అల్లు అర్జున్ అరెస్ట్…!, షాక్ లో అల్లు ఫాన్స్..

డిసెంబర్ 4న రిలీజ్ అయిన పుష్ప-2 మూవీ బెనిఫిట్ షో కి ఆర్ టీసి క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది, అయితే అతను ఒక సెలెబ్రెటీ, అయినప్పటికీ పోలీస్ లకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా వెళ్లడం వల్ల థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది, కనీసం సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారు, అయితే అక్కడ జనాలు ఎక్కువగా రావడం వల్ల తొక్కిసలాట జరిగి నిండు ప్రాణం బలయిపోయింది, అల్లు అర్జున్ నిర్లక్ష్యం, థియేటర్ యాజమాన్య నిర్లక్ష ధోరణి, జనాల విచక్షణ రహితంగా,  క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించడం వల్ల నిండు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన లో

ఒక్కటే కుటుంబానికి చెందిన రేవతి అనే మహిళా మరణించగా, ఆమె కుమారుడు తీవ్రం గా గాయపడ్డాడు, అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీస్ లు అక్కడికి రావడం వలన కానిస్టేబుల్ అతనికి సి పి ఆర్ చెయ్యడం జరిగింది, అయితే పరిస్థితి విషమం గా జరగడం తో ఎస్ ఐ మరియు తదితర పోలీస్ లు అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి లేడీ ఎస్ ఐ మౌనిక తన సొంత డబ్బుతో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది, కుమారుని సమాచారం తెల్సుకున్న తన తండ్రి హాస్పిటల్ కి రాగ తన భార్య కోసం తన స్మార్ట్ ఫోన్ లో ఉన్న వారి ఫోటో చూసారు పోలీస్ లు, అయితే థియేటర్ వద్ద అప్పటికే మరణించిన తన భార్య గురుంచి చెప్తే అప్పటికే అనారోగ్యం తో భాదపడుతున్న అతని భర్త తట్టుకోలేరని పోలీస్ లు వెంటనే చెప్పకుండా జాగ్రత్త వహించారు.

రేవతి లేదన్న భాదను తట్టుకోలేని తన కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చెయ్యడం జరిగింది, అయితే అల్లు అర్జున్ రేవతి మరణానికి పరిహారం గా 25 లక్షల పరిహారం ని అందచేస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు, అయితే తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు, అల్లు అర్జున్ పై 105 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, అయితే కోర్ట్ ఆదేశాలకు మేరకు ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది, ప్రస్తుతం చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని రికార్డు చేస్తున్నారు. అయితే ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ బౌన్సర్లు ఫాన్స్ ని గెంటి వేశారని, దాని వల్లనే ఇలా జరిగిందని అల్లు అర్జున్ పర్సనల్ బాడీ గార్డ్ సంతోష్ ను అరెస్ట్ చేశారు.

అయితే థియేటర్ లో జరిగిన ఘటన పై అల్లు అర్జున్ వెంటనే స్పందించక పోవడం అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది, అయితే సంఘటన జరిగిన 48 గంటల తర్వాత మాత్రమే అతను స్పందించారని తెలిసింది, అయితే మరికొంత మంది తొక్కిసలాటలు అనేది ఎక్కడయినా జరిగేదే అని, దానికి వాళ్ళని తప్పు పెట్టడం కరెక్ట్ కాదని వెల్లడిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తన ప్రతి మూవీ సెంటిమెంటల్ గా అదే సంధ్య థియేటర్ లో మూవీ చూస్తారని, ఇప్పుడు కూడా అలానే వచ్చారని తెలిపారు.

Scroll to Top