజు కి ముగ్గు వేస్తున్న కదా నువ్వు వెళ్లి పువ్వులు తీసుకురా అంటుంది దీప సౌర్య ని. అప్పుడు సౌర్య ఆమ్మో పువ్వులు కొస్తే గొడవలు అవుతాయి నాకు భయం అంటుంది సౌర్య, అప్పుడు దీప నువ్వు ఇంకా అది మర్చిపోలేదా, ఇది వీళ్ళ ఇంటిముందు వేస్తున్న ముగ్గు, ఇవి వీళ్ళ పూవులు ఏం కాదు కోసి తీసుకురా అంటుంది దీప.

Scroll to Top